Black & White Review రొమాంటిక్ డోస్‌తో హెబ్బా పటేల్.. క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

నటీనటులు: హెబ్బా పటేల్, సూర్య శ్రీనివాస్, లహరి షారీ, నవీన్ నేని తదితరులు
దర్శకత్వం: ఎల్ఎన్‌వీ సూర్య ప్రకాశ్
నిర్మాత: పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి
ఎడిటర్: శివ శర్వాని
మ్యూజిక్: అజయ్ అర్రసాడ
సినిమాటోగ్రఫి: టీ సురేంద్రరెడ్డి
రిలీజ్ డేట్: 2023-04-14

ఆధునిక భావాలు ఉన్న స్వరాంజలి (హెబ్బా పటేల్) వర్ధన్ (సూర్య శ్రీనివాస్)‌ ప్రేమించుకొంటారు. వారిద్దరూ సహజీవనం చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో వర్ధన్‌కు వచ్చిన ఓ మెసేజ్ వారిద్దరి మధ్య గొడవలకు దారి తీస్తుంది. గొడవ తారాస్థాయికి చేరడంతో వర్ధన్‌ను స్వరాంజలి మర్డర్ చేస్తుంది.

Hebba Patel

సహజీవనం సాఫీగా సాగుతున్న సమయంలో స్వరాంజలికి వర్ధన్‌కు చిచ్చుపెట్టిన మెసేజ్ ఏమిటి? ఆ మెసేజ్ ఎవరి నుంచి వచ్చింది? స్వరాంజలి, వర్ధన్ మధ్య రిలేషన్‌షిప్‌లో చిచ్చు పెట్టింది ఎవరు? స్వరాంజలి, వర్ధన్ కథలో పప్పు (నవీన్ నేని) ఎవరు? వర్ధన్, స్వరాంజలికి జానుకు ఉన్న సంబంధం ఏమిటి? వర్ధన్ మర్డర్ కేసులో స్వరాంజలి శిక్ష పడిందా? అనే ప్రశ్నలకు సమాధానమే B & W (Black & White) సినిమా కథ.

దర్శకుడు సూర్య ప్రకాశ్ రాసుకొన్న థ్రిల్లింగ్ పాయింట్స్ బాగున్నాయి. క్లైమాక్స్ సన్నివేశాల్లో ట్విస్టులు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. వెలుగు చూడాలి అంటే, చీకటి సాయం తీసుకోవాలి ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్ తగినట్టుగా కథ సాగుతుంది. మర్డర్ మిస్టరీగా సాగే కథను కొత్తగా చూపించాలనే తపన దర్శకుడిలో కనిపించింది.

స్వరాంజలిగా హెబ్బా పటేల్ సరికొత్తగా కనిపిస్తుంది. గతంలో గ్లామర్ పాపగా కనిపించిన హెబ్బా తన ఇమేజ్‌కు భిన్నమైన పాత్రలో నటించింది. ఫెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకొన్నది. సూర్య శ్రీనివాస్ కొత్తవాడైనప్పటికీ.. అనుభవం ఉన్న నటుడిగా పెర్ఫార్మ్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ వెర్షన్‌లో భయపెట్టించే సీన్లు బాగున్నాయి. లహరి షారీ తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకొన్నది.

సాంకేతి విభాగాల పనితీరు విషయానికి వస్తే.. మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫి విభాగాల పనితీరు బాగుంది. చిన్న బడ్జెట్ చిత్రాల్లో మంచి క్వాలిటీ, రిచ్‌ మూవీగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను నిర్మించిన తీరును చూస్తే పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి వారి అభిరుచి తెలియజేస్తుంది.

స్వరాంజలిని చంపడానికి ఎవరో తరుముకొంటూ రావడమనే సన్నివేశంతో మంచి ఫ్లాష్ బ్యాక్ ట్విస్టుతో బ్లాక్ అండ్ వైట్ సినిమా కథ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. ఫస్టాఫ్‌లో స్వరాంజలి, వర్ధన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలను చాలా చక్కగా చిత్రీకరించారు. సహజీవనం ఎపిసోడ్‌లో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఫుల్ జోష్‌తో చూపించారు. అయితే కథ డిమాండ్ చేసినట్టు రొమాంటిక్ టచ్‌ను ఇంకాస్త పెంచితే మంచి రొమాంటిక్ థ్రిల్లర్‌గా మారి ఉండేదనిపిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X