Ala Ninnu Cheri Review పాయల్, హెబ్బా , దినేష్ ప్రేమ కథా చిత్రం.. అలా నిన్ను చేరి ఎలా ఉందంటే?

Rating:
2.5/5

నటీనటులు: దినేష్ తేజ్, హెబా పటేల్, పాయల్ రాధాకృష్ణ, ఝాన్సీ, చమ్మక్ చంద్ర, శత్రు తదితరులు
దర్శకత్వం: మారేష్ శివన్
నిర్మాత: కొమ్మాలపాటి సాయి సుధాకర్
సమర్పణ: కొమ్మలపాటి శ్రీధర్
సినిమాటోగ్రఫి: అండ్రూ
మ్యూజిక్: సుభాష్ ఆనంద్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఫైట్స్: కింగ్ సోలమన్
సాహిత్యం: చంద్రబోస్
బ్యానర్: విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌
రిలీజ్ డేట్: 2023-11-10

వైజాగ్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన గణేష్ (దినేష్ తేజ్)‌కు చిన్నప్పటి నుంచే సినిమాలంటే పిచ్చి. సినిమా దర్శకుడి కావాలనే లక్ష్యంతో ఉంటాడు. ఈ క్రమంలో తన గ్రామానికి చెందిన దివ్య (పాయల్ రాధాకృష్ణ)‌తో ప్రేమలో పడుతాడు. గణేష్‌తో ప్రేమలో ఉందని తెలుసుకొన్న దివ్య తల్లి (ఝాన్సీ) తన కూతురుకు బలవంతంగా పెళ్లి చేయడానికి చేస్తుంది. ఈ క్రమంలో గణేష్ తన డ్రీమ్‌ను నెరవేర్చుకోవడానికి గణేష్ హైదరాబాద్‌కు వెళ్తే అక్కడ అను (హెబ్బా పటేల్) కలుస్తుంది.

Ala Ninnu Cheri Movie Review

దివ్యకు తల్లిదండ్రులు పెళ్లి చేశారా? దివ్య పెళ్లిని గణేష్ ఎందుకు ఆపలేకపోయాడు? హైదరాబాద్‌కు గణేష్ వెళ్లి చేసిన సినిమా ప్రయత్నాలకు ఎలాంటి అడ్డంకులు కలిగాయి? గణేష్ జీవితంలోకి వచ్చిన అను ఎలాంటి పాత్ర పోషించింది? చివరకు గణేష్ సినిమా డైరెక్టర్ అయ్యాడా? గణేష్ జీవితానికి ముగింపు ఏమిటి? పెళ్లి విషయంలో దివ్యకు ఏం జరిగింది? అనుతో రిలేషన్‌షిప్ ఎలా ముగిసింది? అనే ప్రశ్నలకు సమాధానమే అలా నిన్ను చేరి సినిమా కథ.

Ala Ninnu Cheri

గ్రామీణ, పట్టణ వాతావరణంతో అల్లుకొన్న ప్రేమ కథకు తొలి చిత్ర దర్శకుడిగా మారేష్ శివన్ న్యాయం చేసేందుకు ప్రయత్నించారు. ఎంచుకొన్న పాయింట్‌కు కమర్షియల్ అంశాలను జోడించి కథను నడిపిన తీరు బాగుంది. ఫస్టాఫ్‌ను చక్కగా డీల్ చేసిన దర్శకుడు మారేష్ శివన్‌ సెకండాఫ్‌లో కొంత తడబాటుకు గురయ్యాడు. రొటీన్ అంశాలు, రెగ్యులర్ స్క్రీన్ ప్లే కారణంగా కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు కొత్తదనం కనిపించకపోవడం, అనవసరమైన కంటెంట్ వల్ల సినిమాలో ఉండే ఫ్లేవర్ తగ్గిపోయింది. ఓవరాల్‌గా క్లైమాక్స్‌ను ముగించిన విధానం ఫీల్‌గుడ్‌గా ఉంది.

నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు చిన్న చిన్న పాత్రలతో హీరోగా ఆకట్టుకొంటున్న దినేష్ తేజ్ ఈ సినిమా పూర్తి భారాన్ని తన భుజాలపై మోసాఢని చెప్పవచ్చు. నటనపరంగా చాలా మెచ్యురిటీ కనిపించింది. డ్యాన్సులు, ఫైట్స్‌తో మెప్పించాడు. ఎమోషనల్ సీన్లను బాగా పండించాడు. ఇక పాయల్ రాధాకృష్ణ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది.రొమాంటిక్ సీన్లలో మంచి కెమిస్ట్రీ పండించింది. ఇక హెబ్బా పటేల్ సెకండాఫ్‌లో గ్లామర్‌తో ఆకట్టుకొన్నది. సినిమాను మంచి జోష్‌తో నడిపించేలా చేసింది. దినేష్ తేజ్ స్నేహితుడి పాత్రను పోషించిన నటుడు, చమ్మక్ చంద్ర, ఝాన్సీ ఇతర పాత్రల్లో నటించిన వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.

Ala Ninnu Cheri Telugu Movie

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. అండ్రూ అందించిన సినిమాటోగ్రఫి ప్రతీ ఫ్రేమ్‌ను రిచ్‌గా మార్చింది. సుభాష్ ఆనంద్ మ్యూజిక్ బాగుంది. కోడి బాయే లచ్చ పాట జోష్ పెంచింది.చంద్రబోస్ సాహిత్యం సినిమాను ఎమోషనల్‌గా మార్చింది. ఎడిటింగ్ విషయానికి వస్తే..సెకండాఫ్‌లో కొన్ని సీన్లపై కత్తెర పడాల్సి ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక కొమ్మాలపాటి సాయి సుధాకర్, శ్రీధర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇండస్ట్రీకి కొత్తవారైనా నిర్మాణపరంగా ప్రమాణాలను పాటించారు. సినిమాపై తపన ఉన్న నిర్మాతలనే ఫీల్‌ను క్రియేట్ చేశారు.

ఫన్, ఎమోషన్స్, ట్రాయాంగిల్ లవ్ అంశాలను కలబోసి రూపొందించిన చిత్రం అలా నిన్ను చేరి. లక్ష్యం కోసం ప్రేమను త్యాగం చేసిన యువకుడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యానే పాయింట్ అల్లు కొన్న సన్నివేశాలు ఫస్టాఫ్‌లో బాగుంటే.. సెకండాఫ్‌లో రొటీన్‌గా, అందరూ ఊహించే విధంగా సాగిపోయాయి. తొలి సినిమా అయినప్పటికీ కథను డీల్ చేసిన విధానం చూస్తే దర్శకుడి ప్రతిభ ఆకట్టుకొంటుంది. మ్యూజిక్, సాహిత్యం సన్నివేశాలను ఎమోషనల్‌గా మార్చేసింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్, లవ్ స్టోరీలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X