Heat Movie Review సైకోతో ‘మిస్పింగ్’ గేమ్.. సైకాలజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Rating: 2.5/5
నటీనటులు: వర్ధన్ గుర్రాల, స్నేహా ఖుషి, మోహన్ సాయి, అంబికా వాణి, వంశీ రాజ్, పుల్కిత్ తదితరులు
దర్శకులు: ఎంఎన్ అర్జున్, శరత్ వర్మ
రచన,ఎడిటింగ్: ఎంఆర్ వర్మ
నిర్మాతలు: ఎంఆర్ వర్మ, సంజోష్
సహ నిర్మాతలు: శివన్ కుమార్ కందుల, శ్రీధర్ వీ
సంగీతం: గౌతమ్ రవిరామ్
సినిమాటోగ్రఫి: రోహిత్ బాచు
బ్యానర్: RAYN స్టూడియోస్
రిలీజ్ డేట్: 2023-05-05
హీట్ కథ ఏమిటంటే?: సిరిల్ (మోహన్ సాయి), అభిజిత్ (వర్ధన్ గుర్రాల) క్లోజ్ ఫ్రెండ్స్. పీకల్లోతు ప్రేమలో ఉన్న క్రిస్టియన్ మతానికి చెందిన సిరిల్.. హిందూ మతానికి చెందిన ఆరాధ్య (అంబికా వాణి) పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొంటారు. వీరిద్దరి పెళ్లికి అభిజిత్, అతడి ప్రియురాలు మాన్య అండగా నిలుస్తారు. క్రిస్టియన్ ఆచారం ప్రకారం పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్లిపోవాలని అనుకొంటున్న సమయంలో వారిద్దరూ అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించకుండా పోతారు. మిస్ అయిన తన స్నేహితుడు సిరిల్, ఆరాధ్య గురించి అభిజిత్ వెతకడం మొదలుపెడుతాడు.
హీట్ మూవీ ట్విస్టులు: ఎంజాయ్ చేయడానికి పబ్‌కు వెళ్లిన సిరిల్, ఆరాధ్య, అభి, మాన్యత జీవితాల్లో ఏం జరిగింది? సిరిల్, ఆరాధ్య ఎలా అదృశ్యం అయ్యారు. కనిపించకుండా అనుమానాస్పదంగా మిస్ అయిన సిరిల్, ఆరా ఆచూకీ కోసం అభిజిత్ ఎలా వెతకడం ప్రారంభించాడు? సిరిల్‌తో పెళ్లి ఇష్టం లేని ఆరా సోదరుడు రుద్ర ఎలాంటి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకొన్నాడు? సిరిల్, ఆరా మిస్పింగ్ వెనుక హస్తం ఉన్న మైఖేల్ ఎవరు? వారిద్దరిని ఎందుకు కిడ్నాప్ చేశాడు. సిరిల్, ఆరా క్షేమంగా తిరిగి వచ్చారా? మైఖేల్‌కు ఎలాంటి గుణపాఠం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానమే హీట్ సినిమా కథ.

హీట్ ఎలా సాగిందంటే?: హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న నలుగురు స్నేహితుల జీవితాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకొంటే.. ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనే కోణంలో కథను దర్శకులు అర్జున్, సంతోష్ వర్మ కథను నిదానంగా చెప్పే ప్రయత్నం చేశారు. అనవసరపు కమర్షియల్ అంశాలను కథలో జొప్పించకుండా నిజాయితీగా కథను చెప్పిన తీరు సినిమాకు పాజిటివ్‌గా మారిందని చెప్పవచ్చు. నిజాయితీగా కథను చెప్పే క్రమంలో కొన్ని చోట్ల సినిమా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.

సెకండాఫ్‌లో ట్విస్టులు: సెకండాఫ్‌లో ఉండే ట్విస్టులు కథను వేగవంతం చేయడంతో ఆ ఫీలింగ్ పోతుంది. చివరి 15 నిమిషాలు కథను నడిపించిన తీరు దర్శకుల ప్రతిభకు అద్దం పట్టింది. మైఖేల్ పాత్రతో అభి దాగుడు మూతల ఆట మరింత రక్తి కట్టి ఉండే మంచి సస్పెన్స్, థ్రిల్లర్ అయి ఉండేదనిపిస్తుంది. కొత్త వారు చేసిన ప్రయత్నం ఫర్వాలేదనిపిస్తుంది.

నటీనటుల ఫెర్ఫార్మెన్స్: హీట్ సినిమా కథ సిరిల్, ఆరా చుట్టే తిరుగుతుంది. కానీ వారి ఫెర్ఫార్మెన్స్‌కు పెద్దగా స్కోప్ కనిపించదు. కానీ అభిజిత్‌గా వర్ధన్ పాత్ర ఈ సినిమాకు బలంగా కనిపిస్తుంది. సినిమా భారాన్ని మొత్తం తనపైనే మోయడంలో వర్ధన్ మంచి పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. కొత్తవాడైనా మంచి మెచ్యురిటీతో నటించి మెప్పించే ప్రయత్నం చేశాడు. మాన్యతకు కూడా పెద్దగా స్కోప్ లేకపోయింది. మైఖేల్ పాత్రలో నటించిన యాక్టర్ మంచి బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొన్నాడు.
టెక్నికల్‌గా ఎలా ఉందంటే?: సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. హీట్ సినిమాకు సినిమాటోగ్రఫి హైలెట్‌గా కనిపిస్తుంది. నైట్ ఎఫెక్ట్ షూట్ ఈ సినిమా కథ మూడ్‌ను ఎలివేట్ చేసేలా ఉంది. రోహిత్ సినిమాట్రోఫిని బాగా డీల్ చేశాడు. ఎంఆర్ వర్మ రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ఎమోషన్ పవర్‌ఫుల్ వెపన్.. చీకటిలో కూడా వెలుగు చూపించే వాడే స్నేహితుడు లాంటి డైలాగ్స్ ఆకట్టుకొన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పలు సీన్లను ఇంట్రెస్టింగ్‌గా మార్చాయి. మిగితా విభాగాల పనితీరు కూడా కొత్త ఫీల్‌ను కలిగిస్తాయి.

ఫైనల్‌గ ఎలా ఉందంటే?: మిస్సింగ్ ఇన్వెస్టిగేషన్ బ్రాక్ డ్రాప్‌తో సైకో థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రూపొందిన సైకాలజికల్, సస్పెన్స్ మూవీ హీట్. ఒక ఎమోషనల్ పాయింట్‌ను డ్రైవ్ చేస్తూ ప్రతీ సీన్ గురించి క్రియేట్ చేసిన ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ప్రత్యేక ఆకర్షణ. కొత్త వారంతా కలిసి చేసినప్పటికీ.. ప్రాజెక్టును టెక్నికల్‌గా, సౌండింగ్ వైజ్ బాగా డీల్ చేశారనిపిస్తుంది. స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ఉన్న యువకులంతా మంచి ఫెర్ఫార్మెన్స్ ఆ లోపాలను సవరించే ప్రయత్నం చేశారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. ఎంఆర్ వర్మ, సంజోష్ నిర్మాణ విలువలు సినిమాపై వారికి ఉండే అభిరుచిని తెలియజేసింది. సైకాలజీకల్ థ్రిల్లర్, సస్పెన్స్ జోనర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











