twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'హే' రామ్! (హరే రామ్ రివ్యూ)

    By Staff
    |

    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    బ్యానర్ : నందమూరి తారక రామారావు ఆర్ట్స్
    నటీనటులు:కళ్యాణరామ్,ప్రియమణి,సింధుతులాని,కోట,
    రఘుబాబు,బ్రహ్మానందం,అలీ,వేణుమాధవ్,అపూర్వ,
    వైజాగ్ ప్రసాద్,రాజీవ్ కనకాల తదితరులు
    సంగీతం: మిక్కీ.జె.మేయర్
    మాటలు:స్వామీజి-విజయ్
    ఎడిటింగ్: గౌతంరాజు
    యాక్షన్: రామ్-లక్ష్మన్,సెల్వా
    ఆర్ట్ : వివేక్
    సినిమాటోగ్రఫి: సి.రామ్ ప్రసాద్
    కథ: గౌరీ శంకర్
    స్ర్కీన్ ప్లే,దర్శకత్వం:హర్ష వర్ధన్
    నిర్మాత : నందమూరి కళ్యాణ్ రామ్
    రిలీజ్ డేట్: 18 జూలై 2008

    ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర ఎప్పుడూ అర్ధం కాని స్ధితిలో అయోమయంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అదే ఈ సినిమా చూసిన ప్రేక్షకుడి పరిస్ధితి. థ్రిల్లర్ నేరేషన్ లో నడిచిన ఈ కథనం లో కథ అర్ధం అయి అవకుండా చాలా కన్ ప్యూజింగ్ గా చివర వరకూ వెళుతుంది. కేవలం ఇంటర్ వెల్, క్లైమాక్స్ ట్విస్టు లను నమ్ముకుని చేసిన ఈ సినిమా 'మన్మధ', 2007 లో వచ్చిన కొరియా ఫిల్మ్ Soo నుండి ప్రేరణ చెంది అల్లుకున్నది. టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లో ఉన్న ఈ సినిమాలో పూర్తి స్ధాయి హింస ఉండటం, వినోదం తక్కువగా ఉండటం, లాజిక్ కి అందని సన్నివేశాలు, పాసివ్ హీరో ఉండటంతో ఫ్యామిలీలను చేరటం కష్టమే. అయితే కళ్యాణ్ రామ్ రెండు పాత్రలలో వేరియోషన్ చూపిస్తూ ఎనర్జీగా కనిపించాడు.

    నిజానికి ఇలాంటి కథలు మనకు కొత్తేం కాదు.మొన్న మొన్న వచ్చిన 'మన్మధ' నుండి నిన్నటి 'హలో ప్రేమిస్తారా' దాకా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కాన్సెప్ట్ కాస్త డిఫెరెంటు. ఈ రివేంజ్ డ్రామా కథలో హరికృష్ణ, రామ్ (కళ్యాణ్ రామ్) కవలలు. అయితే రామ్ పుట్టినప్పుడు వచ్చిన కొన్ని లోపాలతో మానసికంగా ఎదగడు. అలాగే ఎవరయినా అతని కన్నా ఎక్కువ తెలివైన వాళ్ళుంటే తట్టుకోలేరు. ఆ క్రమంలో అతను తన అన్ననే చంపటానికి పూనుకుంటాడు. అప్పుడతని తల్లి రామ్ ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతుంది. కాలక్రమంలో హరి పోలీస్ అధికారిగా ఎదుగి, క్రిమినల్ గా ఎదిగిన రామ్ నే పట్టుకోవాల్సిన స్దితి వస్తుంది. అప్పుడేం జర్గింది. సిటీలో ఉన్న హెల్త్ మాఫియా (కోట) కీ ఈ కథకీ సంభంధం యేమిటన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    'అన్ననే తమ్ముడు చంపటానికి సిధ్దపడితే' అనే ఆసక్తికర పాయింటుతో మొదలైన ఈ కథ తర్వాత హెల్త్ మాఫియా అంటూ ప్రక్క దారిలోకి వెళ్తుంది. పెద్ద పెద్ద స్క్రీన్ ప్లే రచయితలు 'ఏకతా సూత్రం' మంచి సినిమా లక్షణం అంటూంటారు. అంటే సినిమలో ఎన్ని పాత్రలు ఉన్నా ఒకడే మెయిన్ హీరో,మెయిన్ విలన్, మెయిన్ కాంఫ్లిక్ట్ ఉండాలంటారు. అదే ఈ సినిమాలో మిస్సయింది. రెండు కథలు ఒకే థ్రెడ్ తో కుట్టాలని చూసారు. ఒకటి మన్మధ తరహా లో వచ్చే అన్నదమ్ముల కాంఫిక్ల్ సన్నివేశాలు అయితే, మరొకటి హెల్త్ మాఫియా విలనిజం. రెండు వేర్వేరుగా సినిమాలు పూర్తి స్ధాయిలో చేసుకునే పాయింట్ లు. దాంతో చూస్తున్న ప్రేక్షకుడు కి క్లారిటీ లేకుండా పోయి ...దేన్ని ఫాలో కావాలో అర్ధం కాని స్దితి వచ్చింది. మైనస్ గా మారి క్లైమాక్స్ వరకూ ప్లాష్ బ్యాక్ లు మింగేసాయి. హీరో తనకున్న సమస్యలపై పోరాడటానికి, ప్రతికూల శక్తులు అతన్ని ఎదుర్కుని కొత్త సవాళ్ళు విసరటానికి టైం లేకుండా పోయి పాసివ్ హీరోయిజాన్ని మిగిల్చి సాడ్ ఫిలిమ్ గా మార్చింది.

    ఇక కళ్యాణ్ రామ్ తన తొలి హిట్ అయిన 'అతనొక్కడే' సినిమా ఫార్మెట్ లోనే ఈ సినిమా రూపొందించాలని ప్రయత్నించాడని ఫస్టాఫ్ లో వచ్చే కథనం అల్లికను బట్టి చెప్పచ్చు. సింధుతులాని ఎంట్రీతోనే పసి గట్టచ్చు. అయినా ఈ సినిమా లో బ్రహ్మానందం, అలీ నవ్విస్తారు. మిక్కీ.జె.మేయర్ తన మ్యూజిక్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఇక సి.రాం ప్రసాద్ అయితే కెమెరా తో తమిళ కెమెరావాళ్ళకి పోటీ ఇస్తాడు. హర్షవర్దన్ గా పేరు మార్చుకున్న దర్శకుడు స్వర్ణ సుబ్బారావు తన భారీతనం ప్రతీసారి ప్రదర్శించి తన టాలెంట్ చూడమంటారు. ఇక కళ్యాణ రామ్ మానసికంగా ఎదగని వాడిలాగ చక్కగా చేసి మంచి ఆర్టిస్టునని చెప్తూంటాడు. ప్రియమణి తన అందచందాలను చూడండని తనివితీరా ఆరబోసే ప్రయత్నం చేస్తుంది.అక్కడక్కాడా పంచ్ డైలాగులు పడుతూంటాయి.

    ఇలా ఎన్ని అలంకరణలు ఉన్న కథ అనే ఆత్మ కరవు అవటంతో చాలా చోట్ల సహన పరీక్షలా మారి ఇబ్బంది పెడుతుంది. మంచి క్రేజ్ తో రిలీజైన సినిమా కావటంతో ఓపినింగ్స్ బాగున్నా కలక్షన్స్ ఎంతకాలం నిలబడతాయన్నది వెచి చూడాల్సిన అంశం. యేదేమైనా కళ్యాణ్ రామ్ హీరోగా మంచి మార్కులు తెచ్చుకున్నా నిర్మాతగా మంచి కథ,కథనాలు ఎంచుకోలేకపోయాడనిపిస్తుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X