twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Heads And Tales Review : సునీల్ దేవుడిగా మారి ఆడుకున్న సినిమా ఎలా ఉందంటే?

    |

    Rating: 2.5/5

    చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా? నచ్చుతున్న అన్ని సినిమాలను ఒకే రకంగా ఆదరిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. అందుకే నిర్మాతలు సైతం థియేటర్లలో రిలీజ్ చేయడానికి అనువుగా కొన్ని సినిమాలు కేవలం ఓటీటీకి అనువుగా ఉండే విధంగా కొన్ని సినిమాలు కూడా చేస్తున్నారు. తాజాగా కేవలం ఓటిటిలో రిలీజ్ చేయడం కోసం కలర్ ఫోటో టీం రూపొందించిన హెడ్స్ అండ్ టేల్స్ సినిమా జీ ఫైవ్ యాప్ లో విడుదలైంది. సునీల్ భగవంతుడు పాత్రలో నటించిన ఈ సినిమా ముందు నుంచి కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది.. మరి సినిమా ఎలా ఉంది? అనేది సమీక్ష లో తెలుసుకుందాం

    హెడ్స్ అండ్ టేల్స్ కథ ఏంటంటే?

    హెడ్స్ అండ్ టేల్స్ కథ ఏంటంటే?

    అందరి తల రాతలు రాసే దేవుడు (సునీల్)ను ఇంటర్వ్యూ చేయడానికి ఒక రిపోర్టర్ (రఘురామ్) వస్తాడు. ఈ క్రమంలో దేవుడు చెప్పిన ముగ్గురు అమ్మాయిల కథ ఈ సినిమా. అలివేలు మంగ(దివ్య శ్రీపాద), శృతి (చాందిని రావు), అనీషా (శ్రీదివ్య)ల జీవితాలే ఈ సినిమా కథకు మూల వస్తువు. అలివేలు మంగ భర్త ఒక రెస్టారెంట్ లో వెయిటర్ గా పని చేస్తూ అక్కడ ఒక అద్దం పగలగొట్టడంతో ఆమెకు డబ్బు అవసరం అవుతుంది.

    భర్త డబ్బు కోసం గొడవ పడితే ఆ టెన్షన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మంగ పోలీస్ స్టేషన్ కి వెళుతుంది. అదే సమయంలో అనీషా తన కాబోయే భర్త తన మీద ఆసిడ్ పోస్తా అని బెదిరించిన విషయంలో కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. అలివేలు మంగ, అనిషా మధ్య ఏం జరిగింది? ఒక రాత్రి ఇద్దరూ కలిసి ఎందుకు గడపాల్సి వచ్చింది? అలా గడిపిన తర్వాత ఏం జరిగింది అనేది సినిమా కథ.

    హెడ్స్ అండ్ టేల్స్ లో ట్విస్టులు

    హెడ్స్ అండ్ టేల్స్ లో ట్విస్టులు

    సినిమా ప్రారంభం నుంచి కూడా కాస్త ఆసక్తికరంగా అనిపించకపోయినా ప్రధాన పాత్రల పరిచయం తర్వాత సినిమా మీద ఆసక్తి పెరుగుతుంది. అలివేలు మంగతో అనీషా పరిచయం ఆ తర్వాత అనీష కోసం అలివేలు మంగ చేసిన సాహసం, అలివేలు మంగ ధైర్యం చూసి అనీషా తెచ్చుకున్న ధైర్యం ఇలా ప్రతి ఒక్క అంశం ప్రేక్షకుడికి ఆసక్తి కలిగిస్తాయి. చివరికి మాత్రం ఒక సాలిడ్ ట్విస్టుతో సినిమా ముగించారు. శ్రుతి, అనీషా ఒకరికి ఒకరు ఏం అవుతారు? అనే విషయం చివరికి రివీల్ చేస్తారు.

    హెడ్స్ అండ్ టేల్స్ ఎలా ఉందంటే?

    హెడ్స్ అండ్ టేల్స్ ఎలా ఉందంటే?

    ముగ్గురు అమ్మాయిలు, ఒక్కొక్కరిదీ ఒక్కొక్క ఉద్యోగం, కానీ కానీ వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు మావాళ్ళే వాడిలా కాగా ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనలు వాళ్ళిద్దరినీ కూడా ధైర్యవంతులుగా చేస్తాయి. అలివేలు మంగ భర్తతో గొడవ, అనీషా కాబోయే భర్తతో గొడవ, శృతి తను ప్రేమిస్తున్న వాడికి ఎస్ చెప్పబోయే ముందు గొడవ ఇలా ఆడ వాళ్లు జీవితంలో ప్రతి అడుగులోనూ అవమానాలు, అనుమానాలు ఎలా ఎలా ఎదురవు తున్నాయి? వాటిని ఎలా అధిగమించాలి? అనే విషయాన్ని సినిమాలో చూపారు. సమస్యలు వేరైనా సమస్యలకు మూలం ఒకటే, దానికి సమాధానం ఒకటే అనే విషయాన్ని చాలా చక్కగా సూటిగా సుత్తిలేకుండా చెప్పేశారు.. అన్ని సమస్యలకు చాలా ఈజీ సొల్యూషన్స్ ఉంటాయిగానీ మనమే వాటిని వెతుక్కోకుండా సమస్యలను మరింత జటిలం చేసుకుంటున్నాము అనే విషయాన్ని తేటతెల్లం చేశారు.

    దర్శకుడి టేకింగ్ ఎలా ఉందంటే?

    దర్శకుడి టేకింగ్ ఎలా ఉందంటే?

    దర్శకుడు టేకింగ్ విషయానికి వస్తే కొత్త దర్శకుడు సాయి కృష్ణ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు అనిపిస్తోంది. రచయిత ఇచ్చిన కథకు పూర్తి న్యాయం చేస్తూ కేవలం స్త్రీల కోణం లోనే కాక స్త్రీ పురుషుల మధ్య ఉన్న సంబంధం, ఒకరికి ఒకరు వేరేవారి గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనే విషయం మీద ఒక క్లారిటీ తో సరైన సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు అనిపించింది.

    చాలా సింపుల్ కథ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా మన పెయిన్ ఎప్పుడూ పక్కన వాడికి చిన్నదిగా మనకు పెద్దగా కనిపిస్తుంది అనే విషయాన్ని క్లారిటీ గా చెప్పారు. సినిమా మొత్తం మీద ఈ ఒక్క పాయింట్ మాత్రం హైలెట్ అని చెప్పవచ్చు.

    నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే

    నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే

    ఈ సినిమాలో దేవుడి పాత్రలో నటించిన సునీల్ రిపోర్టర్ పాత్రలో నటించిన రఘురాం శ్రీపాద, శ్రీవిద్య, దివ్య శ్రీపాద, చాందిని రావు, అరుణ్, తరుణ్, కివిష్ ఇలా ఎవరికి వాళ్ళు తమ పాత్రల్లో నటించారు అని అనడం కంటే జీవించారు అని చెప్పడం మేలు.. ఎందుకంటే ఎక్కడ కూడా నటీనటులు నటిస్తున్న భావన అయితే కలగలేదు. ఎక్కువగా కధ శ్రీవిద్య దివ్య శ్రీపాద మధ్యనే తిరుగుతుండడంతో వీరిద్దరూ తమ దైన ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇద్దరికీ సినిమాలు కాస్త కొత్త అయినా తమకు బాగా అలవాటు అయిపోయిన గర్ల్ ఫార్ములా వీడియోలలోలా చాలా ఈజ్ తో, ఎక్కడా సినిమాలో నటిస్తున్న ఆమె భావన కలగకుండా చాలా సహజమైన నటనతో ఆకట్టుకున్నారు.

    టెక్నికల్ విభాగాల పనితీరు విషయానికి వస్తే

    టెక్నికల్ విభాగాల పనితీరు విషయానికి వస్తే

    కలర్ ఫొటో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి దర్శకుడిగా పరిచయం అయిన సందీప్ రాజ్ అందించిన కథ ఆకట్టుకుంది. ఎంతో మంది మహిళలు తమ తమ జీవితాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను చాలా సున్నితంగా డీల్ చేశారు. అయితే ఏదో సందేశం ఇస్తున్నట్లు కాకుండా కథను చాలా ఈజ్ తో సింపుల్ గా తేల్చేశారు. మరీ ముఖ్యంగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం ఆకట్టుకుంది.

    ఇక ఆయన అందించిన నేపథ్య సంగీతం కూడా చాలా సన్నివేశాలకు బాగా ప్లస్ అయింది. సినిమా ఎక్కువ భాగం రాత్రి సమయంలో జరగడంతో సినిమాటోగ్రాఫర్ కూడా తన పనితనం చూపించారు. డైలాగులు మాత్రం బాగా ఆకట్టుకున్నాయి. సినిమా ప్రారంభం కావడానికి కొంత లేట్ అయినా సరే పాత్రల పరిచయం అయ్యాక ఊపందుకుంది.

    ఫైనల్ గా సినిమా ఎలా ఉంది అంటే

    ఫైనల్ గా సినిమా ఎలా ఉంది అంటే

    సినిమా మొదలైనప్పుడు కాస్త ఇబ్బందికరమైన సినిమాగా అనిపిస్తుందేమో కానీ పాత్రల పరిచయం తర్వాత సినిమా మీద ఆసక్తి పెరుగుతుంది. సినిమా చాలా సింపుల్ గా ఎలాంటి మెలికలు టెన్షన్ లేకుండా సాగిపోతూ ఉంటుంది. అయితే కథ మంచిదయినా కథనం ఇంకాస్త బలంగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. భారీ అంచనాలు పెట్టుకోకుండా ఒక్కసారి ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూడదగ్గ సినిమా ఇది. ఓటీటీ కావడంతో బూతు మాటలు కూడా అక్కడక్కడ వినిపిస్తాయి.

    Recommended Video

    Santosh Sobhan Vs Director Maruthi Truth Or Dare | Manchi Rojulochaie
    చిత్రం : హెడ్స్ అండ్ టేల్స్

    చిత్రం : హెడ్స్ అండ్ టేల్స్


    విడుదల: 22-10-2022 (జీ 5 ఓటీటీలో)
    నటీనటులు : సునీల్, రఘు రామ్ శ్రీపాద, సుహాస్, దివ్య శ్రీపాద, శ్రీవిద్య మహర్షి, చాందిని రావు, అరుణ్ పులవర్తి, తరుణ్ పొనుగోటి, కివీష్ కౌటిల్య
    దర్శకత్వం: సాయికృష్ణ ఎన్రెడ్డి
    కథ: సందీప్ రాజ్
    సమర్పణ: ఎస్.కె.ఎన్
    నిర్మాతలు: ప్రదీప్ అంగిరేకుల, రమ్య చౌదరి
    ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్
    కెమెరా: వెంకట్ ఆర్. శాఖమూరి
    సంగీతం: మణిశర్మ

    English summary
    here is the review of Heads And Tales Telugu Movie in telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X