Hatya Movie Review: హత్య మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: రవివర్మ, పూజా రామచంద్రన్, ధన్య బాలకృష్ణ, భరత్ రెడ్డి, రఘునాథ్ రాజు, శివాజీ రాజా తదితరులు
దర్శకత్వం: శ్రీ విద్య బసవ
నిర్మాత: ఎస్ ప్రశాంత్ రెడ్డి
మ్యూజిక్:నరేష్ కుమరన్
సినిమాటోగ్రఫి: అభిజార్ నైర్
ఎడిటింగ్: అనీల్ కుమార్ పీ
ఆర్ట్ డైరెక్టర్: ఎస్ ప్రశాంత్ రెడ్డి
బ్యానర్: మహాకాల్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2025-01-24
ఏపీ సీఎం కిరణ్ రెడ్డి (భరత్ రెడ్డి) బాబాయ్ ధర్మేంద్ర రెడ్డి (రవి వర్మ) ఇల్లందులలోని తన నివాసంలోనే దారుణంగా హత్యకు గురవుతారు. అయితే తొలుత ఆయన మరణం గుండెపోటు వల్ల జరిగిందని వార్తలు వస్తాయి. కానీ ధర్మేంద్ర గొడ్డలి వేటుతో హత్యకు గురయ్యాడనే నిర్ఱారణ అవుతుంది. ఆ క్రమంలో తన బాబాయ్ మరణానికి వెనుక హస్తం ఎవరిదనే విషయంపై నిగ్గు తేల్చడానికి సుధారావు (ధన్య బాలకృష్ణ) నేతృత్వంలో సిట్ విచారణకు ఆదేశిస్తారు.

ధర్మేంద్ర రెడ్డి గుండెపోటుకు గురయ్యాడని ఎందుకు రూమర్లు క్రియేట్ చేశారు. గొడ్డలి వేటుతో ఆయనను ఎవరు హత్య చేశారు? ధర్మేంద్ర రెడ్డికి సలీమా (పూజా రామచంద్రన్)కు సంబంధం ఏమిటి? సుధా రావు చేపట్టిన సిట్ విచారణలో ఏం తేలింది? ఈ హత్య వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏమిటి? ధర్మేంద్ర రెడ్డిని దారుణ హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానమే హత్య సినిమా కథ.
హత్య సినిమా కథ వినగానే ఏపీలోని కడప జిల్లాలో జరిగిన వివేకానందరెడ్డి హత్య సంఘటన గుర్తుకు వస్తుంది. రాజకీయ కుట్ర నేపథ్యంగా సంచలనం రేపిన ఈ హత్య కేసు ఎన్నో చిక్కుముడులు ఉన్నట్టు కనిపించాయి. దర్శకురాలు శ్రీ దివ్య బసవ ఎంచుకొన్న పాయింట్ కొత్తగా కాకపోయినా.. ప్రమోషన్స్‌లో స్టోరీని రివీల్ చేసిన విధానంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొన్నది. అయితే హత్య తర్వాత బయటి ప్రపంచానికి తెలియని అనేక కథలు, కోణాలు సినిమాలో ట్విస్టులుగా కనిపిస్తాయి. దర్శకురాలు సంచలన రీతిలో ముగింపు నివ్వడం అందర్నీ షాక్ గురి చేస్తుంది.
హత్య మూవీ కథ ప్రపంచానికి తెలిసిన వాస్తవం. అయితే అలాంటి సబ్జెక్ట్ తీసుకొని సినిమాగా రూపొందించినప్పుడు కొంత వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేయడమో.. లేదా కొత్త కోణంలో కథను నడిపించి ఉండాల్సిందనిపిస్తుంది. అయితే ఇంకా ఈ కేసు కోర్టు పరిధిలో ఉండటం వల్ల దర్శకురాలు కొంత డిఫెన్స్‌లో ఉన్నారా? అనే సంశయం కలుగుతుంది.
నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ధర్మేంద్ర రెడ్డిగా రవి వర్మ గెటప్, ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా బాగున్నాయి. ఏపీ రాజకీయాల్లో సంచలన రేపిన వివేకానంద రెడ్డి పోలిన గెటప్‌లో చక్కగా ఒదిగిపోయాడు. తనదైన శైలిలో నటించి మెప్పించాడు. ఇక ఐపీఎస్ ఆఫీసర్‌గా ధన్య బాలకృష్ణ తన పాత్రకు న్యాయం చేశారు. సలీమాగా ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో పూజా రామచంద్రన్ మెప్పించారు. భరత్ రెడ్డి, శివాజీ రాజా తదితరులు తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి ప్లస్ పాయింట్స్. అభిజార్ కొన్ని సన్నివేశాలను చక్కగా తెరకెక్కించారు. నరేష్ ఈ మూవీకి ఎంత కావాలో ఆ రేంజ్‌లో బీజీఎం, పాటలను అందించారు. ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు ఫర్వాలేదనిపిస్తుంది. నిర్మాత ప్రశాంత్ రెడ్డి ఎస్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
హత్య సినిమా విషయానికి వస్తే.. పొలిటికల్ మోటివ్ ఉన్న మర్డర్ మిస్టరీ. ప్రపంచానికి తెలిసిన విషయాన్నే ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నించడం వల్ల కొత్తదనం కరువైందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ పాత విషయాన్ని కూడా గ్రిప్పింగ్‌గా చెప్పిన విధానం బాగుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. కొన్ని సెన్సేషనల్ అంశాలు ఉన్నాయి కాబట్టి.. కొంత క్యూరియాసిటీ కూడా కలుగుతుంది.


Click it and Unblock the Notifications











