Hari Hara Veera Mallu Movie First Review: హరిహర వీరమల్లు మూవీ ఫస్ట్ రివ్యూ

ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నుంచి హరి హర వీరమల్లు చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న డైరెక్టర్ ఏఎం జ్యోతి కృష్ణ.. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి శాయశక్తులా కృషి చేశారు. ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న హరి హర వీరమల్లు చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్ తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు 'హరి హర వీరమల్లు'లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్‌లను, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందు సెన్సార్ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొన్నది. ఈ సినిమా గురించి సెన్సార్ అధికారులు, సెన్సార్ బోర్డు రిపోర్టు ఏమిటనే వివరాల్లోకి వెళితే..

Hari Hara Veera Mallu Movie Review by Censor Board

హరిహర వీరమల్లు సినిమా కథ విషయానికి వస్తే.. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కింది. చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ నటించారనడం కంటే జీవించారని చెబుతున్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా.. సత్యం, విశ్వాసం, స్వేచ్ఛ కోసం జరిగే న్యాయం, సనాతన ధర్మం కోసం పోరాడిన వీరుడి పవర్ ఫుల్ జర్నీని తెర మీద చూడబోతున్నామనే టాక్ చిత్ర యూనిట్ నుంచి వినిపిస్తున్నది.

పవన్ కల్యాణ్ నటించిన ఈ చిత్రాన్ని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) వారి రివ్యూ కోసం ప్రదర్శించారు. ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ అధికారులు, ప్రతినిధులు పూర్తిస్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశారు. చిన్న చిన్న మార్పులు, డైలాగ్స్‌లో అక్కడ బీప్స్‌తో పెద్దగా అభ్యంతరాలు తెలపకుండా సర్టిఫికెట్ జారీ చేశారు. ఎలాంటి అభ్యంతరకర కంటెంట్ లేకుండా రూపొందించిన ఈ సినిమా సెన్సార్ బోర్డు సభ్యులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాకి ప్రధాన బలంగా నిలిచిన ఆకర్షణీయమైన కథనం, కళ్లు చెదిరే సన్నివేశాలతో ఈ సినిమా విజువల్ ఫీస్టుగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రశంసలతో ముంచెత్తారు అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

Hari Hara Veera Mallu Censor Review

పవన్ కల్యాణ్ తనదైన నటన, యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. సనాతన ధర్మాన్ని పాటించే, అనుసరించే వారికి ఈ సినిమా హృదయాలకు హత్తుకొంటుంది. పాన్ ఇండియా ఆడియెన్స్‌కు సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ పంచుతుంది. యాక్షన్, డ్రామా అంశాలతో రూపొందిద్దుకొన్న ఈ సినిమా అభిమానులను విశేషంగా ఆలరిస్తుందనే విశ్వాసాన్ని చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేశారు.

Hari Hara Veera Mallu Censor Review

ఇక క్లీన్ కంటెంట్‌తో రూపొంది సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 42 నిమిషాలకు ఫిక్స్ చేశారు. కోహినూర్ డైమండ్ బ్యాక్ డ్రాప్‌గా సాగే ఈ కథ, కథనాలు ఆద్యంతం కట్టిపడేస్తాయి. సాధారణ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ సినిమా లేటేస్ట్ అప్ డేట్స్, ఎక్స్‌క్లూజివ్ స్టోరీలు, రివ్యూ, బాక్సాఫీస్ కథనాల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X