Hey Balwanth Movie Review: హే భగవాన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

మూవీ: హే బల్వంత్
నటీనటులు: సుహాస్, శివానీ నాగారం, నవరసరాయ నరేష్ విజయ్‌కృష్ణ, వెన్నెల కిషోర్, యాంకర్ స్రవంతి చొక్కారపు, నెల్లూరు సుదర్శన్, అజయ్ ఘోష్, హర్షవర్దన్, అన్నపూర్ణమ్మ తదితరులు
బ్యానర్: త్రిశూల్ విజనరీ స్టూడియోస్
నిర్మాత: బీ నరేంద్రరెడ్డి
దర్శకత్వం: గోపి ఆచార
మ్యూజిక్ డైరెక్టర్: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫి: మహీ రెడ్డీ పండుగుల
ఎఢిటింగ్: విప్లవ్ నైషాడ
ప్రొడక్షన్ డిజైన్: ఏ రామ్ కుమార్
కథ: షణ్ముఖ ప్రశాంత్,
డైలాగ్స్: మిథున్ శంకర్ రెడ్డి
రిలీజ్ డేట్: 2026-02-20

చిన్నతనం నుంచే తండ్రి బలవంత్ చేసే వ్యాపారాన్ని కృష్ణ (సుహాస్) చేపట్టాలని కలలు కంటాడు. కానీ తండ్రి తన వ్యాపారానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తాడు. కానీ కృష్ణ అదే కోరికతో పెద్ద పెరిగిన తర్వాత వారసత్వంగా వచ్చే వ్యాపారాన్ని చేపట్టాలని చదువును నిర్లక్ష్యం చేస్తుంటాడు. దాంస్తో కొడుకును బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించి తన వ్యాపారానికి దూరంగా పెడుతాడు. కానీ పెద్ద పెరిగి ఎంబీఎ చేసిన తర్వాత తండ్రి బిజినెస్‌ను టేకోవర్ చేయాలనుకొంటాడు. అయితే ఊహించని విధంగా ఓ క్రిటికల్ కండిషన్‌లో వ్యాపారం కృష్ణ చేతికి వస్తుంది. తన తండ్రి చేస్తున్న బిజినెస్ చూసి షాక్ అవుతాడు. కృష్ణ తండ్రి చేసే బిజినెస్‌ను చూసి ప్రియురాలు మిత్ర (శివానీ నాగారం) అసహ్యించుకొని.. ఆ వ్యాపారం మానేస్తేనే పెళ్లికి సరే అంటుంది. దాంతో ఆ బిజినెస్‌ను అమ్మాలని ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.

Hey Balwanth Movie Review and Rating

బలవంత్ చేసే వ్యాపారం ఏమిటి? తండ్రి వ్యాపారాన్ని ఎందుకు చేపట్టాలని కలలు కంటాడు. తన వ్యాపారానికి కొడుకు కృష్ణను ఎందుకు దూరం పెట్టాడు? తండ్రి చేసే వ్యాపారాన్ని చూసి కృష్ణ ఎందుకు షాక్ తిన్నాడు? ప్రేమ, పెళ్లి విషయంలో ప్రియురాలు మిత్ర పెట్టిన కండిషన్స్ తర్వాత కృష్ణ పరిస్థితి ఏమిటి? తండ్రి బిజినెస్‌ను అమ్మాలని చేసిన ప్రయత్నాలు ఎలా సాగాయి? తండ్రి బిజినెస్‌ను అమ్మేసే ప్రయత్నంలో ఎదురైన కష్టాలు ఏమిటి? చివరకు తండ్రి బిజినెస్‌ను మాన్పించాడా? ప్రియురాలి ప్రేమను ఎలా గెలుచుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే హే బల్వంత్ సినిమా కథ.

కథకుడు షణ్ముఖ ప్రశాంత్ రాసుకొన్న పాయింట్.. అందులో జొప్పించిన ట్విస్టులు, టర్నులు చాలా చక్కగా ఉన్నాయి. స్టోరీని అర్ధం చేసుకొని మిథున్ శంకర్ రెడ్డి రాసిన డైలాగ్స్ సినిమాను హిలేరియస్‌గా మార్చాయి. షణ్ముఖ, మిథున్ విజన్‌ను దర్శకుడు గోపి ఆచార అర్ధం చేసుకొన్న తీరు.. దానిని తెర మీదకు తెచ్చిన ప్రయత్నమే ఈ సినిమా సక్సెస్ బాట పట్టించేలా చేశాయా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ ముగ్గురు తెర మీద ఆడిన డైలాగ్ కామెడీ, విజువల్ సెన్స్‌‌తో ఫన్ విశేషంగా ఆకట్టుకొన్నది. కథలో ప్రతీ మలుపును డిజైన్ చేసిన విధానం బాగుంది. కొత్త వారైనా సినిమాను నడిపించిన విధానం చూస్తే వారికి ఇండస్ట్రీపైన ఉన్న తపన ఏమిటో స్పష్టంగా ప్రతీ ఫ్రేమ్‌లో కనబడుతుంది. ఇక స్ట్రాంగ్ అండ్ ఎమోషనల్ పాయింట్‌‌‌తోపాటు క్యారెక్టర్ల డిజైన్ చాలా బాగుంది. వీకే నరేష్, వెన్నెల కిషోర్, యాంకర్ స్రవంతి, సుహాస్, శివానీ, హర్షవర్ధన్, అజయ్ ఘోష్ పాత్రలను మలిచిన విధానంతోనే తెర మీద కథ అద్బుతంగా పండింది. కొన్నిసార్లు సన్నివేశాలు సిల్లీగా అనిపించినా.. చివర్లో తండ్రి, కొడుకుల ఎమోషన్స్‌ను చూపించిన తీరుతోనే ఈ సినిమా అందరికీ నచ్చేలా చేసింది.

ఇక నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో వీకే నరేష్ టైటిల్ రోల్‌తో మ్యాజిక్ చేశాడు. తన పాత్రలో నటించారని చెప్పడం కంటే జీవించారని అనాలి. ఈ సినిమాకు వీకే నరేష్ మాత్రమే హీరో అనేంతగా పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. ప్రతీ సినిమాకు ఆయన ఎంచుకొంటున్న పాత్రలు, చూపిస్తున్న వేరియేన్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇక సుహాస్ కూడా వీకే నరేష్‌తో పోటీ పడి నటించాడు. సినిమా కథల ఎంపిక కూడా బాగుంది. శివానీ నాగారం కూడా ఈ చిత్ర విజయానికి కావాల్సిన పాజిటివ్ ఎనర్టీని తన నటనతో చూపించారు. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు వస్తే.. భాషను, కథను అర్ధం చేసుకొని బాగా నటిస్తారనే విషయాన్ని మిత్ర క్యారెక్టర్ ద్వారా శివానీ తెలియజెప్పింది. ఇక ఈ సినిమాను తన కామెడీతో లైవ్లీగా మార్చడంలో వెన్నెల కిషోర్ రాకింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ర్యాప్ ఫ్లేవర్‌తో సాగే క్యారెక్టర్ బాగా ఇంప్రూవ్ చేశాడు. హర్షవర్షన్, అజయ్ ఘోష్ గుర్తుండిపోయే పాత్రలు చేయడమే కాకుండా కామెడీతో అదరగొట్టారు. అన్నపూర్ణమ్మ తన మార్కు బాడీ లాంగ్వేజ్, హావభావాలు, యాటిట్యూడ్ తో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.

ఈ సినిమా పూర్తిగా డైలాగ్స్ డ్రామా. అందుకు కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోరును వివేక్ సాగర్ చక్కగా అందించారు. పాటలు కూడా సిచ్యువేషనల్ గా కథలో భాగమై సాగిపోయాయి. డైలాగ్స్ బ్రహ్మండంగా పేలాయి. మహీ రెడ్డీ పండుగుల సినిమాటోగ్రఫి కూడా చాలా బాగుంది. విప్లవ్ నైషాడ ఎడిటింగ్ ఈ సినిమాకు అదనపు బలం. ఫాస్ట్‌గా సాగే సన్నివేశాలను స్క్రీన్ మీద పేర్చిన విధానం వల్లే సినిమా పరుగులు పెట్టింది. మంచి ఫీల్ గుడ్‌తో ఫన్ ఎనర్జీని చూపించేలా చేసింది. ప్రొడక్షన్ డిజైనర్ ఏ రామ్ కుమార్, నిర్మాత బీ నరేంద్ర రెడ్డి అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

హే బలవంత్ సినిమాను బయటి నుంచి చూస్తే.. ఫన్, కామెడీ సినిమాగానే కనిపిస్తుంది. కానీ అంతర్లీనంగా ఈ సినిమాలో తండ్రి, కొడుకుల భావోద్వేగాలు హృదయానికి హత్తుకొనేలా ఉంటాయి. వీకే నరేష్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు అత్యంత బలం. సుహాస్, శివానీ కూడా మరోసారి మెచ్యుర్డ్ ఫెర్ఫార్మెన్స్ అందించారు. రైటింగ్ పరంగా, టెక్నికల్‌గా ఈ సినిమా హైలీ అప్రిషియేబుల్. కన్విన్సింగ్, కమిటెడ్‌గా కథను తెరపైకి తెచ్చారు. డైరెక్టర్ గోపి, రైటర్స్ మిథున్, షణ్ముఖ కొత్తవారైనా ప్రతీ సీన్‌లో అరిపించేశారు. ఈ సినిమా ఆద్యంతం నవ్వులతో సాగే కామెడీ సినిమా మాత్రమే కాదు.. ఓ ఎమోషనల్ జర్నీ. 100 శాతం థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా తప్పకుండా.. సినిమా హాల్‌లోనే చూడండి.

More from Filmibeat

Read more about: Hey Balwanth suhas vk naresh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X