For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లవ్, రొమాన్స్, రివేంజ్...(హేట్ స్టోరీ -3 రివ్యూ)

  By Bojja Kumar
  |

  Rating:
  2.5/5

  ముంబై: హేట్ స్టోరీ-3.... ట్రైలర్ విడుదలైనప్పటి నుండే శృంగార భరితమైన కోరుకునే ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. విశాల్ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదలైంది. ఎరొటిక్ సీన్లతో కూడిన ట్రైలర్ రిలీజ్ చేసి హాట్ టాపిక్ అయిన ఈ సినిమాలో అసలేముంది? అనేది రివ్యూలో చూద్దాం.

  విశాల్ పాండే దర్శకత్వంలో 2012లో వచ్చిన ‘హేట్ స్టోరీ' హిట్ కావడంతో ‘హేట్ స్టోరీ-2' కూడా వచ్చింది. తాజాగా విడుదలైన మూవీ ఈ సిరీస్ లో మూడోది. ఇందులో 3 ఇడియట్స్ ఫేం శర్మాన్ జోషి, కరణ్ సింగ్, సల్మాన్ ఖాన్ సినిమాల్లో నటించిన జరీన్ ఖాన్, డైసీ షా నటించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

  Hate Story 3 Movie Review

  కథ విషయానికొస్తే....
  ఆదిత్య సింగ్(శర్మాన్ జోషి), అతని భార్య సియా సింగ్(జరీన్ ఖాన్) చుట్టూ తిరుగుతంది. ఆదిత్య సోదరుడు విక్రమ్ సింగ్ ప్రమాదంలో మరణించడంతో కంపెనీ బాధ్యతలు తనే చేపడతాడు. అతని సెక్రటరీగా కావ్య(డైసీ షా) పని చేస్తుంది. ఉన్నట్టుండి వీరి జీవితంలోకి మరో వ్యాపార వేత్త సౌరవ్ సింఘానియా (కరణ్ సింగ్ గ్రోవర్) రావడంతో సమస్యలు ఏర్పడతాయి. తన కంపెనీ ఆదిత్య కంపెనీలో విలీనం చేయడానికి ప్రయత్నిసాడు సౌరవ్. ఆదిత్య భార్య సియాతో ఒక రాత్రి గడుపుతాను అని అడుగుతాడు. అప్పుడు గానీ సౌరవ్ అసలు రూపం ఆదిత్యకు అర్థం కాదు. మరో వైపు ఆదిత్య సెక్రటరీ డైసీ షా సౌరవ్ లవ్ ట్రాప్ లో పడుతుంది. ఆదిత్య కంపెనీని నాశనం చేయడానికే ఆమెను ప్రేమిస్తున్నట్లు నటిస్తాడు సౌరవ్. ఆమెకు విషయం అర్థంఅయ్యేలోగా ఆదిత్య తీవ్రంగా నష్టపోతాడు. తమ కంపెనీని కాపాడుకోవడానికి ఆదిత్య, సియా ఏం చేసారు? సౌరవ్ ఆదిత్య కంపెనీని ఎందుకు నష్టపరచాలనుకుంటాడు అనేది తెరపై చూడాల్సిందే.

  పెర్పార్మెన్స్ విషయానికొస్తే...
  కరణ్ సింగ్ గ్రోవర్ పెర్పార్మెన్స్ ఆయన అభిమానులను ఆకట్టుకుంది. అతని హావభావాలు, మ్యాన్లీ లుక్, సౌరవ్ సింఘానియా పాత్రలో ఒదిగిపోయిన వైనం ఆకట్టుకుంటుంది. ప్రీతీకారంతో రగిలిపోయే వ్యక్తిగా శర్మాన్ జోషి గత సినిమాలకు భిన్నంగా కనిపించాడు. జరీన్ ఖాన్ పెర్ఫార్మెన్స్ కాస్త ఓవర్ గా అనిపించింది. గ్లారమ్ పరంగా రెచ్చిపోయింది. ఇక డైసీ షా కనిపించింది తక్కువ సమయమే అయినా ఓకే అనిపించింది.

  టెక్నికల్ అంశాల విషయానికొస్తే...
  ప్రకాష్ కుట్టీ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. శృంగార భరితమైన సీన్లు, మెలోడియస్ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. స్క్రీన్ ప్లే ఫర్వాలేదనే విధంగా ఉంది. అయితే బ్యాక్ టు బ్యాక్ సస్పెన్స్ సీన్లతో దర్శకుడు ప్రేక్షకులు బోర్ పీల్ కాకుండా మేనేజ్ చేసాడు. హేట్ స్టోరీ గత సిరీస్ లతో పోలిస్తే బెస్ట్ అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బావుండనిపిస్తుంది. సినిమా నిర్మాణ విలువలు బావున్నాయి. సాంగ్స్, నేపథ్య సంగీతం బావుంది. సినిమా విడుదలకు ముందు వచ్చిన ట్రైలర్లో చాలా వల్గర్ సీన్లు కనిపించాయి. అయితే సినిమాలో అవేమీ లేవు. సెన్సార్ బోర్డు వాటిని కట్ చేసినట్లు స్పష్టమవుతోంది. అయితే అసందర్భంగా వచ్చే పాటలు కాస్త చిరాకుతెప్పిస్తాయి.

  ఓవరాల్ గా చెప్పాలంటే...
  గతంలో వచ్చిన హేట్ స్టోరీ సీరిస్ సినిమాలు మీకు నచ్చి ఉంటే ఈ సినిమా కూడా తప్పకుండా నచ్చుతుంది. శృంగార భరిత సన్నివేశాలు, లవ్, రివేంజ్, సస్సెన్స్, రొమాంటిక్, ఎరోటిక్ సీన్లు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చతుంది.

  English summary
  The much awaited erotic-thriller of Vishal Pandya, Hate Story 3, has released worldwide. The erotic revenge thriller takes the audiences through relationships, love, hatred and vengeance and you can give it a shot this weekend!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X