Sreeleela Doctorate: శ్రీలీల ఇక డాక్టర్.. డాక్టరేట్ పట్టాను అందుకొన్న టాప్ హీరోయిన్!

అందం, అభినయంతోపాటు అద్బుతమైన ప్రతిభతో ఆకట్టుకొంటున్న హీరోయిన్ శ్రీలీల. అనతికాలంలోనే దక్షిణాది ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్‌తో నటించడమే కాకుండా మెప్పించిన సౌందర్య రాశి. ఆమె కేవలం నటనకే తన ప్రతిభను పరిమితం చేయలేదు. ఓ పక్క యాక్టింగ్, మరో పక్క వైద్య విద్యను అభ్యసిస్తూ రెండు పడవలపై ప్రయాణిస్తూ విజయాలను అందుకొంటున్నది. తాజాగా ఆమె ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేయడంతో డాక్టరేట్‌ పట్టాను అందజేశారు. ప్రస్తుతం డాక్టరేట్ అందుకొంటున్న వీడియోలు, ఫోటోలు మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

శ్రీలీలకు స్వతహాగా యాక్టింగ్‌తోనే కాకుండా ఉన్నత చదువులు చదువుకోవాలనే కోరిక బలంగా ఉండేది. ఆ మేరకు తల్లి ఆమె కోరికుకు బలంగా మారింది. దాంతో ముంబైలో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించారు. శ్రీలీల ఎంబీబీఎస్ చదువుకొంటున్న సమయంలో హీరోయిన్‌గా బిజీ అయ్యారు. వరుస సినిమాలతో నిత్యం షూటింగులతో బిజీగా ఉన్నప్పటికీ విద్యను దూరం చేసుకోలేదు. షూటింగ్ గ్యాప్‌లో చదువుకు కొంటూ రికార్డులు రాసుకొంటూ స్టడీస్‌ను కొనసాగించారు.

Heroine Sreeleela gets Doctorate after finishing MBBS

ఇటీవల విమానంలో తన ఎంబీబీఎస్ రికార్డులు రాసుకొంటూ ఉన్న శ్రీలీల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిని బట్టి ఆమె చదువులపై ఉన్న ఆసక్తి, పట్టుదల స్పష్టమైంది. పలు సందర్భాల్లో తన వైద్య విద్య గురించి పలు ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే ఎడ్యుకేషన్‌లో తన డ్రీమ్ గురించి వెల్లడించారు.

అయితే పట్టుదలతో శ్రీలీల ఎంబీబీఎస్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. దాంతో ఇటీవల ముంబైలో జరిగిన స్నాతకోత్సవంలో ఆమెకు డాక్టర్ పట్టాను అందజేశారు. ఈ సందర్భంగా వృతి విద్యకు సంబంధించిన ప్రమాణాన్ని చేస్తూ
ఆనందంగా కనిపించారు. పట్టాను స్వీకరించి తన కలను సాకారం చేసుకోవడమే కాకుండా తల్లిదండ్రుల కలలను కూడా నిజం చేశారని నెటిజన్లు అంటున్నారు.

శ్రీలీల డాక్టర్ పట్టాను అందుకోవడం స్పూర్తిదాయకంగా ఉంది అని పలువురు నెటిజన్ల కామెంట్స్ చేస్తున్నారు. ఆమె కృషితో తన డ్రీమ్‌ను ఫుల్‌ఫిల్ చేసుకోవడమే కాకుండా ఎందరికో ఆదర్యంగా నిలిచారు. యాక్టింగ్, ఎడ్యుకేషన్‌ను సమర్ధవంతంగా కొనసాగించిన ఆమెకు అభినందనలు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X