twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హ్యాపీ వెడ్డింగ్ మూవీ రివ్యూ

    By Rajababu
    |

    Rating:
    2.5/5
    Star Cast: నిహారిక కొణిదెల, సుమంత్ అశ్విన్, మురళీ శర్మ, నరేష్, పవిత్ర లోకేష్
    Director: లక్ష్మణ్ కార్య

    విభిన్న చిత్రాలను ఎంచుకొంటున్న మెగా డాటర్ నిహారిక, సక్సెస్ కోసం పరితపిస్తున్న ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ జంటగా నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్. పెళ్లి కథా నేపథ్యంగా రూపుదిద్దుకొన్న చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్ బ్యానర్‌, పాకెట్ సినిమా బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రానికి ఫిదా ఫేం శక్తికాంత్ సంగీతం అందించారు. ఫీల్‌గుడ్ మూవీ అని ప్రచారం జరిగిన ఈ చిత్రం జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిహారిక కెరీర్‌లో మరో విభిన్న చిత్రంగా నిలిచిందా? సుమంత్ అశ్విన్‌ను సక్సెస్ పలకరించిందా అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే హ్యాపీ వెడ్డింగ్ కథ, కథనాలు నటీనటుల, సాంకేతిక నిపుణుల ప్రతిభ గురించి తెలుసుకోవాల్సిందే.

    హ్యాపీ వెడ్డింగ్ స్టోరి

    హ్యాపీ వెడ్డింగ్ స్టోరి

    అప్పటికే విజయ్ ( రాజా)తో బ్రేకప్ జరిగిన అక్షర (నిహారిక కొణిదెల) మళ్లీ ఆనంద్‌ (సుమంత్ అశ్విన్)తో ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమ వారిని నిశ్చితార్థం వరకు తీసుకు వస్తుంది. అయితే ఏ కారణాల వల్ల బ్రేకప్ జరిగిందో అవే కారణాలు ఆనంద్‌ రిలేషన్‌లో రిపీట్ అవుతాయి. దాంతో పెళ్లికి కొద్ది రోజుల ముందు కన్‌ఫ్యూజన్‌లో పడిపోతుంది. పెళ్లికి తాను సిద్దంగా లేనందున నిర్ణయించుకోవడానికి కొంత సమయం కావాలని అక్షర అడుగుతుంది. ఓ దశలో విజయ్ మళ్లీ రిలేషన్ కొనసాగించడానికి మొగ్గు చూపుతుంది.

    కథలో మలుపులు

    కథలో మలుపులు

    విజయ్, నిహారిక రిలేషన్ కారణంగా బ్రేకప్ అయింది? ఆనంద్‌తో పెళ్లి వరకు వచ్చిన అక్షర ఎందుకు వెనుకంజ వేసింది. ఆనంద్, విజయ్‌లో అక్షరకు నచ్చని విషయాలు ఏమిటి? చివరకు విజయ్‌ని పెళ్లి చేసుకొందా? లేదా ఆనంద్‌తో పెళ్లి జరిగిందా? నిహారిక పెళ్లికి ముందు కథలో తిరిగిన మలుపులు ఏమిటి అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే హ్యాపీ వెడ్డింగ్ చిత్ర కథ.

    ఫస్టాఫ్ రివ్యూ

    ఫస్టాఫ్ రివ్యూ

    పెళ్లి సంబురాలలో ఉన్న ఫ్యామిలికి అక్షర యూటర్న్ తీసుకొందనే విషయాన్ని ఆనంద్ షాకివ్వడంతో కథ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లుంది. ఆనంద్, అక్షర నేటి యువతకు ఎంజాయ్ చేసే పబ్బులు, పార్టీల వ్యవహారంతో కథ చాలా ఫ్లాట్‌గా సాగుతుంది. కథా ప్రవాహంలో మధ్యలో ఫీల్‌గుడ్ డైలాగ్స్ పేల్చుతూ ఇంటర్వెల్‌ వరకు ఓ మోస్తారుగా లాక్కొచ్చే ప్రయత్నంలా ఉంటుంది. కాకపోతే ఒక ఎమోషన్ ఎపిసోడ్స్‌తో ట్విస్ట్ ఇవ్వడంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

    సెకండాఫ్ రివ్యూ

    సెకండాఫ్ రివ్యూ

    ఇక రెండో భాగంలో నిహారిక పెళ్లి చేసుకోవాలా వద్దా అని తీసుకొనే నిర్ణయాన్ని బేస్ చేసుకొని సింగిల్ పాయింట్ ఎజెండాతో కథ నడుస్తుంది. రకరకాల ఎమోషన్ సీన్లతో ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. కానీ సన్నివేశాలు బలంగా లేకపోవడంతో రెండో భాగం కూడా ఏదో నడుస్తుందంటే నడుస్తున్నదనే విధంగా సాగుతుంది. మళ్లీ చివర్లో అద్భుతమైన ఎపిసోడ్స్ ప్రేక్షకులను కన్విన్స్ చేస్తూ సినిమాను ముగించడంతో ఒకే, ఫర్వాలేదనే ఫీలింగ్ కలుగుతుంది.

    దర్శకుడి ప్రతిభ

    దర్శకుడి ప్రతిభ

    దర్శకుడు లక్ష్మణ్ కార్య ఎంచుకొన్న, ఊహించుకొన్న కథ చాలా సున్నితమైంది. కాకపోతే బలమైన సన్నివేశాలను రాసుకోలేకపోవడంలో తడబాటు కనిపించింది. తొలి భాగంలోనూ. రెండో భాగంలోనూ కొన్ని మంచి సీన్లతో లాగించి ఉంటే అద్భుతమైన పెళ్లి చిత్రంగా మారేది. ఎమోషన్స్‌కు సరిపడ్డ కథ, స్టోరిని మోసుకెళ్లడానికి నరేష్, తులసి, మురళీ శర్మ, పవిత్ర లోకేష్ లాంటి నటులు రెడీగా ఉన్నప్పటికీ దర్శకుడిలో ఫైర్ మిస్సయిందనే చెప్పవచ్చు.

    భావోద్వేగాల మధ్య నిహారిక

    భావోద్వేగాల మధ్య నిహారిక

    నేటితరం అమ్మాయి అక్షర పాత్రలో నిహారిక ఒదిగిపోయింది. బరువైన పాత్రను భుజాన వేసుకొని కథను ముందుకు తీసుకెళ్లింది. కాకపోతే నటనపరంగా, ఎమోషన్ సీన్లలో ఇంకా పరిణతి చెందాల్సిన అవసరం ఉంది. పెద్దగా పాటలకు, డ్యాన్సులకు స్కోప్ లేని పాత్ర కావడంతో ఆమె గ్లామర్‌ను ఎక్కువగా అసెస్ చేయడానికి వీలులేకపోయింది. కాకపోతే అక్షర్ పాత్రకు మాత్రం నూటికి నూరుశాతం న్యాయం చేకూర్చింది.

    సుమంత్ అశ్విన్ యాక్టింగ్

    సుమంత్ అశ్విన్ యాక్టింగ్

    ఇక ఆనంద్‌గా సుమంత్ అశ్విన్ మరోసారి ఆకట్టుకొన్నాడు. కేరింత షేడ్స్ కనిపించినప్పటికీ ఆనంద్ పాత్రలో ఉన్న రకరకాల వేరియేషన్స్ చక్కగా సుమంత్ పలికించాడు. పాత్రపరంగా ఎక్కడ తొణికసలాట కనిపించలేదు. ప్రధానంగా సెకండాఫ్‌లో, క్లైమాక్స్‌లోను సుమంత్ నటన భావోద్వేగంగా సాగుతుంది. తొలిభాగంలో చలాకీ అబ్బాయిగా చక్కగా రాణించాడు.

    మిగితా నటీనటులు

    మిగితా నటీనటులు

    సుమంత్ తల్లిదండ్రులగా నరేష్, పవిత్రా లోకేష్.. నిహారిక పేరెంట్స్‌గా మురళీశర్మ, తులసి నటించారు. సంగీతంపై మక్కువ ఉన్న వ్యక్తిగా, కొడుకు ఆవేదనను అర్థం చేసుకొనే తండ్రిగా నరేష్ మరోసారి ఆకట్టుకొన్నాడు. కామెడీ సీన్లలో హైలెట్‌గా నిలిచారు. సెకండాఫ్‌లో ఎమోషన్స్ పడించాడు. ఇక మురళీశర్మ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తండ్రి పాత్రలకు ఆయన పెట్టింది పేరుగా మారారు. ఈ చిత్రంలోనూ భావోద్వేగాన్ని పండించాడు. సాధారణంగా ప్రతీ ఇంటిలో కనిపించే తండ్రిగా తెర మీద కనిపించాడు. వీరి పాత్రలకు సోర్టింగ్ పవిత్ర, తులసిలు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

    విజయ్ పాత్రలో రాజా

    విజయ్ పాత్రలో రాజా

    విజయ్ పాత్రలో సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు రాజా కనిపించారు. సీన్లు కొన్ని ఉన్నప్పటికీ కథకు బలంగా మారారు. తన పాత్రకు సరైన న్యాయమే చేశాడు. సింపుల్, సెన్సిటివ్‌గా మెప్పించాడు.

    శక్తికాంత్ సంగీతం

    శక్తికాంత్ సంగీతం

    హ్యాపీ వెడ్డింగ్ చిత్రానికి ఫిదా ఫేం శక్తికాంత్ సంగీత అందించారు. పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. కాకపోతే కీలక సన్నివేశాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో బలాన్ని చేకూర్చాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో మ్యూజిక్ నటీనటుల ఎమోషన్‌ను ఎలివేట్ చేసింది.

    ప్రొడక్షన్ వాల్యూస్

    ప్రొడక్షన్ వాల్యూస్

    యూవీ క్రియేషన్ బ్యానర్‌, పాకెట్ సినిమా బ్యానర్‌ ఈ చిత్రాన్ని రూపొందించింది. పాత్రల ఎంపిక వారి అభిరుచికి అద్దం పట్టింది. సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించిన వారు కాస్త ప్రేక్షకులకు తెలిసిన వారైతే కనెక్టివిటీ పెరిగేది. తెర మీద సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తుంది.

    ఫైనల్

    ఫైనల్

    ప్రేమ, బ్రేక్, పెళ్లి అనే మూడు అంశాలను కలబోసి సెన్సిటివ్‌గా కథను రాసుకోవడం ఓ ఛాలెంజ్ లాంటిందే. కాస్త తేడా కొట్టినా టోటల్‌గా మిస్ ఫైర్ అవుతాయి. కాకపోతే తొలి చిత్ర దర్శకుడు లక్ష్మణ్ కార్య తన ప్రతిభను పూర్తి స్థాయిలో చూపించలేకపోయినా.. ప్రేక్షకులు మెప్పించే ప్రయత్నం చేయడం ఆయన డైరెక్షన్‌లో పాజిటివ్ అంశం. రొటీన్‌గా కాకుండా కొన్ని ఫీల్‌గుడ్ సన్నివేశాలను రాసుకొని ఉంటే మ్యారేజ్ జోనర్‌లో మంచి సినిమా అయ్యేది. ఓవరాల్‌గా వీకెండ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా కాలక్షేపం కోసం కాస్త హ్యూమర్, క్లీన్ సినిమా చూడాలంటే హ్యాపీ వెడ్డింగ్ చూడవచ్చు.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    నిహారిక, సుమంత్
    సపోర్టింగ్ రోల్స్
    ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్లు
    కథ

    మైనస్ పాయింట్స్
    స్లో నెరేషన్
    బలమైన సన్నివేశాలే లేకపోవడం
    కథనం

    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: నిహారిక కొణిదెల, సుమంత్ అశ్విన్, మురళీ శర్మ, నరేష్, పవిత్ర లోకేష్, తులసి, ఇంద్రజ
    దర్శకుడు: లక్ష్మణ్ కార్య
    నిర్మాతలు: యూవీ క్రియేషన్ బ్యానర్‌, పాకెట్ సినిమా
    సంగీతం: శక్తికాంత్

    English summary
    After the failure of her debut film 'Oka Manasu', Niharika took a huge sabbatical before signing her second Telugu film, "Happy Wedding". Happening production house UV Creations is presenting this youthful entertainer that is being bankrolled by Pocket Cinema. Struggling hero Sumanth Ashwin plays the male lead. The film's shooting has almost been wrapped up and the post-production work is in full swing. There is news that SS Thaman doing back ground score for the music. Music given Fidaa fame Shaktikanth. Mega powerstar Ram Charan is attending as Chief Guest for Pre release event which organising on July 21st.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X