Great Indian Suicide Review ట్విస్టులతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్.. హెబా పటేల్ మరోసారి.. గ్రేట్ ఇండియన్ సూసైడ్
Rating 2.75/5
నటీనటులు: రామ్ కార్తీక్, హెబా పటేల్, వీకే నరేష్, పవిత్రా లోకేష్, జయప్రకాశ్ తదితరులు
రచన, నిర్మాత, దర్వకత్వం: విప్లవ్ కోనేటి
సినిమాటోగ్రఫి: అనంత నాగ్ కావూరి, అజయ్ వీ నాగ్
మ్యూజిక్: శ్రీ చరణ్ పాకాల
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
బ్యానర్: సిరంజీ
ఓటీటీ రిలీజ్: ఆహా
ఓటీటీ రిలీజ్ డేట్: 2023-10-06
కాఫీ షాప్‌ను రన్ చేసే హేమంత్ (రామ్ కార్తీక్) ఓ అనాథ. తన కాఫీ షాప్‌కు కుకీస్ సప్లై చేసే చైత్ర (హెబా పటేల్)ను చూసి లవ్‌లో పడుతాడు. అయితే రామ్ చేసిన లవ్ ప్రపోజల్‌ను చైత్ర రిజెక్ట్ చేస్తుంది. అయితే తన లవ్ ప్రపోజల్‌ను రిజెక్ట్ చేయడంతో హేమంత్ నిరాశకు లోనై ఓ నిర్ణయం తీసుకొంటాడు. దాంతో తాను, తన కుటుంబం త్వరలోనే సూసైడ్ చేసుకోబోతున్నామని చైత్ర చెబుతుంది.

నీలకంఠయ్య మరణం చైత్ర కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపింది? అసలు నీలకంఠ మరణం ఎలా సంభవించింది? అసలు నీలకంఠ ఎవరు? చైత్ర ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నది? చైత్రతోపాటు ఆమె ఫ్యామిలీ మెంబర్స్ మాస్ సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకొన్నారు? తాను, తన కుటుంబం సూసైడ్ చేసుకోవాలనుకొంటున్నామని చైత్ర చెబితే హేమంత్ ఎలా స్పందించాడు? నిజంగానే చైత్ర, ఆమె ఫ్యామిలీ సూసైడ్ చేసుకొన్నారా? నీలకంఠ కోసం చైత్ర ఫ్యామిలీ ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకొన్నది? మూఢ నమ్మకంతో ఉన్న చైత్రను హేమంత్ మార్చాడా? మాస్ సూసైడ్‌ను ఆపడానికి హేమంత్ ఏం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే గ్రేట్ ఇండియన్ సూసైడ్ మూవీ కథ.

చైత్ర, హేమంత్ క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడానికి తక్కువ సమయం తీసుకొని.. మాస్ సూసైడ్ అనే పాయింట్‌తో కథలోకి వేగంగా వెళ్లిపోవడం వల్ల సినిమాపై ఆసక్తి ని కలిగించడంలో దర్శకుడు విప్లవ్ కోనేటి తన ప్రతిభను చాటుకొన్నాడు. చైత్రను ఒప్పించడానికి ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవడంతో కథలో వచ్చే ట్విస్టులు మరింత క్యూరియాసిటిని పెంచేలా చేస్తుంది. కథలో ఎమోషన్స్ దట్టించిన తీరు బాగుంది. ఇక కథలోకి చిన్న పిల్లలపై స్వామిజీల అకృత్యాలు పాయింట్‌తో మరింత ఎమోషనల్‌గా దర్శకుడు మర్చాడు.

చైత్రగా హెబా పటేల్ మరోసారి ఫెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రతో మెప్పించారు. సినిమాలో ప్రధాన పాత్రలో ఒదిగిపోయాడు. మంచి ట్విస్ట్ ఉన్న పాత్రలో ఆకట్టుకొన్నాడు. అలాగే రామ్ కార్తీక్ కూడా హేమంత్ క్యారెక్టర్‌తో మెప్పించాడు. మూఢ నమ్మకాలను నుంచి బంధ విముక్తి చేసే పాత్రలో మంచి ఫెర్ఫార్మెన్స్ కనపరిచారు. వీకే నరేష్, పవిత్రా లోకేష్, అలాగే నిర్మల్ మహారాజ్ పాత్రలో రత్న శేఖర్ రెడ్డి, సిరి పాత్లో దుబోరా దోరిస్ ఫెల్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. శ్రీ చరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అదరగొట్టాడు. అనంత నాగ్ కావూరి, అజయ్ వీ నాగ్ అందించిన సినిమాటోగ్రఫి కూడా బాగుంది. సన్నివేశాలకు తగినట్టుగా వాడుకొన్న లైటింగ్ ప్రతీ ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా మార్చాయి. బడ్జెట్ పరంగా తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీ సినిమాను అందించారనే చెప్పాలి. , అలాగే నటీనటులు పరంగా చూస్తే.. దర్శకుడు ప్రతీ ఒక్కరి నుంచి ప్రతిభను రాబట్టుకొన్న తీరు బాగుంది.

మూఢ నమ్మకాలను ప్రజలపై బలంగా రుద్ది దొంగ బాబాలు, స్వాములు ఎలా స్వార్ధపూరితంగా ఉంటారనే విషయాన్ని చెప్పే సస్పెన్స్ థ్రిల్లర్ గ్రేట్ ఇండియా సూసైడ్. కాన్సెప్ట్, యాక్టర్ల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బలం. అయితే ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా, గ్రిప్పింగ్‌గా కథ చెప్పగిలిగి ఉంటే.. ది బెస్ట్ అయి ఉండేది. కథను కొంత సాగదీసి చెప్పిన ఫీలింగ్ కలుగుతుంది. అయినా ఈ సినిమా థ్రిల్స్, ట్విస్టులతో మంచి అనుభూతిని అందిస్తుంది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. మీకు తోచినప్పుడు.. ఒకేసారి సినిమాను చూస్తే మంచి ఫీలింగ్ కలుగుతుంది. గ్రేట్ ఇండియా సూసైడ్ మిమ్మల్ని నిరాశ పరచదు.


Click it and Unblock the Notifications











