He Man And The Masters Of The Universe Review: హీ మ్యాన్ అండ్ మాసర్స్ ఆఫ్ ది యూనివర్స్ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: నికోలాస్ గాలిట్‌జైన్, కామిలా మెండిస్, ఎడ్రిస్ ఎల్బా, జేరెడ్ లెటో, ఆలిసాన్ బ్రై, జేమ్స్ ప్యూర్‌ఫాయ్ తదితరులు
దర్శకత్వం: ట్రావిస్ నైట్
నిర్మాతలు: టాడ్ బ్లాక్, జాసన్ బ్లమెంథాల్
మ్యూజిక్: డేనియల్ పెంబెర్టన్
సినిమాటోగ్రఫి: ఫేబియన్ వాగ్నర్
ఎఢిటర్స్: పాల్ రుబెల్
రిలీజ్ డేట్: 2026-06-05
ఎటెర్నియా గ్రహంపై దుష్టశక్తి స్కెలెటర్ (జేరెడ్ లెటో) తన అనుచర గణంతో దాడి చేసి ధ్వంసం చేస్తాడు. ఈ దాడిలో యువరాజు ఆడమ్ (నికోలాస్ గ్యాలిట్‌జైన్) సంబంధికులందరూ మృత్యువాత పడుతారు. ఈ క్రమంలో యువరాజుకు ఓ శక్తిమంతమైన కత్తిని ఇచ్చి ఎటెర్నియా నుంచి బయటకు పంపిస్తారు. ఈ క్రమంలో పవర్‌ఫుల్ కత్తి యువరాజు ఆడమ్ నుంచి మిస్ అవుతుంది. తన ప్రపంచం నుంచి భూమి పైకి వచ్చిన ఆడమ్ ఓక్లాహమా సిటీలో ఓ కంపెనీలో పనిచేస్తూ సామాన్య జీవితాన్ని గడుపుతుంటాడు. స్నేహితురాలు తీలా (కామిలా మెండిస్)తో కలిసి పొగొట్టుకొన్న కత్తి కోసం వెతకడం మొదలుపెడుతాడు.

ఎటెర్నియాపై స్కెలెటర్ ఎందుకు దాడి చేశాడు? ప్రిన్స్ ఆడమ్ ఎటెర్నియా గ్రహం నుంచి ఎలా తప్పించుకొన్నాడు? శక్తిమంతమైన కత్తిని ఎలా పొగొట్టుకొన్నాడు? ఓక్లాహమాలో ఆడమ్ లైఫ్ ఎలా గడించింది? తన గ్రహానికి వెళ్లడానికి ఆడమ్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? వారసత్వంగా సంక్రమించిన ఖడ్గాన్ని మళ్లీ సొంతం చేసుకొనేందుకు ఎలాంటి కృషి చేశాడు? చివరకు ఫవర్‌ఫుల్ ఖడ్గం ఆడమ్ చేతికి చిక్కిందా? స్కెలెటర్‌పై దండయాత్ర చేసి ఎటెర్నియాను ఆడయ్ ఆక్రమించుకొన్నాడా? ఈ ప్రాసెస్‌లో 15 ఏళ్ల తర్వాత హీ మ్యాన్ ప్రయాణం ఎలా సాగింది? అనేది హీ మ్యాన్ అండ్ మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ సినిమా కథ.
1987 సంవత్సరంలో వచ్చిన మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ అనే సినిమా ఆధారంగా రెండో ఫ్రాంచైజీగా ఈ చిత్రం రూపొందింది. అయితే ఈ తరం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి క్రియేట్ చేసిన యూనివర్స్ బాగుంది. కానీ ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్స్‌ను మంచి కొత్త ప్రపంచాన్ని సృష్టించలేకపోవడం, ప్రభావవంతంగా క్యారెక్టర్లను డిజైన్ చేయలేకపోవడం ఈ సినిమాకు ప్రధాన లోపంగా కనిపిస్తుంది. అలాగే ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ పెంచి.. మెస్మరైజ్ చేసే స్క్రీన్ ప్లే లేకపోవడం మరో లోపంగా కనిపిస్తుంది. ఇలాంటి లోపాల మధ్య ఆడయ్‌గా నికోలాస్ గ్వాలిట్‌జైన్ చేసిన పెర్ఫార్మెన్స్ బాగుంది. ఆయన నటన కొంత మేరకు ఈ లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. విజువల్‌గా, గ్రాఫికల్ ప్రజెంటెషన్ బాగుంది. సపోర్టింగ్ క్యారెక్టర్లు బలంగా లేకపోవడం ఈ సినిమాతో ఆడియెన్స్ కనెక్టివిటీ మిస్ అయ్యేలా చేస్తుంది. ఇక విలన్ క్యారెక్టర్ స్కెలెటర్ కూడా బలహీనంగా కనిపిస్తాడు. అబ్బురపరిచే విధంగా సన్నివేశాలు లేకపోవడం వల్ల ఈ సినిమా సాదాసీదా రివెంజ్ డ్రామాగానే కనిపిస్తుంది.
ప్రిన్స్ ఆడమ్‌గా నికోలాస్ గ్వాలిట్‌జైన్ , తీలాగా కమిలా మెండిస్, స్కెలెటర్‌గా జెరెడ్ లెటో, మ్యాన్ ఎట్ ఆర్మ్స్‌గా ఇడ్రిస్ ఎల్బా ఫర్వాలేదనిపిస్తారు. నికోలాస్, కమిలా లుక్ బాగుంది. గ్లామర్ పరంగా ఆకట్టుకొన్నారు. స్కెలెటర్ రూపాన్ని ఫిక్స్ చేసినందు వల్ల విలన్‌గా హావభావాలు, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా ఎలివేట్ కాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ కారణంగానే ఆడమ్, స్కెలెటర్ మధ్య సన్నివేశాలు రక్తి కట్టలేదనే విషయం స్పష్టంగా కనిపించిందని చెప్పాలి. ఈ సినిమాలో గొప్పగా పెర్ఫార్మెన్స్ లేకపోయినా.. చూసినంత సేపు అసంతృప్తిని మాత్రం కలిగించవు.
ఈ సినిమాకు అత్యంత బలం ఎటెర్నియా గ్రహం క్రియేషన్. విజువల్‌గా ఆడియెన్స్‌ను కట్టిపడేసే విధంగా గ్రాఫిక్స్ రూపొందించారు. కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల గ్రాఫిక్ వర్క్ చాలా కృత్రిమంగా కనిపిస్తుంది. డేనియల్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రపి, ఎడిటింగ్ తమ బాధ్యతలను సంక్రమంగానే నిర్వర్తించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. వేసవి సెలవుల్లో పిల్లలు ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. పెద్దలను మాత్రం అంతగా ఆకట్టుకొనే అంశాలు లేవు. కాబట్టి ఈ సినిమాను చూడాలా? వద్దా? అనేది మీరే డిసైడ్ చేసుకోండి.


Click it and Unblock the Notifications