Hatya Review విజయ్ ఆంటోని హిట్ కొట్టాడా? హత్య మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: విజయ్ ఆంటోని, రితికా సింగ్, మీనాక్షి చౌదరి, జాన్ విజయ్, రాధికా శరత్‌కుమార్, మురళీ శర్మ, సిద్ధార్థ శంకర్, కిషోర్ కుమార్ తదితరులు
దర్శకత్వం: బాలాజీ కె కుమార్
నిర్మాత: ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ & లోటస్ పిక్చర్స్
మ్యూజిక్: శివకుమార్ విజయన్
సినిమాటోగ్రఫి: గిరీష్ గోపాలకృష్ణన్
ఎడిటర్: సెల్వ ఆర్కే
రిలీజ్ డేట్: 2023-07-21

హైదరాబాద్‌లో సింగర్, మోడల్‌గా రాణిస్తున్న లైలా (మీనాక్షి చౌదరీ)కి సతీష్ (సిద్దార్థ శంకర్) అనే బాయ్‌ఫ్రెండ్ ఉంటాడు. లైలా లైఫ్‌ జాలీగా గడిచిపోతున్న సమయంలో ఆమె అనుమానాస్పద పరిస్థితుల్లో తన ఇంట్లోనే హత్యకు గురవుతారు. మోడల్ లైలా హత్య సెన్సేషనల్‌గా మారడంతో ఆ కేసును దర్యాప్తు చేయడానికి పోలీస్ ఆఫీసర్ సంధ్య (రితికా సింగ్) రంగంలోకి దిగుతుంది. సంధ్య దర్యాప్తు సహకరించడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వినాయక్ (విజయ్ ఆంటోని) రెడీ అవుతారు.

మోడల్ లైలా హత్యకు కారణం ఏమిటి? లైలా హత్యకు వరంగల్‌లో జరిగిన భవానీ మర్డర్‌కు సంబంధం ఉందా? లైలా హత్య కేసులో మోడల్ కోఆర్డినేటర్ ఆదిత్య కౌశిక్ (మురళీ శర్మ)ను ఎందుకు అనుమానించారు? ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అర్జున్ వాసుదేవ్ (అర్జున్ చిదంబరం)కు సంబంధం ఉందా? తనను పెంచిన మహిళ కుమారుడు బబ్లూ (కిషోర్ కుమార్)కు లైలా మర్డర్‌కు లింకు ఉందా? లైలా హత్య కేసు చిక్కు ముడిని సంధ్య, వినాయక్ ఎలా ఛేదించారు అనే ప్రశ్నలకు సమాధానమే హత్య సినిమా కథ.

Vijay Antony

హత్య సినిమా సస్సెన్స్, మర్డర్ మిస్టరీకి కావాల్సిన అన్ని అంశాలతో ఆసక్తిగా ప్రారంభమవతుుంది. అయితే కథను సరైనా మార్గంలో నడిపించడంలో దర్శకుడు ట్రాక్ తప్పారనే ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సీన్లతో ఫస్టాఫ్ కొంత ఇంట్రెస్ట్‌గానే సాగుతుంది. ఓ ట్విస్టుతో హత్య సినిమా సెకండాఫ్‌పై క్యూరియాసిటీని పెంచుతుంది.

ఇక హత్య సెకండాఫ్‌లో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకొనే ప్రయత్నం వర్కవుట్ కాలేదని తొందర్లోనే తేలిపోతుంది. అర్జున్, కౌశిక్, బబ్లూ కోణంలో హత్య ఎలా జరిగిందనే విషయంపై కథను నడిపించడం ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. చివరకు సినిమాను ముగించాలనే తొందర్లలో ఏదో ఒకటి చేసి హత్య కేసును ముగించే ప్రయత్నం జరిగిందనిపిస్తుంది. కేసు దర్యాప్తు పేరుతో సినిమాను మరీ సాగదీశారనే ఫీలింగ్ కలుగుతుంది.

ఈ సినిమా నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. మీనాక్షి చౌదరీ గ్లామర్ పరంగా ఆకట్టుకొన్నది. ఆమె క్యారెక్టర్‌ను తొందరగా ముగించినప్పటికీ.. మీనాక్షి కథ మొత్తంగా కనిపిస్తుంది. అయితే మీనాక్షికి నటనను ప్రదర్శించడానికి స్కోప్ లేకపోయిందనిపిస్తుంది. రితికా సింగ్ పోలీస్ ఆఫీసర్‌గా కూడా ఒకే అనిపించింది. కథ, సన్నివేశాల్లో పస లేకపోవడంతో రితికా చేయడానికి ఏమీ లేకపోయింది. విజయ్ ఆంటోని పరిస్థితి కూడా అలానే ఉంటుంది. ఒక డిఫరెంట్ పాత్రలో విజయ్ మెప్పించే ప్రయత్నం చేశారనిపిస్తుంది. మిగితా పాత్రల్లో నటించిన వారు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. కథ, కథనంలో వేగం, బలం లేకపోవడం వల్ల మ్యూజిక్, సినిమాటోగ్రఫి విభాగాలకు ఎక్కువగా శ్రమించాల్సి వచ్చింది. టెక్నికల్‌గా ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచే ప్రయత్నం కనిపించింది. ఎడిటింగ్ విభాగానికి ఇంకా చాలా పని ఉందనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి, విజయ్ ఆంటోని ఫ్యాన్స్‌కు నచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X