Ardhamaindha Arun Kumar Review: ముద్దులతో తేజస్విని, ప్రేమగా అనన్య.. ఆహా కొత్త సిరీస్ ఎలా ఉందంటే?
రేటింగ్: 2.75/5
టైటిల్: అర్ధమయ్యిందా అరుణ్ కుమార్
నటీనటులు: హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ, తేజస్వి మదివాడ, వాసు ఇంటూరి, జై ప్రవీణ్, అభినవ్ గోమఠం తదితరులు
సంగీతం: అజయ్ అరసాడ
నిర్మాణ సంస్థ: అర్రే స్టూడియో, లాఫింక్ కౌ ప్రొడక్షన్స్
నిర్మాత: బి. సాయి కుమార్, శరణ్ సాయికుమార్
దర్శకత్వం: జొనాథన్ ఎడ్వర్డ్స్
విడుదల తేది: జూన్ 30, 2023
ఓటీటీ వేదిక: ఆహా
ఎపిసోడ్స్: 5, నిడివి: సుమారు 25 నిమిషాలు
ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా అనేక సినిమాలు, వెబ్ సిరీసులు నిర్మిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. విభిన్న జోనర్లలో సిరీసులతో ముందుకు వస్తుంది. అలా తాజాగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న వెబ్ సిరీస్ 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' (Ardhamaindha Arun Kumar). హిందీలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న 'అఫీషియల్ చౌక్యాగిరి' (Official Chukyagiri) అనే వెబ్ సిరీస్ కు రీమేక్ గా 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' తెరకెక్కించారు. మరి ఈ తెలుగు వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో (Ardhamaindha Arun Kumar Telugu Review) చూద్దాం.

కథ:అరుణ్ కుమార్ ముందా (హర్షిత్ రెడ్డి) ఎన్నో కలలతో ఏదో సాధించాలని అమలాపురం నుంచి హైదరాబాద్ కు వస్తాడు. అదాన్ అనే ఆఫీస్ లో ఇంటర్న్ గా జాయిన్ అవుతాడు. ప్రాజెక్ట్ కు సంబంధించిన టాస్క్ ఇవ్వమని బాస్ కార్తీక్ (అభినవ్ గోమఠం)ను అడిగితే.. టీ పెట్టడం వంటి పనులు చెబుతాడు. ఇలా ఆఫీస్ బాయ్ వంటి పనులు చేస్తున్న అరుణ్ కుమార్ కు అదే ఆఫీస్ లో పరిచయమైన పల్లవి (అనన్య శర్మ), షాలినీ (తేజస్వి మదివాడ) ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అరుణ్ ను తన సీనియర్ అయినా జై (జై ప్రవీణ్) ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు? అరుణ్ కుమార్ జాబ్ పర్మనెంట్ అయిందా? కాకా (వాసు ఇంటూరి) పాత్ర ఇంపార్టెన్స్ ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:కార్పోరేట్ కంపెనీల్లో ఒక ఇంటర్న్ ఎలా చూస్తారనే కాన్సెప్టుతో అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలనే కోటీ ఆశలతో హైదరాబాద్ వచ్చిన ఓ యువకుడికి తాను పని చేస్తున్న ఆఫీస్ లో ఎదురైన అనుభవాలే ఈ సిరీస్ కథాంశం. ఇలాంటి క్రియేటివిటీ కంపెనీలో వ్యక్తులను వాడుకోవడం, రివేంజ్, లవ్, ప్రాజెక్ట్ డీల్స్ వంటి విషయాలతో రెగ్యులర్ స్టోరీలా ఉంటుంది. కానీ సన్నివేశాలు తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటాయి.
ప్లస్ పాయింట్స్:పల్లెటూరి నుంచి హైదరాబాద్ కు వెళ్లిన అరుణ్ కుమార్ పాత్రలో సగటు మధ్య తరగతి యువకుడు కనిపిస్తాడు. సిరీసులో లవ్ ట్రాక్ చూడముచ్చటగా ఉంది. డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కాకా పాత్రతో ఫిలాసఫీ డైలాగ్స్ చెప్పించారు. వినడానికి సాధరణ మాటల్లా అనిపించినా లోతైన అర్థంతో ఉన్నాయి. టైటిల్ సాంగ్, బీజీఎమ్ అలరిస్తాయి. స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు అన్నీ చక్కగా కుదిరాయి.

ఎవరెలా చేశారంటే?:అరుణ్ కుమార్ పాత్రలో హర్షిత్ రెడ్డి (తరగతి గది దాటి వెబ్ సిరీస్ ఫేమ్) చాలా బాగా చేశాడు. అమాయకత్వం, తెలివి, వినయం వంటివి హావాభావాలతో అన్ని బాగా చూపించాడు. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, కోపంతో మరోసారి అనన్య శర్మ (30 వెడ్స్ 20 ఫేమ్) ఆకట్టుకుంది. ఇక పొగరైన బాస్ క్యారెక్టర్ లో తేజస్వి మదివాడ సైతం అలరించింది. వాసు ఇంటూరి డైలాగ్స్, కామెడీ నవ్విస్తుంది. మిగతా పాత్రలు అంతా బాగా చేశారు.

ఫైనల్ గా చెప్పాలంటే?:సాదాసీదాగా, త్వరగా అయిపోయే వెబ్ సిరీస్ చూడాలంటే అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ చూడొచ్చు. కానీ ఐదో ఎపిసోడ్ లోని ఘాటు కిస్సింగ్ సీన్ మాత్రం ఇంట్లో పిల్లలతో చూసేందుకు కాస్తా ఇబ్బందిగా ఉండొచ్చు. అంతకుమించి కేవలం 20 నుంచి 25 నిమిషాల నిడివితో అతి తక్కువగా 5 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఈజీగా చూసేయొచ్చు (Ardhamaindha Arun Kumar Web Series Review).


Click it and Unblock the Notifications











