For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Haseen Dillruba review: తాప్సీ అందాలు అరబోసినా.. ఫలితం దక్కని శృంగార వ్రతం

  |

  Rating:
  2.0/5
  Star Cast: తాప్సీ పన్ను, విక్రాంత్ మాసే, హర్షవర్ధన్ రాణే
  Director: వినిల్ మ్యాథ్యూ

  బాలీవుడ్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా అవార్డులు, రివార్డులను దక్కించుకొంటున్నది తాప్సీ పొన్ను. గత రెండేళ్లుగా స్టడీగా కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకొంటూ వెళ్తున్న తాప్సీ పన్ను తాజాగా హసీన్ దిల్‌రుబా అనే మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్ల మూసివేత కొనసాగుతుండటంతో నేరుగా ఓటీటీ రిలీజ్‌తో నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకులకు చేరువైంది. అయితే రిలీజ్‌కు ముందు ట్రైలర్‌తో అంచనాలు పెంచిన ఈ చిత్రంలో తాప్సీ, ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్ మెప్పించిందా అనే విషయాన్ని తెల్చుకోవాలంటే...

  గతంలో ఇటాలియన్ పిల్లతో బ్రేకప్ అయిన రిషబ్ సక్సెనా అలియాస్ రిషూ (విక్రాంత్ మాసే)తో రాణి కశ్యప్ (తాప్సీ పన్ను) వివాహం జరుగుతుంది. కానీ రిషబ్‌‌తో శృంగార జీవితం సరిగా సాగకపోవడంతో రాణిలో అసంతృప్తి, అసహనం పెరిగిపోతుంది. ఈ క్రమంలో రిషబ్ పిన్ని కుమారుడు నీల్ త్రిపాఠి (హర్షవర్ధన్ రాణే)తో అక్రమ సంబంధం పెట్టుకొంటుంది. తాప్సీ అక్రమ సంబంధం వ్యవహారం భర్త రిషబ్‌కు తెలియడంతో అపార్థాలు చోటుచేసుకొంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో జరిగిన పేలుడులో రిషబ్ మరణిస్తాడు.

  Haseen Dillruba review: Tapsee Ponnu sizzles but unimpressive Thriller

  తాప్సీ అక్రమ సంబంధం బయటపడటంతో రిషబ్ ఎలాంటి చర్యలకు పూనుకొన్నాడు? తన సోదరుడు నీల్‌ ప్రవర్తనపై రిషబ్ ఎలా స్పందించాడు? భర్తకు తన అక్రమ సంబంధం విషయం తెలిసిన తర్వాత రాణి మానసిక, శారీరక పరిస్థితి ఏమిటి? రిషబ్ మరణానికి వెనుక అసలు ట్విస్టు ఏమిటి? చివరకు రాణి, నీల్ మధ్య సంబంధాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయి అనే ప్రశ్నలకు సమాధానమే హసీన్ దిల్‌రుబా కథ.

  ఇంట్లో జరిగిన పేలుడులో మరణించిన రిషబ్ కేసు దర్యాప్తు చేపట్టిన జ్వాలాపూర్ పోలీసులు రాణిని విచారించడంతో రాణి వైవాహిక జీవితం, హత్య కేసు విచారణ సమాంతరంగా సాగుతుంది. తొలి భాగంలో తాప్సీ, హర్షవర్ధన్ రాణే మధ్య హాట్ సన్నివేశాలు ప్రేక్షకులకు, ముఖ్యంగా యూత్‌కు గిలిగింతలు పెట్టేలా ఉంటాయి. తాప్సీ కొన్ని సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. ఇక సెకండాఫ్‌కు వచ్చే సరికి రాణి, రిషబ్ పాత్రల మధ్య ఎమోషనల్ అంశాలు చోటుచేసుకొంటాయి. కానీ హత్య కేసు విచారణలో గానీ, సెకండాఫ్‌లో కథ, కథనాలు పేలవంగా ఉండటంతో థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకొలేకపోతాయి. కథలో ఊహించని మలుపు లేకపోవడం, అలాగే కథనం ఆసక్తికరంగా సాగకపోవడం ఈ సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. అలాగే కథలో డెప్త్ లేకపోవడం, నింపాది సాగడం లాంటి అంశాలు సినిమాను మరో రేంజ్ చేర్చలేకపోయాయి.

  Haseen Dillruba review: Tapsee Ponnu sizzles but unimpressive Thriller

  హసీన్ దిల్‌రుబా చిత్రంలో తాప్సీ పన్ను రాణిగా ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. కాకపోతే కథలో దమ్ము లేకపోవడంతో తన ప్రయత్నాలు విఫలమయ్యాయనే ఫీలింగ్ కలుగుతుంది. పెళ్లైన కొత్తలో భర్త ప్రేమ కోసం తాపత్రయపడే భార్యగా తాప్సీ నటన బాగుంది. శృంగారమైన సీన్లు, లిప్‌లాక్స్ లాంటి సీన్లలో ఎలాంటి మొహమాటం లేకుండా నటించింది. ఇక విక్రాంత్ తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించాడు. నెగిటివ్ షేడ్, అలాగే క్లైమాక్స్లో ఎమోషనల్ అంశాలు కలిసి ఉన్న క్యారెక్టర్‌ను పండించేందుకు కృషి చేశాడనిపిస్తుంది. ఇక హర్షవర్దన్ రాణే నీల్ పాత్రకు యాప్ట్‌గా అనిపిస్తాడు. రొమాంటిక్ సన్నివేశాల్లో ఆకట్టుకొన్నాడు. అలాగే విలనిజం షేడ్‌ను ఫర్‌ఫెక్ట్‌గా చేశాడు. మిగితా పాత్రల్లో వారి పరిధి మేరకు ఓకే అనిపించారు.

  ఇక టెక్నికల్ విషయాలకు వస్తే.. సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్రాణంగా నిలిచిందని చెప్పవచ్చు. నదీ పరివాహక ప్రాంతంలో సీన్లను జయకృష్ణ గుమ్మడి బాగా ఎలివేట్ చేశాడు. అమిత్ త్రివేది ప్రభావం పెద్దగా కనిపించలేకపోయింది. అందుకు కంటెంట్ సరిగా లేకపోవడమే ప్రధానం కారణం కావొచ్చనే అభిప్రాయం కలుగుతుంది. ఇక ఎడిటింగ్ విషయంలో కూడా చాలా లోపాలు కనిపిస్తాయి. శ్వేతా వెంకట్ మ్యాథ్యూ కత్తెరకు పదును పెట్టలేదనిపిస్తుంది. ఇక దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్, కిషన్ కుమార్ లాంటి సినీ ప్రముఖులు కథ, కథనాలపై కసరత్తు చేయకుండానే సాహసం చేశారా అనిపిస్తుంది. బడ్జెట్ పరంగా చూస్తే సినిమాను ఊరు పేరు నటులతో సినిమాను చుట్టేశారా అనే అనుమానం కలుగుతుంది.

  హసీన్ దిల్‌రుబా చిత్రం భావోద్వేగానికి, రొమాంటిక్, మంచి థ్రిలర్ అంశాలను సరైన పాళ్లలో మిక్స్ చేస్తే మంచి చిత్రంగా మారి ఉండేది. కానీ పేలవమైన స్క్రిప్టు, బలహీనమైన పాత్రల కారణంగా ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచడానికి ఎక్కువ స్కోప్ ఇచ్చింది. ప్రధాన నటీనటుల ఫెర్ఫార్మెన్స్ ఓ మేరకు ఫర్వాలేదనిపించినా.. కొన్ని కారణాల వల్ల ఈ హసీనా మెప్పించలేకపోయింది.

  నటీనటులు: తాప్సీ పన్ను, విక్రాంత్ మాసే, హర్షవర్ధన్ రాణే తదితరులు
  దర్శకత్వం: వినిల్ మ్యాథ్యూ
  నిర్మాతలు: ఆనంద్ ఎల్ రాయ్, హిమాంశు శర్మ, భూషణ్ కుమార్, కిషన్ కుమార్
  మ్యూజిక్ డైరెక్టర్: అమిత్ త్రివేది
  సినిమాటోగ్రఫి: జయకృష్ణ గుమ్మడి
  ఎడిటింగ్: శ్వేతా వెంకట్ మ్యాథ్యూ
  రచన: కనికా థిల్లాన్
  బ్యానర్: టీ సీరీస్, ఎరోస్ ఇంటర్నేషనల్
  ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్
  ఓటీటీ రిలీజ్ డేట్: 2021-07-02

  English summary
  Haseen Dillruba movie review: Haseen Dillruba movie is mystery thriller film directed by Vinil Mathew and produced by Aanand L. Rai, Himanshu Sharma, Bhushan Kumar and Krishan Kumar under the banner Colour Yellow Productions, T-Series and Eros International. The movie have Taapsee Pannu, Vikrant Massey and Harshvardhan Rane in lead roles. This film hits the Netflix OTT on 2 July 2021.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X