twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్‌ హ్యాపీ

    By Staff
    |

    Happy
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: హ్యాపి
    విడుదల తేదీ: 27-01-2006
    నటీనటులు: అల్లు అర్జున్‌, జెనీలియా, మనోజ్‌ బాజ్‌పేయి,
    బ్రహ్మానందం, వేణుమాధవ్‌, తనికెళ్ల భరణి, జాహ్నవి,
    రమాప్రభ, సుమన్‌ శెట్టి తదితరులు
    సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
    కెమెరా: ఆర్‌.డి. రాజశేఖర్‌
    కథ : రాధామోహన్‌
    మాటలు: కోనా వెంకట్‌
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరుణాకరన్‌
    నిర్మాత: అల్లు అరవింద్‌

    తొలిప్రేమ తర్వాత ఒక్క హిట్టూ లేని తమిళ దర్శకుడు కరుణాకరన్‌ తమిళ హిట్‌ 'అలై గీతమ్‌' ఆధారం చేసుకుని అందించిన చిత్రం హ్యాపి. ఫస్టాఫ్‌ వరకు అందమైన ప్రేమ కథగా నడిచిన ఈ సినిమా హీరోను మాస్‌గా చూపాలన్న తాపయ్రతంలో పడడంతో సెకండాఫ్‌ సెంటిమెంట్‌, ఫైటింగ్‌లతో నిండిపోయింది. దాంతో రోమాంటిక్‌ కామెడీ కాస్తా రూట్‌ మారి బిసి సెంటర్ల చిత్రమైపోయింది. ఏదెలా ఉన్నా ప్రేమకథా చిత్రాలకు బాక్సాఫీసు వద్ద మినిమిం గ్యారంటీ ఉంటుందన్నది ఈ చిత్రం రుజువు చేయవచ్చు.

    కథగా చిన్న పాయింటు ఇది. అనుకోని పరిస్థితుల్లో ఆడిన అబద్ధం అందమైన ప్రేమగా రూపుదిద్దుకుంది. బన్ని (అల్లు అర్జున్‌) అన్ని సినిమాల్లో లాగానే ఈ సినిమాలోనూ అనాథ. చదువు కోసం బ్రహ్మానందం నడిపే పిజ్జా కార్నర్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. మధుమతి (జెనీలియా) కులపిచ్చి ఉన్న రాజకీయనాయకుడు సూర్యనారాయణ ఏకైక కూతురు. మెడిసిన్‌ చదివే మధుమతి అనుకోని పరిస్థితుల్లో బన్నీ చేసిన ఒక పొరపాటు వల్ల తన తండ్రి దగ్గర ప్రేమలో పడినట్లు ఇరుక్కుంటుంది. దాంతో ఆమె తండ్రి తన కులం వాడైన ఎసిపి అరవింద్‌ (మనోజ్‌ బాజ్‌పేయ్‌)కిచ్చి పెండ్లి చేయడానికి ప్రయత్నిస్తాడు. పెళ్లయితే చదువు ఆగిపోతుందని భావించి, బాధపడే మధుమతి కోసం బన్నీ రంగంలోకి దిగుతాడు. ఆ ఎసిపి కలిసి తాము ప్రేమికులమని అబద్ధాలు ఆడుతాడు. దాన్ని నమ్మిన ఆయన రిజిష్టర్‌ పెళ్లి చేసి తన ప్లాట్‌ గిఫ్ట్‌గా ఇస్తాడు. ఈ విషయం తెలిసిన హీరోయిన్‌ తండ్రి అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. బన్నీతో తలపడతాడు. ఈ క్రమంలో మధుమతి బన్నీలిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారో తెరపై చూడాల్సిందే.

    తమిళంలో ప్రకాష్‌రాజ్‌ నటించి నిర్మించిన అలై గీతమ్‌ అక్కడ మంచి చిత్రంగా విజయం సాధించింది. దానిలో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించి పెరిగే సన్నివేశాలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. అదే తెలుగు చిత్రంలో అవకాశం ఉన్న చోటల్లా హీరోను ఎలివేట్‌ చేయాలనే తపన వల్ల నీరుగారింది. దాంతో మరో ఖుషీ కావాల్సిన ఈ చిత్రం మూస ప్రేమకథగా మారిపోయింది. క్లైమాక్స్‌ కోసం మొదటి నుంచి కథకు సంబంధం లేని విలన్‌ ట్రాక్‌ నడవడం కథన లోపమే. అలాగే హీరోయిన్‌ తండ్రి పాత్రను మలచడంలో శ్రద్ధ చూపలేదు. కూతురు వేరే మగాడిని రిజిష్టర్‌ మ్యారేజీ చేసుకుందని తెలిసినా రెస్పాన్స్‌ పరైన దిశలో ఉండదు. అప్పటి వరకు విచిత్రంగా కూతురును శాసిస్తూ బతికిన ఆ తండ్రి ఆ తర్వాత నోరెత్తడు.

    ఏదేమైనా దర్శకుడి క్రియేటివిటీ కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను తెచ్చి పెట్టింది. ముఖ్యంగా హ్యాపీ టైటిల్‌ సాంగ్‌ తొలి ప్రేమ సినిమాలో సీన్‌ చెప్పడం, హీరోయిన్‌ లిఫ్ట్‌ అడిగినప్పుడు హీరో ఎగిరి గంతేసే సీన్‌లు రక్తి కట్టాయి. డ్యాన్స్‌ల్లో అల్లు అర్జున్‌ మంచి ఈజ్‌ చూపాడు. సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. కామెడీ పాత్రలు ఉన్నా దర్శకుడు వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఎడిటింగ్‌, కెమెరా ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. కథను అంత కరుకుగా మారకుండా ఉంటే మంచి ప్రేమ కథగా అలరించి ఉండేది.బిసి సెంటర్లను టార్గెట్‌ చేసిన ఈ చిత్రం అక్కడ బాగా ఆడే అవకాశం ఉంది.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X