twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హలో మూవీ రివ్యూ: అఖిల్, విక్రమ్ కుమార్ మ్యాజిక్

    By Rajababu
    |

    Rating:
    3.0/5
    Star Cast: అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్, జగపతి బాబు
    Director: విక్రమ్ కుమార్

    Recommended Video

    HELLO Movie Public Talk

    అక్కినేని నట వారసుడిగా అఖిల్ చిత్రంతో అఖిల్ టాలీవడ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం అక్కినేని అభిమానులను నిరాశపరిచింది. అయితే అఖిల్ ఎంట్రీ ఊహించినంతమేరకు లేకపోవడంతో ఇక రీలాంచ్ బాధ్యతను ఏకంగా తండ్రి అక్కినేని నాగార్జున భుజాన వేసుకొన్నాడు. మనం అందించి విక్రమ్ కే కుమార్‌తో జతకట్టి తాజాగా హలో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హలో చిత్రం అఖిల్‌కు సక్సెస్ అందించిందా? తన కుమారుడిని హీరోగా నిలబెట్టడానికి నాగార్జున చేసిన ప్రయత్నం, కోరిక నెరవేరిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

     కథ ఏమిటంటే

    కథ ఏమిటంటే

    శ్రీను ఓ వీధి బాలుడు. సంపన్న కుటుంబానికి చెందిన జున్ను (కల్యాణి ప్రియదర్శన్)కు చిన్నతనంలోనే శ్రీనుతో పరిచయం ఏర్పడుతుంది. శ్రీనుతో పరిచయం ఇష్టంగా మారుతుంది. కానీ ఓ కారణంగా వాళ్లిద్దరూ విడిపోతారు. అయితే విడిపోయే ముందు శ్రీనుకు ఓ ఫోన్ నంబర్ ఇస్తుంది. కానీ శ్రీను ఆమెకు ఫోన్ చేయలేకపోతాడు. జున్ను ప్రియగా, శ్రీను అవినాష్‌గా మారిపోతారు. అలా వారి మధ్య ఎడబాటు సుమారు 15 ఏళ్లుగా ఉంటుంది. ప్రతీక్షణం ఇద్దరు ఒకరి గురించి ఒకరు తలచుకొంటారు.

     ఎలా కలుసుకొన్నారు..

    ఎలా కలుసుకొన్నారు..

    అయితే ఫోన్ నంబర్ ఉన్నా శ్రీను ఎందుకు కలుసుకోలేకపోయాడు? శ్రీను అవినాష్‌గా ఎందుకు మారిపోయాడు. సరోజిని (రమ్యకృష్ణ), ప్రకాశ్ (జగపతిబాబు)కు శ్రీనుకు సంబంధం ఏమిటి? జున్నుగా మారిన ప్రియా శ్రీనును ఎలా కలుసుకొన్నారు? అలా కలుసుకోవాడానికి వారు ఎన్ని కష్టాలు పడ్డారు అనే ప్రశ్నలకు సమాధానమే హలో చిత్ర కథ.

     ఫస్టాఫ్ ఇలా..

    ఫస్టాఫ్ ఇలా..

    ప్రియురాలి కోసం ఎదురు చూసే అవినాష్ కథతో సినిమా ఆరంభమవుతుంది. ఆ తర్వాత శ్రీనుగా మారిన అవినాష్ బాల్యంలోకి కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. ఇక శ్రీను అవినాష్‌గా మారడం, సరోజిని దంపతులకు శ్రీను చేరువవ్వడం అలాంటి కథతో మొదటి భాగం ఆహ్లాదంగా సాగుతుంది. ఓ వైపు తనకు ఇష్టమైన జున్ను కోసం వెతకడంలో ఉంటుండగా, మరోవైపు తన తల్లిదండ్రులతో అవినాష్ అనుబంధం ప్రేక్షకులను దగ్గరవుతుంది.

     సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో

    రెండో భాగంలో పరిచయమైన ప్రియనే జున్ను అని తెలుసుకోలేని అవినాష్ ఆమె ఆకర్షణలో పడుతాడు. ప్రియది కూడా అదే పరిస్థితి. ఒకరికొకరు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్న యువతి, యువకుల మధ్య డ్రామాను విక్రమ్ కే కుమార్ తన దర్శకత్వ ప్రతిభతో హలోను మరోస్థాయికి తీసుకెళ్తాడు. రెండో భాగంలో అనూప్ సంగీతం, పాటలు సినిమాపై ప్రేక్షకుడి పట్టు బిగించేలా చేసింది. చివరకి ఫీల్‌గుడ్ అంశాలతో ఇద్దరు కలుసుకోవడంతో కథ ముగుస్తుంది.

     విక్రమ్ కుమార్ మ్యాజిక్

    విక్రమ్ కుమార్ మ్యాజిక్

    హలో చిత్రం పక్కా దర్శకుడి చిత్రం. ట్విస్టులు, అనేక మలుపులు ఉన్న సినిమాకు విక్రమ్ కుమార్ తనదైన మార్కు స్క్రీన్ ప్లేతో పరుగులు పెట్టించాడు. అఖిల్‌ను చాలా కొత్తగా ఎనర్జిటిక్‌గా చూపించడంలో విక్రమ్ సక్సెస్ అయ్యాడు. ఈ అందమై ప్రేమకథకు జగపతిబాబు, రమ్యకృష్ణ అదనపు ఆకర్షణ. సినిమా రొటీన్‌లోకి జారుకొనే క్రమంలో వారిద్ధరి కథతో విక్రమ్‌ సినిమాను బ్యాలెన్స్ చేశాడు. కథను నింపాదిగా చెప్పడం విక్రమ్ కుమార్ స్క్రీన్ ప్లే లోపంగా కనిపిస్తుంది. కానీ సినిమా వేగానికి ఎక్కడా అడ్డుతగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో తన మ్యాజిక్ తెరపై వర్కవుట్ అయింది.

     అఖిల్ ఫెర్ఫార్మెన్స్

    అఖిల్ ఫెర్ఫార్మెన్స్

    అఖిల్‌లో హీరోకు కావాల్సిన మెటీరియల్ అంతా ఉందనే వాస్తవం. అఖిల్ సినిమా కథ బాగా లేకపోవడం వల్లనే అఖిల్‌కు తొలి విజయం లభించలేదని సత్యం. ఇక ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ, కుటుంబ విలువలను జోడించి హలో అంటూ అఖిల్ ఎనర్జిటిక్ కనిపించాడు. ముఖ్యంగా ఫైట్స్‌ను ఇరుగదీశాడు. పాటల్లో చక్కగా ఆకట్టుకొన్నాడు. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ఓవరాల్‌గా రెండో చిత్రంతో బంపర్ హిట్ కొట్టే చిత్రాన్ని ఎంచుకోవడంలో అఖిల్‌ సక్సెస్ అయ్యాడు.

    కల్యాణి ప్రియదర్శిని యాక్టింగ్

    కల్యాణి ప్రియదర్శిని యాక్టింగ్

    కల్యాణి ప్రియదర్శన్ గ్లామర్, అభినయం హలోకు మరో ఆకర్షణ. కీలక సన్నివేశాల్లో అఖిల్‌కు పోటాపోటిగా నటించింది. పాటల్లోనే మంచి ఈజ్ కనబరిచింది. బాల్యం నుంచి సినీ వాతావరణంలో పెరగడం కారణంగా హలో ఆమెకు మొదటి చిత్రమని ఎక్కడ అనిపించదు. ఓవరాల్‌గా కల్యాణికి హలో ఓ మంచి స్టార్టప్ మూవీగా అవుతుంది.

    ఫీల్‌గుడ్‌గా రమ్యకృష్ణ, జగపతి

    ఫీల్‌గుడ్‌గా రమ్యకృష్ణ, జగపతి

    హలో చిత్రం ఫీల్‌గుడ్ మూవీ అని చెప్పే ముందు రమ్యకృష్ణ, జగపతిబాబు గురించి చెప్పుకోకపోతే ఆ పదానికి న్యాయం జరుగదు. సరోజిని పాత్రలో మళ్లీ రమ్యకృష్ణ జీవించింది. ఏ యువకుడైనా తన తల్లి ఇలా ఉండాలి అనేంతగా నటించి మెప్పించింది. జగపతిబాబుతో కలిసి తెరపై చక్కటి అనుభూతిని ప్రేక్షకుడికి మిగిల్చింది. విలన్‌గా, సీరియస్ పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్న జగపతిబాబు హలో చిత్రంలో ఇలాంటి తండ్రి ఉంటే బాగుండు అనే క్యారెక్టర్‌లో కనిపించాడు. రమ్యకృష్ణ, జగపతిబాబు ఈ సినిమాను బ్యాలెన్స్ చేశారు.

    కామెడీకి స్కోప్ లేదు

    కామెడీకి స్కోప్ లేదు

    ఇక చిత్రంలో వినోదానికి పెద్దగా స్కోప్ లేదు. మిగితా పాత్రలు పెద్దగా కనిపించవు. కానీ చివర్లో వెన్నెల కిషోర్ అలా మెరిసినట్టు మెరిసి మాయమవుతాడు. ఇక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్‌లో అజయ్ కనిపించాడు. అయితే ఈ క్యారెక్టర్‌కు కూడా పెద్దగా స్కోప్ లేదు. కానీ ఒకట్రెండు సీన్లలో తన మార్కును చాటుకొన్నాడు.

    అనూప్ రూబెన్స్ మ్యూజిక్

    అనూప్ రూబెన్స్ మ్యూజిక్

    హలో సినిమాకు అనూప్ రూబెన్స్ మూలస్థంభంగా నిలిచాడు. చక్కటి స్క్రీన్ ప్లేతో సాగుతున్న చిత్రానికి తన రీరికార్డింగ్‌తో జీవం పోశాడు. అఖిల్‌పై సోలో సాంగ్‌తోపాటు అనగనగా ఒక ఊరు పాటలు బాగుంటాయి. ఇక సెకండాఫ్‌లో వచ్చే ఏవోవో కలలు కన్నాను, మెరిసే మెరిసే పాటలు బయట ఆడియోలో ఆకట్టుకొన్న విధంగానే తెరపైన కూడా మంచి ఫీల్‌ను పంచాయి.

    పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫి

    పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫి

    సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ ఈ చిత్రానికి మరో ఎసెట్. అతని కెమెరా పనితనంతో సినిమాలో ప్రతీ ఫ్రేమ్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా చేజింగ్ ఫైట్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌ను బాగా తెరకెక్కించాడు. మెట్రో ట్రైన్‌లో చేజింగ్, స్లమ్స్‌, షాపింగ్ మాల్‌లో తీసిన యాక్షన్ పార్ట్ కొత్తగా ఉంటుంది.

    అన్నపూర్ణ ప్రొడక్షన్ వ్యాల్యూస్

    అన్నపూర్ణ ప్రొడక్షన్ వ్యాల్యూస్

    క్లాలిటీ చిత్రాలు, ఫీల్ గుడ్ మూవీస్ అందించడంలో అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌ ఎదురేలేదు. శివ, నిన్నే పెళ్లాడుతా లాంటి చిత్రాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. ఇక తాజాగా వచ్చిన హలో చిత్రంలో నాగార్జున విజన్ తగినట్టుగా ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నాయి. కథ డిమాండ్ మేరకు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను చక్కగా, చాలా రిచ్‌గా రూపొందించడంలో నాగార్జున సక్సెస్ అయ్యాడు.

    అలా అయితే బ్లాక్ బస్టర్

    అలా అయితే బ్లాక్ బస్టర్

    ఇది ఓ రొమాంటిక్ లవ్ స్టోరి. స్క్రీన్ ప్లే ఆధారంగా పరిగెత్తే సినిమా. ఈ కథలో ఉండే నిజాయితీ ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా చేస్తుంది. పక్కాగా మల్టిప్లెక్స్ ఆడియెన్స్, ఏ సెంటర్ల ప్రేక్షకులకు తెగనచ్చడం ఖాయం. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఈ చిత్రం చేరువైతే అఖిల్‌ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలువడం ఖాయం.

    హాలీవుడ్ స్ఠాయిలో ఫైట్స్

    హాలీవుడ్ స్ఠాయిలో ఫైట్స్

    హలీవుడ్ స్టంట్ మాస్టర్ బాబ్‌ బ్రౌన్‌ యాక్షన్ సీన్లు తెలుగు తెరపై కొత్తగా కనిపించాయి. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్‌తో అఖిల్ యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కొన్నిసార్లు జాకీ చాన్ ఫైట్లను గుర్తుకు తెస్తాయి. రొటీన్‌గా కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ వెరైటీగా ఉంటాయి.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    కథ, కథనం
    అఖిల్, కల్యాణి పెర్ఫార్మెన్స్
    విక్రమ్ కుమార్ డైరెక్షన్
    పీఎస్ వినోద్ ఫొటోగ్రఫి
    యాక్షన్ సీన్లు

    మైనస్ పాయింట్స్
    స్లో నేరేషన్
    ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం

    తెర ముందు.. తెర వెనుక

    తెర ముందు.. తెర వెనుక

    నటీనటులు : అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్ , రమ్య కృష్ణ , జగపతిబాబు
    నిర్మాత: నాగార్జున అక్కినేని
    దర్శకత్వం: విక్రమ్ కే కుమార్
    సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్
    ఎడిటర్ : ప్రవీణ్ పూడి
    మ్యూజిక్ : అనూప్ రూబెన్స్
    రిలీజ్ డేట్: డిసెంబర్ 22, 2017

    English summary
    Akhil Akkineni’s debut film may have turned out to be a dud at the box office but the Akkineni fans haven’t written him off as yet. Akhils upcoming film Hello which is due for release on December 22, to cash in on the long Christmas weekend. In this occassion, Telugu Filmibeat brings exclusive review for our viewers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X