twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Half Stories movie review.. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో హారర్ డ్రామా

    |

    నటీనటులు: జబర్దస్త్ మహేష్, రాకేందు మౌళి, శ్రీజ. కోటి, టీఎన్ఆర్, కంచెర్లపాలెం రాజు, టీఎన్ఆర్, జెమిని సురేష్ తదితరులు
    రచన, దర్శకత్వం: శివవర ప్రసాద్ కే
    నిర్మాత: ఎం సుధాకర్ రెడ్డి
    సినిమాటోగ్రఫి: చైతన్యకృష్ణ కందుల
    ఎడిటర్: సెల్వ కుమార్
    బ్యానర్: శ్రీ వెన్నెల క్రియేషన్స్
    సమర్పణ: బేబీ లలిత్యా
    రిలీజ్ డేట్: 2022-01-07

    పిన్నతల్లి వేధింపులు గురయ్యే లక్ష్మీ (శ్రీజ), చిన్నా (జబర్దస్త్ మహేష్), అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే శివ (రాకేందు మౌళి) స్నేహితుల జరిగే మోసాలు ఈ కథ ప్రధానంగా సాగుతుంది. అయితే డబ్బుతో వచ్చిన బ్యాంక్ క్యాష్ వ్యాన్ యాక్సిండెంట్‌కు గురికావడంతో వారికి అత్యాశ పడుతుంది. డబ్బు కాజేయడానికి ఒకరిపైమరొకరు కత్తులు నూరుకొంటారు.

    Half Stories movie review and rating

    అయితే లక్ష్మీ, శివ, చిన్నాల్లో ఎవరికి డబ్బు సొంతమైంది? డబ్బు చేజిక్కించుకొనే క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి? ఈ కథలో సినీ రచయిత సంపూ, నిర్మాతగా కోటి పాత్రలు ఏమిటి? ఇంకా పోలీస్ అధికారి శశికాంత్‌గా టీఎన్ఆర్, రాఘవ్‌గా జెమిని సురేష్, వాచ్‌మెన్ రాంబాబుగా కంచెర్లపాలం రాజు పాత్రల ప్రాముఖ్యత ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే హాఫ్ స్టోరిస్ సినిమా.

    హాఫ్ స్టోరీస్ సినిమా కొన్ని కథలు, పాత్రల సంకలనం. అయితే ఈ కథలో భాగంగా ప్రొడ్యూసర్‌కు చెప్పాలనుకొన్న కథను చెప్పమని శివను ఇద్దరు స్నేహితులు చెప్పడంతో కథలోకి వెళ్తుంది. ఆ తర్వాత ఆసక్తికరంగా పాత్రలు, కొన్ని ఎపిసోడ్స్ ఆలరిస్తాయి. దర్శకుడు రాసుకొన్న ట్రిక్కీ స్క్రీన్ ప్లే మెదడుకు పదును పెడుతుంది. అయితే ఈ సినిమాకు ప్రధానంగా సాగే కథ లేకపోవడం గందరగోళానికి గురిచేస్తుంది. కానీ ఒక్కో ఎపిసోడ్ థ్రిల్లింగ్‌కు గురిచేస్తుంది. అయితే ఈ హాఫ్ స్టోరిస్‌కు కొనసాగింపుగా రెండో పార్ట్ ఉంటుందనే సంకేతాలు ఇవ్వడంతో అసలు కథ, కథలకు ఏదో లింక్ రివీల్ చేసే అవకాశం ఉందనే ఫీలింగ్ కలుగుతుంది.

    శివగా సినీ గేయరచయిత రాకేందు మౌళి, గౌతమ్‌గా రాజీవ్, నిర్మాతగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి, రాఘవ్‌గా జెమిని సురేష్, శశికాంత్‌గా టీఎన్ఆర్, వాచ్‌మెన్ రాంబాబుగా కంచెర్లపాలం రాజు, రాజుగా నవీన్ రెడ్డి, విక్రమ్‌గా శశిధర్, లక్ష్మీగా శ్రీజ, ఆద్యగా అంకిత, డ్రైవర్ శేషుగా యోగి కత్రి, మేరిగా నవీనారెడ్డి, అభిగా అభిలాష్‌, కానిస్టేబుల్ సాంబయ్యగా ఆనంద్, చిట్టిబాబుగా మహీధర్ పాత్రలు ఆకట్టుకొనేలా ఉంటాయి. తమ పాత్రలకు తగినట్టుగా నటీనటులు నటించి మెప్పించారు.

    హారర్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే సన్నివేశాలకు మ్యూజిక్ డైరెక్టర్ కోటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. కొన్ని సన్నివేశాలను కోటి తన మ్యూజిక్‌తో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌ను కల్పించాడు. ఇక చైతన్య కందుల సినిమాటోగ్రఫి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కత్తి మీద సాముగా మారిన ఎడిటింగ్‌ ప్రక్రియను సెల్వకుమార్ సమర్ధవంతంగా నిర్వహించాడు. స్టోరీ ఫ్లోను స్మూత్‌గా ముందుకు తీసుకెళ్లడంలో తన ప్రతిభను చాటుకొన్నాడు.

    ఎం సుధాకర్ రెడ్డి పాటించిన నిర్మాణ విలువల కారణంగా సినిమాలో మంచి సాంకేతిక విలువలు, నటీనటుల ప్రతిభ బయటకు వచ్చాయని చెప్పవచ్చు. అయితే చెప్పుకోవడానికి ఒక కథగా లేకపోవడం ఈ సినిమా కాస్త కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కథ విషయాన్ని పక్కన పెడితే.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆద్యంతం ఆలరిస్తాయి. ప్రస్తుతానికి ఈ సినిమా హాఫ్ స్టోరీనే. రెండో పార్ట్ చూస్తే గానీ.. ఫుల్ స్టోరి ఏమిటో అర్ధం కాదని చెప్పవచ్చు. ఇది పక్కాగా ఓటీటీ ప్రేక్షకులను మప్పించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ కథను, కథలోని ఎపిసోడ్స్‌ను విస్తరిస్తే మంచి వెబ్ సిరీస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

    English summary
    Half Stories is a Suspense Thriller with some feel good moments. Directed by Shiva Vara Prasad, Produced by M Sudhakar Reddy. Released on January 07th, 2022.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X