HanuMan Review: సిల్వర్ స్క్రీన్‌పై హనుమాన్ విశ్వరూపం.. ప్రశాంత్ వర్మ టేకింగ్ ఎలా ఉందంటే? హనుమాన్ సమీక్ష
Rating: 3.25/5
అంజనాంద్రి గ్రామంలో హనుమంతు (తేజా సజ్జా) అల్లరి చిల్లరిగా తిరిగే అబ్బాయి. చిల్లర దొంగతనాలు చేస్తూ కాలం గడుపుతుంటాడు. ఆ గ్రామంపై పాలేగార్ల దౌర్జన్యాలు చేస్తూ ప్రజలను వేధిస్తుంటారు. అయితే బలహీనంగా ఉండే హనుమంతు వారిని ఎదురించడానికి ప్రయత్నించే క్రమంలో చావుదెబ్బలు తిని సముద్రంలో పడిపోతాడు. సముద్రం పడిన హనుమంతుకు దివ్యమైన రుధిరమణి లభిస్తుంది. ఆ తర్వాత ఊహించిన విధంగా అద్బుత శక్తి అతడికి లభిస్తుంది. అయితే హనుమంతు పరాక్రమశాలిగా మారిన విషయం తెలుసుకొన్న మైఖేల్ (వినయ్ రాయ్) ఆ గ్రామానికి వస్తాడు.
Recommended Video

అంజనా గ్రామంలో అంజనమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్)కు హనుమంతుకు ఉన్న బంధం ఏమిటి? గ్రామంలోని మీనాక్షి (అమృతా అయ్యర్) ప్రేమను పొందడానికి హనుమంతు చేసిన సాహసం ఏమిటి? పాలెగాళ్ల చేతిలో గాయపడి సముద్రంలో పడిపోయిన హనుమంతుకు అక్కడ ఏం జరిగింది? సూపర్ హీరో కావడం ద్వారా ప్రపంచాన్ని శాసించాలనుకొన్న మైఖేల్ దుష్టపన్నాగాలకు హనుమంతు ఎలా చెక్ పెట్టాడు. ఈ దుష్ట శక్తులను ఎదురించే క్రమంలో ఆంజనేయస్వామి అనుగ్రహం హనుమంతుకు ఎలా లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

మైఖేల్ తన బాల్యంలో సూపర్ హీరోగా మారడానికి తన కుటుంబానికి చేఆసిన ద్రోహం అనే పాయింట్‌తో సినిమాను డిఫరెంట్ జోన్‌లోకి తీసుకెళ్లాడు. హాలీవుడ్ ఫ్లేవర్‌తో కథను నడిపించిన ప్రశాంత్ వర్మ.. ఆ కథను అంజనాద్రి తీసుకెళ్లి హనుమంతు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ చేయడం చకచకా జరిగిపోతాయి. రుధిరమణి లభించిన తర్వాత కథ ఎమోషనల్‌గాను, అలాగే కామెడీ గాను సాగిపోతూ ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతుంది. సత్య, గెటప్ శ్రీను కామెడీ సినిమాను మరింత ఫన్నీగా మార్చిందని చెప్పవచ్చు. ఓ మంచి ట్విస్టుతో ఫస్టాఫ్‌ను ముగించి సెకండాఫ్‌పై అంచనాలు పెంచేలా డైరెక్టర్ చేశాడు.

ఇక సెకండాఫ్‌లో కొంత కంటెంట్‌ను సాగదీసినట్టు అనిపించినా.. మైఖేల్ క్యారెక్టర్ యాంగిల్ కథను నడిపించడంతో ఇంట్రెస్టింగ్ జోన్‌లోకి వెళ్లిందనే చెప్పాలి. చివరి 20 నిమిషాలు సన్నివేశాలు, క్లైమాక్స్ ఎపిసోడ్‌ను నడిపిన విధానం ఎక్ట్రార్డినరీగా ఉండటమే కాకుండా.. ప్రేక్షకులకు భక్తి భావంతో కూడిన ఎనర్జీని హైలెవల్‌లో ఇంజెక్ట్ చేశాడు. అంతేకాకుండా ఈ సీక్వెల్‌కు లీడ్ ఇవ్వడం ద్వారా ప్రేక్షకులను ఎదురు చూసేలా చేశాడని చెప్పవచ్చు.

టెక్నికల్ విషయానికి వస్తే.. వీఎఫ్ఎక్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫి హనుమాన్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సీట్లకు, తెరకు అత్తుకుపోయేలా సినిమాను రూపొందిచారు. ఎడిటింగ్, ఇతర విభాగాలు పనితీరు బాగున్నాయి. తాను నమ్మిన కథను ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను నిర్మించిన నిరంజన్ రెడ్డి అభినందించాల్సిందే. సినిమాపై ఉండే తన తపన, అభిరుచి ఏమిటో నిర్మాత చూపించారు.

డివైనిటీ, లవ్, ఎమోషన్స్, కామెడీ తదితర అంశాలతో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఫస్టాఫ్‌లో, సెకండాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీసినట్టు అనిపించినా.. క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్ మెంట్ కోసం తప్పలేదనిపిస్తుంది. కొన్ని విషయాలు లాజిక్ అందుకుండా ఉన్నా అవి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ కోసం తప్పదనిపిస్తుంది. కానీ హనుమంతుడిపై భక్తిభావం, హిందూ పురాణాలను గుర్తు చేసే విధంగా హనుమాన్ ఉంటుంది. ఈ సినిమా తప్పకుండా థియేటర్‌లోనే చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది. కాబట్టి ఈ సినిమాను థియేటర్ మిస్ చేసుకోకండి..


Click it and Unblock the Notifications











