HariHara VeeraMallu Movie Twitter Review: హరిహర వీరమల్లు మూవీ ట్విట్టర్ రివ్యూ

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మాణంలో జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి తదితరులు నటించారు.

ఇంకా ఈ చిత్రంలో సత్యరాజ్, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలకపాత్ర పోషించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించగా.. వీఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. హరిహర వీరమల్లు చిత్రం జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఓవర్సీస్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని ప్రీమియర్ల తర్వాత నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాల్లోకి వెళితే..

HariHara VeeraMallu Movie Twitter Review in Telugu  Will Pawan Kalyan hits the bulls eye

ఇది హరిహర వీరమల్లు గర్జన. ఎమోషన్స్, మలుపులు, గ్రాండ్ విజువల్స్‌తో నింపేశారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ బెస్ట్ మోడ్‌లో బయటికొచ్చారు. పవన్ ఫ్యాన్స్‌కి మాత్రం ఈ సినిమా మాస్ ఫీస్ట్. ప్రతి ఫ్రేమ్ బ్లాక్‌బస్టర్ అని ఓ కంటెంట్ క్రియేటర్ రివ్యూ ఇచ్చాడు.

కీరవాణి సర్ బీజీఎంకి టెంపుల్ కట్టాలి. బాహుబలికి కూడా ఇలాంటి బీజీఎం ఇవ్వలేదు. ఈ బీజీఎం నెక్ట్స్ లెవల్. కీరవాణి కెరీర్‌లోనే టాప్ బీజీఎం ఇచ్చారు. కీరవాణి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మూవీ మీది, ఈ సినిమాకు హీరో మీరేనని పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు కాంప్లిమెంట్ ఇచ్చారు.

మంచి కథ, ఆకట్టుకునే సన్నివేశాలతో నిండిన పవన్ కళ్యాణ్ చిత్రాలలో ఖచ్చితంగా హరిహర వీరమల్లు కూడా ఒకటి. సెకండాఫ్‌లో వీఎఫ్ఎక్స్ లోటు కనిపించింది. అయితే అన్న ఇచ్చిన తక్కువ సమయంలో క్లోజప్ షాట్స్‌కి అంతకన్నా ఔట్‌పుట్ ఆశించలేం అని ఓ పవన్ కళ్యాణ్ అభిమాని రాసుకొచ్చాడు.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం సూపర్‌హిట్ కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే, సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు రాసుకొచ్చారు.

పులి, మేక సీక్వెన్స్ బ్లాస్టింగ్.. వర్త్ వర్మ వర్త్.. బీ, సీ సెంటర్స్‌లో థియేటర్స్ ఊగిపోతాయి. కుస్తీ ఫైట్ ఈ మధ్యకాలంలో వచ్చిన ది బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్‌‌లో ఒకటని ఓ యూజర్ ట్వీట్ చేశారు.

ఫస్టాఫ్‌లో పవన్ కళ్యాణ్ ఎంట్రీకి మంచి స్పందన వస్తోంది. చారిత్రక నేపథ్యం, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. బాబీ డియోల్ పాత్రను పవర్‌ఫుల్‌గా పరిచయం చేశారు. సెకండాఫ్‌లో ఎమోషన్స్, డ్రామాలో వేగం అందుకుంది. బాబీ డియోల్ క్రూరమైన నటనతో స్క్రీన్‌పై డామినేషన్ చేశాడు అని ఓ యూట్యూబర్ రాసుకొచ్చాడు.

బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది, ముఖ్యంగా వార్ సీక్వెన్స్‌‌లో థియేటర్లు దద్ధరిల్లిపోతాయి. పాటలు సందర్భానుసారంగా కుదిరాయి. దేశభక్తి, యాక్షన్, భావోద్వేగాలను హరిహర వీరమల్లు బ్యాలెన్స్ చేశాడు. డైలాగ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతాయి.. సెట్స్ గ్రాండీయర్‌గా ఉండగా, కీలక సన్నివేశాలలో వీఎఫ్ఎక్స్ ఆకట్టుకుంది.

హరిహర వీరమల్లు ఒక మాస్ హిస్టారికల్ ఎంటర్‌టైనర్. భారతీయ వారసత్వం, తిరుగుబాటును మిళితం చేసి అద్భుతంగా తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్‌లు పోటాపోటీగా నటించారు. దేశభక్తి చిత్రాలను ఇష్టపడే వారు తప్పనిసరిగా చూడాల్సిన చిత్రం ఇది అని ఆ యూట్యూబర్ రివ్యూ ఇచ్చాడు.

ఫస్టాఫ్ ఎక్స్‌లెంట్ అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. పోర్ట్ ఫైట్, కుస్తీ ఫైట్, చార్మినార్ ఫైట్, ఇంటర్వెల్‌కు ముందు పులితో యాక్షన్ సీన్ బాగుందని .. అంగవస్త్రం మీద అంచు కూడా పీకలేరంటూ పవర్‌ఫుల్ డైలాగ్ ఫైర్ అని తెలిపాడు.

ఫస్టాఫ్ ఎక్స్‌లెంట్.. లాగ్ లేకుండా సాగింది. చార్మినార్ ఫైట్, ఇంటర్వెల్ సీక్వెన్స్, కుస్తీ ఫైట్, కొల్లగొట్టినాదిరో పాట మేజర్ హైలైట్ అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. కీరవాణి బీజీఎం ప్యూర్ గోల్డ్ , దర్శకుడు క్రిష్ హిట్ అందించాడు అని ఆ అభిమాని రాసుకొచ్చాడు.

పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ గూస్‌బంప్. కుస్తీ ఎపిసోడ్ అయితే మెంటల్ మాస్, కొల్లగొట్టినాదిరో సాంగ్ వైబ్, ఛార్మినార్ ఫైట్ ఎక్స్‌ట్రార్డినరీ .. మొత్తంగా హరిహర వీరమల్లు ఫస్ట్ హాఫ్ గూస్‌బంప్స్‌లా ఉందని ఓ అభిమాని ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X