Happy Raj Movie Twitter Review: హ్యాపీరాజ్ మూవీ ట్విట్టర్ రివ్యూ

సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగాను సక్సెస్ అయ్యారు. ఆయన నటించిన పలు చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా జీవీ ప్రకాష్ కుమార్ నటించిన మూవీ హ్యాపీరాజ్. రాజా ఎలెంజెయన్ దర్శకత్వం వహిస్తున్నారు. బియోండ్ పిక్చర్స్ బ్యానర్‌పై జైవరదా నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడు అబ్బాస్, జార్జ్ మర్యాన్‌ తదితరులు నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. సెల్వ ఆర్కే ఎడిటింగ్, మదన్ క్రిస్టోఫర్ సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మార్చి 27వ తేదిన హ్యాపీరాజ్ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే మార్చి 26న నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి. ఈ నేపథ్యంలో హ్యాపీరాజ్ సినిమాపై నెటిజన్లు అందించిన టాక్ ఏమిటీ? క్రిటిక్స్ రివ్యూ ఏమిటీ? అనే వివరాలు పరిశీలిస్తే...

Happy Raj Movie Twitter Review in Telugu  Is GV Prakash Kumars Movie hits the bulls eye

హ్యాపీరాజ్ అనేది తండ్రీ కొడుకుల మధ్య బలమైన భావోద్వేగ కథాంశంతో, వినోదాత్మక ఘట్టాలతో కూడిన ఓ ఫ్యామిలీ, రొమాంటిక్, కామెడీ చిత్రం. జార్జ్ మర్యన్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. జీవీ ప్రకాష్ కుమార్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అబ్భాస్ రీ ఎంట్రీ బాగుంది. శ్రీగౌరి ప్రియ, నాథన్ ప్రథాన తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. ఓవరాల్‌గా వినోదం, హృదయాన్ని హత్తుకునేలా ఈ చిత్రం ఉంది అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.

చివరి 15 నిమిషాల భాగంలో జార్జ్ మరియం పాత్ర సినిమాను నిలబెడుతుంది. అతని నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాను చూడదగినదిగా చేస్తాయి. లేదంటే ఈ సినిమా అంతటా పట్టికాడ- పట్టినామ రోటీన్ కథాంశంలోనే తిరుగుతూ ఉంటుంది. అక్కడక్కడా కొన్ని నవ్వులు వినిపించినా, మొత్తం మీద విసుగు పుట్టించింది. అబ్బాస్‌ను ఒక మూస పాత్రకు పరిమితం చేయకుండా ఇంకా మెరుగా ఉపయోగించుకుంటే బాగుండేదని ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు.

హ్యాపీరాజ్ మూవీ.. కుటుంబ గందరగోళాన్ని, నిజమైన హృదయాన్ని, భావోద్వేగాలను మేళవించిన ఆహ్లాదకరమైన తమి రొమాంటిక్ కామెడీ డ్రామా. అన్ని వయసుల వారికీ చక్కటి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్. విచిత్రమైన సన్నివేశాలు, సంస్కృతుల ఘర్షణల ద్వారా నవ్వులను పంచుతూనే.. భావోద్వేగాలు, సానుకూల సందేశాలతో హృదయాన్ని హత్తుకుని ఆరంభం నుంచి చివరి వరకు ఆసక్తిగా సినిమాను చూసేలా చేస్తుంది.

జీవీ ప్రకాష్ కుమార్.. అందమైన ఆశావాది అయిన పాత్రలో అద్బుతంగా నటించారు. అతని ఆకర్షణ, కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్‌లో లోతు ఆ పాత్రను తప్పక చూడదగినదిగా చేశాయి. శ్రీగౌరీ ప్రియ.. కావ్య పాత్రలో కొత్తదనాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చి తెరపై అద్భుతమైన కెమిస్ట్రీని సృష్టించారు. అబ్బాస్ బలమైన పునరాగమనం చేశారు. జార్జ్ మేరియన్ విలక్షణమైన తండ్రి పాత్రలో హాస్యం, హృద్యమైన క్షణాలను అద్భుతంగా పండించారు.

తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన మరియారాజా ఎలాంచెజియన్.. హాస్యం, సెంటిమెంట్‌ల చక్కటి మేళవింపుతో 2 గంటల 39 నిమిషాల నిడివి గల ఈ సినిమాను ఆసక్తికరంగా నడిపించారు. కొన్ని చోట్ల సాగదీసినట్లు అనిపిస్తాయి, ప్రారంభంలో కథనం చప్పగా ఉంటుంది, కానీ మిగతాదంతా హృద్యంగా, అత్యంత వినోదాత్మకంగా సాగే ప్రయాణంలో ఇవి చిన్న విషయాలే. ఈ సినిమా మీ ముఖంలో సంతోషాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడే మీ దగ్గరలోని థియేటర్‌లో చూడండి అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.

నాన్‌స్టాప్ కామెడీ ఎక్స్‌ప్రెస్.. అస్సలు మిస్ అవ్వొద్దు. నా రేటింగ్ 4/5. ఇది హ్యాపీరాజ్ డే. ఈ ఫన్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ని మీ దగ్గరలోని థియేటర్‌లో చూసేయండి. జీవీ ప్రకాష్ కుమార్ బ్రదర్‌కి కంగ్రాట్స్ అని ఓ ట్విట్టర్ యూజర్ కామెంట్ పెట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X