twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుణ్‌సందేశ్ 'హ్యాపీ హ్యాపీగా' రివ్యూ

    By Srikanya
    |
    Happy Happy Ga
    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    సంస్థ: రంజిత్‌ మూవీస్‌
    నటీనటులు: వరుణ్ సందేశ్, వేగ, శరణ్యా మోహన్, ఎమ్.ఎస్.నారాయణ, రంజిత, అలీ తదితరులు.
    సంగీతం: మణిశర్మ
    పాటలు: సిరివెన్నెల
    నిర్మాత: దుర్గా ప్రసాద్ వడ్లమూడి
    దర్శకుడు: ప్రియా శరణ్
    విడుదల తేది: 20, ఆగస్టు 2010

    వరణ్ సందేశ్..ఓ లవ్ స్టోరీ..సైడ్ లో ఓ కామిడి ట్రాక్..ఫైనల్ గా చిన్న సెంటిమెంట్..ఇవి హిట్ ఫార్ములా దినుసులు అని ఫిక్స్ అయి రాసుకుని తీసుకుని తీసిన చిత్రం హ్యాపీ హ్యాపీగా. ఈ ఫార్ములాకు తమిళ దర్శకుడు జత కుదరటంతో అరవ మశాలా కూడా కలిసింది. అయితే ఫార్ములా వికటించి...లవ్ స్టోరీ సీరియస్ గా మారి, అందులో కామిడీ ట్రాక్ కలవక, సెంటిమెంట్ సీన్ కావాలని పెట్టినట్లయ్యి ఓ కిచిడీలా తయారైంది. అందులోనూ వరుణ్ సందేశ్...వరస ఫ్లాపులతో ఉండటంతో ఓపినింగ్స్ కూడా సరిగా తెచ్చుకోలేకపోయింది. సినిమా బాగుండే మౌత్ టాక్ స్ప్రెడ్ అయి నిలబడేది..కానీ మరో చరిత్రలా రేంజిలో సినిమా ఉండటంతో ప్రేక్షకులు నోట మాట రాని స్దితి.

    సంతోష్(వరుణ్ సందేశ్) అన్ని తెలుగు సినిమాల్లో లాగ ఓ అనాధ. నలుగురు స్నేహితులతో కలిసి కార్టూన్ గైస్ పేరుతో ఓ గిప్ట్ కార్నర్ తరహా వెరైటీ బిజెనెస్ చేస్తూంటాడు. తమకు కావాల్సిన వారుకి గిప్ట్ ఇవ్వాల్సి వస్తే సంతోష్ కి షాప్ కి ఫోన్ చేస్తే వాళ్ళు ఆ పని పూర్తి చేస్తూంటారు. మరో ప్రక్క ఉంటే సంతోష్ తన ఖాళీ టైమ్ లో ఎవరన్నా అమ్మాయి పడకపోతారా అన్నట్లు లవ్ లెటర్స్ పట్టుకు తిరుగుతూంటాడు. ఈ క్రమంలో అతనికి పూజ(వేగ) పరిచయమవుతుంది. వెంటనే ప్రేమలో పడిన అతను ప్రపోజ్ చేద్దామనుకునేసరికి..ఓ విషయం తెలుస్తుంది. అదేమిటంటే ఆమెకి లవ్ అంటే సదాభిప్రాయం లేదని. దాంతో స్టైయిట్ గా ఆమెను ప్రేమిస్తున్నాను అని చెప్పకుండా...తను ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నానని అబద్దమాడతాడు. ఎవరా చూపెట్టమని పూజ పట్టుబడితే...సంతోష్ అప్పటికప్పుడు తన కళ్ళకు కనపడిన అమ్మాయి ప్రియ(శరణ్యా మోహన్) ని చూపెడతాడు. అది నిజమే అనుకుని నమ్మిన పూజ వీరిద్దరనీ కలపాలని ప్లాన్ చేస్తుంది. ఈలోగా మరో ట్విస్ట్...ప్రియ మరెవరో కాదు...ఆ ఊళ్ళో ఉన్న పెద్ద డాన్ సూరి చెల్లెలు. అతనితి తన చెల్లి వంక ఎవరు చూసినా నచ్చదు..కాలో..చెయ్యో తీసేస్తాడు. ఇలాంటి పరిస్ధితుల్లో ఇరుక్కున్న సంతోష్ ఏం చేసాడు అన్నది మిగతా కథ.

    కథంతా ఒకే టోన్ లో లేకపోతే ఎంత సమస్య ప్రేక్షకుడుకి విసురుతుందో ఈ చిత్రం సోదారహణంగా చూపిస్తుంది. నిజానికి ఈ కథ పవన్ కళ్యాణ్ బద్రి లాంటి చిన్న స్టోరీ లైన్. అయితే రకరకాల ట్విస్టులు పెట్టి ఫీల్ తీసుకురావాలి, కామెడీ పండించాలనే తపనతో సినిమాని రకరకాలుగా మార్చేస్తాడు డైరక్టర్. ఏ నిముషం ఏ ట్విస్టు వచ్చి కథను మలుపుతిప్పుతుందో అని చూడాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది. లవ్ స్టోరీ చెప్పేటప్పుడు అనవసరంగా అలీ కామిడీ ట్రాక్ కథకు కలపకుండా ఉండి ఉండే ఫీల్ తో వేరే రకంగా ఉండేది. అలాగే ప్రేమ అంటే పడని పూజ పాత్ర ...ఎందుకని సంతోష్ ని అతను చూపెట్టిన అమ్మాయితో కలపాలని నిర్ణయించుకుంటుందనేది క్లారిటీ ఉండదు. అక్కడే ఆమె క్యారెక్టరైజేషన్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసి ఉండే కథ వేరే విధంగా ఉండేదేమో. వరుణ్ సందేశ్ గ్లామర్ ఎందుకునే తగ్గనట్లు అనిపిస్తోంది. దానికి తోడు యాక్షన్ హీరో అనిపించుకోవాలనో ఎందుకో గాని ఫైట్స్. అలాగే శరణ్య క్యారెక్టర్ ని అనవరసంగా అతి ఎక్కువై సెంటిమెంట్ కోసం చంపంసినట్లు తెలిసిపోతూంటుంది. ఇక విలన్ సూరి..కామిడినో, సీరియస్సో అర్ధం కాకుండా కొనసాగుతుంది. ఇక దర్శకత్వం గురించి చెప్పుకునేందుకు లేదు. మిగతా విభాగాలు దర్శకత్వంకి తగినట్లే నాసిగా ఉన్నాయి. అలాగే ఈ చిత్రంలో ఉన్న ఏకైక ప్లస్ మణిశర్మ సంగీతం ఒక్కడే...పుటుక్కు జరజర అనే పాట బాగుంది. తమిళ అమ్మాయిలు వేగ, శరణ్య ఇద్దరూ కథలో కుదురలేదు. శరణ్య అయితే మరీ చిన్న పిల్లలా హీరోకి చెల్లిలా అనిపిస్తుంది. అలీ అక్కడక్కడా నవ్వించినా అది అర్ధం లేని ట్రాకే. డైలాగులు అక్కడక్కడా బాగున్నా కథ తగ్గట్లే చాలా చోట్ల అనవరసంగా కావాలని పంచ్ లు విసురుతున్నట్లు ఉంటాయ. అలాగే మనస్సులో ప్రేమ ఉండి...ఎప్పుడూ కొట్టుకునే మొగుడూ పెళ్ళాలు...ఎమ్.ఎస్.నారాయణ, రంజిత ల సీన్స్ చాలా సినిమాల్లో ఆల్రెడీ చూసినవే కావటం మరో నస.

    ఫైనల్ గా ఎంతో ఫీలయి తీసినట్లున్న ఈ చిత్రాన్ని చూస్తే ఆ తర్వాత మనం కూడా ఎంతో ఫీలవుతామనేది నిజం. ఇంటర్వెల్ బ్యాంగ్., ట్విస్ట్ ల మీద పెట్టిన శ్రద్ద స్క్రీన్ ప్లే మీద కూడా పెట్టి ఉంటే...హ్యాపీ..హ్యాపీగా అనే టైటిల్ తీసిన వారికి, చూసిన వారికి జస్టిఫై అయ్యేది. ఇక ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేని ఈ చిత్రం వరుణ్ సందేశ్ కి మరో..మరో చరిత్ర, ఎవరైనా ఎపుడైనా...అంతే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X