For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘హలో గురు ప్రేమ కోసమే’ రివ్యూ, రేటింగ్

|
Hello Guru Prema Kosame Movie Review హలో గురు ప్రేమ కోసమే సినిమా రివ్యూ

Rating:
1.5/5
Star Cast: రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్
Director: త్రినాథరావు నక్కిన

దిల్ రాజు బేనర్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలు ఉంటాయి. ఆ బేనర్ ట్రాక్ రికార్డ్ అలాంటిది. అందులో రామ్ లాంటి ఎనర్జిటిక్ స్టార్ ఉంటే... సినిమా చూపిస్త మావ, నేను లోకల్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తే ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరుగుతాయి. ఈ కాంబినేషన్లో వచ్చిన 'హలో గురు ప్రేమ కోసమే' చిత్రం దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ మూవీ ప్రేక్షకుల్లో పండగ మూడ్‌ను మంచిత పెంచేలా ఉందా? సగటు వీక్షకుడిని ఏమేరకు ఆకట్టుకుంది? అనే అంశాలను ఓ సారి సమీక్షిద్దాం.

సంజు అనే కుర్రాడి కథ

కాకినాడకు చెందిన సంజు(రామ్) జెన్యూన్‌గా ప్రేమించుకునే వారి కోసం ఏదైనా చేసే కుర్రాడు. ఫ్రెండ్ చెల్లిని ఏడిపిస్తున్నారని తెలిసి బ్యాచ్‌తో కొట్టడానికి వెళ్లి వారు ప్రేమించుకుంటున్నారని తెలిసి పెళ్లి చేస్తాడు. దీని వల్ల ఫ్రెండ్ దూరం అవుతాడని తెలిసినా.... ఫ్రెండ్స్ విడిపోతే ఎప్పటికైనా మళ్లీ కలవొచ్చు, నిజమైన ప్రేమికులు విడిపోతే జీవితంలో కలవలేరు అని వాదించే రకం. అమ్మానాన్న సంతోషం కోసం హైదరాబాద్ వెళ్లి సాఫ్ట్‌వేర్ జాబ్‌లో జాయినైన సంజు ప్రేమలో పడ్డ తర్వాత ఏం జరిగిందో చెప్పే కథ ‘హలో గురు ప్రేమ కోసమే'.

అసలు స్టోరీ

తన ఫ్రెండ్ ఇంట్లోనే ఉండాలని అమ్మ కోరిక మేరకు సంజు.... విశ్వనాథం (ప్రకాష్ రాజ్) ఇంట్లో దిగుతాడు. విశ్వానాథంకు మంచి ఫ్రెండ్ అయిపోతాడు. కానీ వాళ్ల ఇంటికి రాకముందే ట్రైన్లో కలిసిన విశ్వానాథం కూతురు అనుపమను చూసి ఇంప్రెస్ అయిన సంజు.... ఈ విషయం అనుపమకు కానీ, విశ్వనాథంకు కానీ చెప్పేలోపే ఆమెకు వేరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఒక ఫ్రెండుగా తన మనసులో అనుపమ ఉన్న విషయాన్ని విశ్వనాథంకు చెబుతాడు.. ఆ అమ్మాయి తన కూతురు అని తెలియక ముందు నీ ప్రేమకు హెల్ప్ చేస్తానని ఒక ఫ్రెండుగా చెప్పిన విశ్వనాథం, ఆ అమ్మాయి తన కూతురే అని తెలిసిన తర్వాత తండ్రిగా ఎలా రియాక్ట్ అయ్యాడు? ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏమిటనేది మిగతా కథ.

ప్రేమను వదులుకున్నాడా? ఫ్రెండ్షిప్ వదులుకున్నాడా?

విశ్వనాథం ఫ్రెండ్షిప్ కోసం తన ఆస్తిని సైతం త్యాగం చేసే రకం. ఎవరికైనా మాట ఇస్తే తప్పేరకం కాదు. ఆల్రెడీ తన కూతురిని మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పిన ఆయన.... తన ఫ్రెండ్ సంజు కూడా తన కూతురినే ప్రేమిస్తున్నాడని తెలిసి ఏం చేశాడు? ఫ్రెండ్స్ విడిపోతే మళ్లీ కలవొచ్చు... ప్రేమికులు విడిపోతే ఎప్పటికీ కలవలేరు అని వాదించే సంజు? తన ప్రేమ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనేది తెరపై చూడాల్సిందే.

హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.... రామ్ పోతినేని తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. లుక్స్ పరంగా బావున్నాడు, సంజు పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. అనుపమ పరమేశ్వరన్ మిడిల్ క్లాస్ అమ్మాయిగా డీసెంట్ లుక్స్‌‌తో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు పెర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా స్కోప్ లేక పోయినా ఉన్నంతలో ఓకే అనిపించింది. మరో హీరోయిన్ ప్రణీత చిన్న పాత్రలో మెరిసింది.

కీలక పాత్రలో ప్రకాష్ రాజ్

సినిమాలో కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ అంతా రామ్ పోషించిన ‘సంజు' పాత్ర, ప్రకాష్ రాజ్ పోషించిన ‘విశ్వనాథం' పాత్ర చుట్టూ తిరుగుతుంది. అటు తండ్రిగా కూతురు కోసం తపనపడే పాత్రలో, ఇటు సంజు ఫ్రెండుగా అతడికి హెల్ప్ చేసే పాత్రలో మెప్పించాడు. ఇతర నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ అంశాలు

విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి సినిమాటోగ్ర‌ఫీ బావుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం అంగొప్పగా ఏమీ లేదు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉంటే బావుండేది. ఇతర టెక్నికల్ విభాగాల పనితీరు ఫర్వాలేదనే విధంగా ఉంది.

ప్లస్ పాయింట్స్

 • రామ్ పెర్ఫార్మెన్ష్
 • ప్రకాష్ రాజ్
 • అక్కడక్కడ కామెడీ
 • మైనస్ పాయింట్స్

 • కొత్తదనం లేని స్టోరీ
 • స్లోగా సాగే స్క్రీన్ ప్లే
 • ప్రేక్షకుడికి నెక్ట్ అయ్యే స్థాయిలో ఎమోషన్స్ లేక పోవడం
 • విశ్లేషణ

  ఈ సినిమా కథలో కొత్తదనం మిస్సవ్వడం సినిమాకు పెద్ద మైనస్ పాయింట్. స్క్రీన్లే కూడా ఆసక్తికరంగా లేదు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెండాఫ్ వేగం చాలా తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది. కూతురు విషయంలో ప్రకాష్ రాజ్ మీద వచ్చే సీన్లలో కానీ, తను ప్రేమిస్తున్న అమ్మాయి విషయంలో రామ్ మీద వచ్చే సీన్లలో కానీ ఎక్కడా ఎమోషనల్ డెప్త్ కనిపించదు. ప్రేక్షకుడిని కథకు కనెక్ట్ చేయడంతో దర్శకుడు విఫలం అయ్యాడు. ఇక్కడ అప్రస్తుతం అయినా...దర్శకుడు త్రినాథరావు గత చిత్రం ‘నేను లోకల్' సినిమా విజయానికి కారణం కథకు ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడం, సీన్లలో ఆ ఎమోషనల్ డెప్త్ ఉండటమే. ‘హలో గురు ప్రేమ కోసమే'లో క్లైమాక్స్ సైతం పరమ సాధారణంగా ఉంది. ప్రేమకథల్లో కొత్తదనం కంటే ఎమోషనల్ సీన్లు సినిమాను ఓ రేంజికి తీసుకెళతాయి. ఈ చిత్రంలో అది మిస్సయిందని చెప్పక తప్పదు.

  చివరగా...

  ‘హలో గురు ప్రేమ కోసమే' ఒక రోటీన్ ప్రేమకథా చిత్రం. అక్కడక్కడ కొన్ని నవ్వులు పూసినా సగటు ప్రేక్షకుడు సంతృప్తి పడే స్థాయిలో లేదు.

  హలో గురు ప్రేమ కోసమే

  బేనర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

  తారాగణం: రామ్ పోతినేని, అనుపరమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, ప్రణీత

  సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

  సినిమాటోగ్రఫీ: విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి

  ఆర్ట్: సాహి సురేశ్

  ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్

  మాటలు: బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్

  నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్

  సమర్పణ: దిల్ రాజు

  దర్శకత్వం: త్రినాథరావు నక్కిన

  విడుదల తేదీ: ఆగస్టు 18, 2018

  English summary
  Hello Guru Prema Kosame review and rating. The movie starring Ram Pothineni, Anupama Parameshwaram and Pranitha, has Filled with the ordinary srory and screenplay. The movie is about Sanju (Ram Pothineni), who is an easy-going guy and works as a software engineer. He comes to a small town in a quest to win over Anu (Anupama Parameshwaram). How his life changes after that forms the crux of the story.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more