Harom Hara Review: హరోమ్ హర సినిమా రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75

నటీనటులు: సుధీర్ బాబు, మాళవిక శర్మ, అక్షర గౌడ, సునీల్, జయప్రకాశ్, రవి కాలే, అర్జున్ గౌడ, లక్కి లక్ష్మీన్, రాజశేఖర్ అనింది తదితరులు
దర్వకత్వం: జ్ఞానసాగర్ ద్వారక
నిర్మాత: సుమంత్ జీ నాయుడు
మ్యూజిక్: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫి: అరవింద్ విశ్వనాథన్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
బ్యానర్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
రిలీజ్ డేట్: 2024-06-14

సుబ్రమణ్యం (సుధీర్ బాబు) కుప్పం పాలిటెక్నిక్‌ కళాశాలలో లాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తుంటాడు. అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్ దేవీ (మాళవిక శర్మ)తో ప్రేమలో ఉంటాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల తండ్రి శివారెడ్డి ( వీ జయప్రకాశ్) చేసిన అప్పులు కట్టడంతోనే జీవితం సరిపోతుంది. జీవితంలో ఆర్థికంగా ఎదగడానికి బిజినెస్ పెట్టాలని ఆలోచిస్తున్న సమయంలో సస్పెండ్ అయిన పోలీస్ ఇన్స్‌పెక్టర్ పళని స్వామి (సునీల్)తో పరిచయం గన్స్ బిజినెస్‌లోకి వెళ్లేలా చేస్తుంది. అదే సమయంలో కుప్పంలో మాఫియా సామ్రాజ్యాన్ని నడిపే బసవరెడ్డి (రవి కాలే), శరత్ రెడ్డి (అర్జున్ గౌడ), తమ్మి రెడ్డి (లక్కీ లక్ష్మణ్)‌తో వైరం ఏర్పడుతుంది.

Harom Hara Movie Review in Telugu  Sudheer Babu gives best of his Career
కుప్పంలో బసవ రెడ్డి భూఆక్రమణలు, అక్రమాలను చూసి సుబ్రమణ్యం ఎలా రియాక్ట్ అయ్యాడు? పోలీస్ ఆఫీసర్ పళని స్వామి ఎందుకు సస్పెండ్ అయ్యాడు? పళనిస్వామి, సుబ్రమణ్యం క్లోజ్ కావడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? దేవీతో సుబ్రమణ్యం లవ్ లైఫ్ ఎలా సాగింది? గన్స్ బిజినెస్‌లో ఎంట్రీ కావడానికి కారణం ఏమిటి? గన్స్ బిజినెస్ సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారు? సుబ్రమణ్యం బిజినెస్‌పై పోలీసులు ఎలాంటి నిఘా పెట్టారు. బసవరెడ్డి మాఫియా ముఠాకు వ్యతిరేకంగా సుబ్రమణ్యం ఎదురు తిరిగి సొంత సామ్రాజ్యాన్ని ఎలా నెలకొల్పాడు? ఆ తర్వాత ఎదురైన పరిస్థితులు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే హరోమ్ హర సినిమా కథ.

హరోమ్ హర సినిమా విషయానికి వస్తే.. సామాన్యుడు ఎలా అసాధారణ మాఫియా డాన్‌గా ఎదగడం అనే సింగిల్ పాయింట్ చుట్టు అల్లుకొన్న కథ. ఈ సినిమా చూస్తున్నంత సేపు పుష్ప సినిమా స్పూర్తితో రూపొందించారా? అనే ప్రశ్న వెంటాడుతున్నది. మెయిన్ స్టోరీ అలానే ఉన్నప్పటికీ.. గన్స్ బిజినెస్ పాయింట్ కొత్తగా ఆసక్తికరంగా అందించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. రాసుకొన్న సన్నివేశాలు వాటిని తెర మీద పేర్చిన విధానంలో పర్‌ఫెక్షన్ కనిపిస్తుంది. సుధీర్ బాబు క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరు ఆకట్టుకొనేలా ఉంటుంది. అండర్ డాగ్ క్యారెక్టర్ నుంచి సుబ్రమణ్యం ఎదిగిన తీరుకు ఎలివేషన్ జోడించడంతో అతడి విజన్ వర్కవుట్ అయిందనే చెప్పాలి. ఫస్టాఫ్‌లో లవ్, ఎమోషన్స్ మూవీకి కనెక్ట్ చేస్తే.. సెకండాఫ్‌లో యాక్షన్ డ్రామా ఆకట్టుకొనేలా ఉంటుంది.

Harom Hara Movie Review in Telugu  Sudheer Babu gives best of his Career

ఇక సుధీర్ బాబు విషయానికి వస్తే.. ఈ సినిమాలోని సుబ్రమణ్యం పాత్ర లార్జర్ ద్యాన్ లైఫ్ అనిపిస్తుంది. ఇప్పటి వరకు చేస్తున్న రొటీన్ పాత్రల నుంచి బయటకు వచ్చి ఓ ఛాలెంజింగ్ చేసిన రోల్ అనిపిస్తుంది. అమాయకత్వం, భావోద్వేగం, పరిస్థితులకు అనుగుణంగా రియాక్ట్ అయ్యే యువకుడు, మాఫియా డాన్ లాంటి వేరియేషన్స్ ఉన్న పాత్రలో సుధీర్ ఒదిగిపోయాడు. సెకండాఫ్‌లో తన ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు.

ఇక మాళవిక శర్మ గ్లామర్ పార్ట్‌కు న్యాయం చేస్తే.. అక్షర గౌడ మాత్రం పోలీస్ ఆఫీసర్ అప్పుడప్పుడు ఝలక్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక రవి కాలే, సునీల్, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్, జయప్రకాశ్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

Harom Hara Movie Review in Telugu  Sudheer Babu gives best of his Career
హరోమ్ హర సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. హరోమ్ హర సినిమా సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టాప్ లేపింది. పాటలు అంతగా పెద్దగా అనిపించకపోయాయి. చాలా సీన్లను బీజీఎం లేపిన తీరు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆకట్టుకొలేలా ఉంటాయి. ఇక అరవింద్ విశ్వనాథన్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. కలర్ ఫుల్‌గా మూవీని చూపించడంతోను చాలా రిచ్‌గా సీన్లను అందించారు. కలర్ టోన్ బాగుంది. సుమంత్ జీ నాయుడు పాటించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి.
Harom Hara Movie Review in Telugu  Sudheer Babu gives best of his Career

హరోమ్ హర.. కమర్షియల్ వ్యాల్యూస్‌తో రూపొందిన యాక్షన్ డ్రామా. సుధీర్ బాబు కెరీర్‌లో ది బెస్ట్ అని చెప్పవచ్చు. సెహారి లాంటి సినిమాను అందించిన యువ దర్శకుడు.. ఊహించని విధంగా క్రైమ్ డ్రామాను అందించి షాకిచ్చాడనే చెప్పాలి. బీజీఎం, ఇతర టెక్నికల్ వాల్యూస్ సినిమాకు ప్లస్ పాయింట్. ఒకే పాయింట్ మీద రన్ కావడం కొంత రొటీన్ అనిపిస్తుంది. ఎమోషన్స్ ఇంకా పండించడానికి ఛాయిస్ ఉంది. ఏది ఏమైనా పుష్ప, కేజీఎఫ్, విక్రమ్, జైలర్ లాంటి క్రైమ్ యాక్షన్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి చాలా అంశాలు ఉన్నాయి. థియేట్రికల్ వాచ్ వాల్యూ ఉన్న సినిమా. ఈ వారాంతంలో చూడటానికి మంచి యాక్షన్ థ్రిలర్ హరోమ్ హర.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X