Harihara Veeramallu Critic Review: హరిహర వీరమల్లు క్రిటిక్ రివ్యూ.. థియేటర్లు తగలబడటం ఖాయమట..
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఏఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో జూలై 24న విడుదల కానున్న హరి హర వీరమల్లు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో యూనిట్ ఇంటర్నల్ షో సందర్భంగా ఈ మూవీని చూసిన క్రిటిక్ తన రివ్యూను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆయన ఏం చెప్పారనే విషయంలోకి వెళితే..
హరిహర వీరమల్లు సినిమాను చూడటం జరిగింది. ఈ సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే.. యాడ్స్, రోలింగ్ టైటిల్స్ మినహాయిస్తే 2.32 నిమిషాలు అంటే 252 నిమిషాలు. ఈ మూవీ విజువల్ అద్బుతం. ఊపిరి బిగపట్టి చూసేలా యాక్షన్ ఎపిసోడ్స్. భావోద్వేగాల ఊగిసలాట. ఈ సినిమా అభిమానులకు పండుగ లాంటి వాతావారణం కల్పిస్తుంది అంటూ జేపీఆర్ ఫిల్మ్స్ ట్వీట్ చేసింది.

ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే..
- టెంపుల్, ఈగిల్ సీన్స్.
- పోర్ట్ ఫైట్,
- ఎమోషన్స్‌తో సాగే కుస్తీ ఫైట్,
- కొల్లగొట్టినాదిరో సాంగ్.
- అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్.
- ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
- టైగర్ ఎపిసోడ్
- మైండ్ బ్లోయింగ్ ప్రీ క్లైమాక్స్
- తారా సాంగ్,
- చైల్డ్ ఎమోషన్
- బ్యాక్ గ్రౌండ్ సాంగ్
- భారీ క్లైమాక్స్
తెలుగు సినిమా రంగంలో ఇప్పటి వరకు చూసిన పవన్ కల్యాణ్ ఒక ఎత్తు.. హరిహర వీరమల్లు సినిమాలో పవర్ స్టార్ మరో ఎత్తు. బాబీ డియోల్ క్యారెక్టర్ సర్‌ప్రైజ్. ఇంటర్వెల్‌కు 25 నిమిషాలు 3 ఎపిసోడ్స్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. డిప్యూటీ సీఎం రేంజ్‌కు సరిపోయే సినిమా. థియేటర్లు తగలబడకపోతే నన్ను అడుగు. రాసుకో సాంబా అంటూ క్రిటిక్ హైప్ పెంచారు.
ఈ మూవీలో డైలాగ్స్ పేలిపోతాయి. ప్రజలు నాయకుడి కాళ్లను కాదండి తలను చూడాలి. ఎవరైతే కాళ్లను కాకుండా తలను చూసే అవకాశం ఇస్తాడో అతడే నిజమైన నాయకుడు. ఇలాంటి డైలాగ్స్ పైసా వసూల్. ఒక్క ఫైట్‌కు పూనకాలు వస్తాయి. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చొక్కాలు చించుకోవడం ఖాయం. వీలైతే మరో నాలుగు చొక్కాలు తీసుకెళ్లండి అంటూ ట్వీట్ చేశారు.
ఈ సినిమా రెండో భాగానికి అంచనాలు పెంచుతూ ఫస్ట్ పార్ట్ ముగించే విధానం ఓ రేంజ్‌లో ఉంటుంది. ఫస్ట్ పార్ట్‌ను ఫుల్ సంతృప్తిని ఇస్తుంది. బాహుబలి తరహాలో పార్ట్ 2 కోసం లీడ్ ఇస్తారు. ఈ సినిమాకు నేను 100 మార్కులు వేస్తాను అని జేపీఆర్ ఫిల్మ్స్ ట్వీట్ చేసింది.
హరిహర వీరమల్లు సినిమా కథ విషయానికి వస్తే.. మొఘల్ పాలను వ్యతిరేకించి.. సనాతన ధర్మం కోసం పోరాటం చేసే ఓ యోధుడి కథ. ఈ మూవీ బ్లాక్ బస్టర్. ఈ సినిమాకు నా రేటింగ్ 5 పాయింట్లకు 3.5 . పవర్ స్టార్ ఫ్యాన్స్ టైమ్ మొదలైంది అంటూ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











