Hari Hara Veera Mallu Movie Review: హరిహర వీరమల్లు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, తనికెళ్ల భరణి, రఘుబాబు తదితరులు
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ
కథ, స్క్రీన్ ప్లే: క్రిష్ జాగర్లమూడి
నిర్మాత: ఏఎం రత్నం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఏ దయాకర్ రావు
మ్యూజిక్: కీరవాణి
సినిమాటోగ్రఫి: జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
ఆర్ట్: తోట తరణి
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్
రిలీజ్ డేట్: 2025-07-24
మచిలీపట్నం ప్రాంతంలోని కొల్లూరులో హైదరాబాద్ నవాబుల సంపదను కొల్లగొడుతూ పేదలకు పంచి పెట్టే దొంగ హరిహర వీరమల్లు (పవన్ కల్యాణ్). నిజాం నవాబుల సామంతుడి చెరలో ఉన్న పంచమి (నిధి అగర్వాల్)ని మొదటి చూపులోనే మనసు పారేసుకొంటాడు. అయితే హైదరాబాద్ నవాబు కోసం తరలించే వజ్ర వైడుర్యాలను కొల్లగొట్టేందుకు ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ సక్సెస్ చేసి నిధిని విడిపించుకొనే సమయంలో వీరమల్లును పంచమి మోసం చేస్తుంది. దాంతో వీరమల్లు హైదరాబాద్ పాలకులు బంధీగా పట్టుకొంటారు. అయితే వీరమల్లులోని చాకచక్యాన్ని, చోర విద్యలో ప్రతిభను చూసి ఢిల్లీలోని ఔరంగజేబ్ (బాబీ డియోల్) వద్ద ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకు రావాలని ఆదేశిస్తారు.

పంచమిని ఎలాంటి పరిస్థితుల్లో వీరమల్లు మనసు పడుతాడు? నిజాం నవాబు సామంతుడి చెరలో పంచమి ఎందుకు ఉంది? అసలు పంచమి ఎవరు? తనను విడిపించుకు వెళ్లమని వీరమల్లును పంచమి ఎందుకు కోరుతుంది? హైదరాబాద్ పాలకుడికి బందీగా చిక్కిన వీరమల్లు ఢిల్లీలోని ఔరంగజేబును ఎందుకు టార్గెట్ చేయాలనుకొన్నాడు. హరిహర వీరమల్లు పుట్టుక, అతడి జీవితం వెనుక కథ ఏమిటి? వీరమల్లు లక్ష్యం కోహినూరేనా? ఇంకా ఏదైనా ఉందా? అనే ప్రశ్నలకు సమాధానమే హరిహర వీరమల్లు సినిమా కథ.
పాజిటివ్ పాయింట్స్
పవన్ కల్యాణ్ పెర్ఫార్మెన్స్
బాబీ డియోల్ యాక్టింగ్
కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫి, సాంగ్స్
నిధి అగర్వాల్ గ్లామర్, యాక్టింగ్
మల్లయుద్ధం ఫైట్
చార్మినార్ యాక్షన్ ఎపిసోడ్
ఇంటర్వెల్ ఎపిసోడ్
ఫస్టాఫ్‌లో స్టోరి, స్క్రీన్ ప్లే
సెకండాఫ్‌లో చైల్డ్ సెంటిమెంట్‌తో సనాతన ధర్మం ఎపిసోడ్
మైనస్ పాయింట్
సెకండాఫ్‌లో స్లో పేస్ నరేషన్
వీఎఫ్ఎక్స్ వర్క్
నిజాం పాలనతో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పేదలను బానిసలుగా చూసే విధానం ఎపిసోడ్‌తో గ్రిప్పింగ్‌గా కథను మొదలుపెట్టారు. వీరమల్లు పుట్టుక, అతడి ఎంట్రీతో సినిమా కథను పవర్‌ఫుల్‌గా మార్చారు. మల్ల యుద్ధం ఫైట్, నిధి అగర్వాల్‌లో లవ్ ట్రాక్, చార్మినార్ యాక్షన్ ఎపిసోడ్, ఇంటర్వెల్‌లో టైగర్ ఎపిసోడ్స్ సినిమాకు బ్లాక్ బస్టర్ సరుకుగా మార్చిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఔరంగజేబ్‌గా బాబీ డియోల్ ఎంట్రీ, అతడి పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్‌గా చెప్పుకోవచ్చు.

ఇక సెకండాఫ్‌లో కథలో విషయం లేకపోవడం వల్ల ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్‌ను సినిమాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. అది కొంత రెగ్యులర్ ఆడియెన్స్‌కు అయిష్టంగా అనిపిస్తుంది. కానీ సనాతన ధర్మం పాయింట్‌తో చౌకీ ఠానా వద్ద ఎపిసోడ్స్ ఎమోషన్స్ పీక్స్‌లో గుప్పించాయి. చివరి 30 నిమిషాల్లో వీఎఫ్ఎక్స్ మైనస్‌గా అనిపించినా.. ఆ లోపాన్ని కీరవాణి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో, పవన్ కల్యాణ్ యాక్షన్ కోరియోగ్రఫితో సరిచేయడంలో సక్సెస్ అయ్యాడు. ఓవరాల్‌గా సెకండ్ పార్ట్‌కు మంచి లీడ్‌తో ముగించడం ఫ్యాన్స్‌లో జోష్ పెంచింది.
గత కొద్ది సినిమాలను చూస్తే పవన్ కల్యాణ్ యాక్టింగ్, పెర్ఫార్మెన్స్‌లో కొన్ని లిమిటేషన్స్ కనిపిస్తాయి. కానీ ఈ సినిమా వరకు ఆయన తన పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్లతో కేక పెట్టించాడు. లెంగ్తీ డైలాగ్స్ లేకుండా చిన్న చిన్న డైలాగ్స్‌తో ఫ్యాన్స్‌కు కిక్కించే విధంగా చేశాడు. నిధి అగర్వాల్ గ్లామర్ పరంగాను, అలాగే పెర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో ఔరంగజేబుగా మంచి విలనిజాన్ని బాబీ డియోల్ ప్రదర్శించి పవర్ స్టార్‌తో పోటాపోటిగా నటించారు. అనసూయ, సునీల్, సుబ్బరాజు, సత్యరాజ్ తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.

హరిహర వీరమల్లు సినిమాకు కీరవాణి ప్రాణంగా నిలిచాడు. కీరవాణి లేకుంటే అసలు సినిమానే లేదనే విధంగా బ్యాక్ గ్రౌండ్ ఇచ్చారు. పాటలు కూడా వినడానికే కాకుండా తెర మీద ఆకట్టుకొనేలా ఉన్నాయి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి, యాక్షన్ ఎపిసోడ్స్ బాగా షూట్ చేశారు. వీఎఫ్ఎక్స్ వర్క్‌లో లోపాలు లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు. వీఎఫ్ఎక్స్ వర్క్‌పై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే.. ఇంకా సినిమా ఇంకా బెటర్‌గా ఉండేది. క్రిష్, జ్యోతికృష్ణ తమకు ఎదురైన ప్రతికూలతలను ఎదురించి మంచి అవుట్ పుట్, ఫీల్ గుడ్ మూవీని అందించారు. ఏఎం రత్నం, దయాకర్ రావు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
పవన్ కల్యాణ్ లార్జర్ ద్యాన్ లైఫ్ క్యారెక్టర్, కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్‌తోపాటు ఎమోషనల్ కంటెంట్‌తో కోహినూర్ వజ్రం చుట్టు తిరిగే మూవీ హరిహర వీరమల్లు. 5 ఏళ్లుగా ఈ సినిమా అనేక సమస్యలను ఎదుర్కొని రిలీజ్ కావడం వల్ల ఏర్పడిన ప్రతికూల అంశాలను పాజిటివ్‌గా మార్చేలా సన్నివేశాలకు రూపకల్పన చేశారు. సెకండాఫ్‌లో జిజియా పన్ను, మత మార్పిడి విషయంలో ఔరంగ్ జేబ్ చేసిన దాష్టికాలను తెరపైన చక్కగా చూపించారు. ఇటీవల కాలంలో వీఎఫ్ఎక్స్ పరంగా తెలుగు ఆడియెన్స్ బ్రహ్మండమైన వీఎఫ్ఎక్స్ ఆధారిత సినిమాలను చూశారు. వాటితో కంపారిజన్ చేస్తే మాత్రం అంతగా మెప్పించదు. కానీ హరిహర వీరమల్లు సినిమా వరకు చూస్తే.. ఎలాంటి నిరాశ కలిగించదు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ మీల్స్, పైసా వసూలు చిత్రం. థియేటర్‌లో మంచి ఎక్స్ పీరియెన్స్ ఉన్న సినిమా. డోంట్ మిస్ ఇట్.


Click it and Unblock the Notifications











