Hey Balwanth First Review: హే బలవంత్! మూవీ ఫస్ట్ రివ్యూ

టాలీవుడ్‌లో యువ హీరో, హీరోయిన్లు సుహాస్, శివానీ నాగారం, నరేష్ విజయ్‌కృష్ణ, వెన్నెల కిషోర్, యాంకర స్రవంతి చొక్కారపు, నెల్లూరు సుదర్శన్, అజయ్ ఘోష్, హర్షవర్దన్ తదితరులు నటించిన చిత్రం హే బల్వంత్. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బీ నరేంద్రరెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ, ఫ్యామిలీ డ్రామా రూపొందిన ఈ చిత్రానికి గోపి ఆచంట దర్శకత్వం వహించారు. ఈ సినిమా టైటిల్‌ను హే భగవాన్ అని పెట్టారు. అయితే సెన్సార్ అభ్యంతరాల కారణంగా హే బలవంత్ అని మార్చారు.

ఫన్ డ్రైవ్, యాక్టర్ల పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని వస్తున్న ఈ సినిమాకు సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. మహీ రెడ్డీ పండుగుల సినిమాటోగ్రఫి, విప్లవ్ నైషాడ ఎఢిటింగ్, ఏ రామ్ కుమార్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను నిర్వర్తించారు. కథను షణ్ముఖ ప్రశాంత్, మిథున్ శంకర్ రెడ్డి డైలాగ్స్ అందించారు. ఫిబ్రవరి 20వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల ముగిసాయి. ఈ సినిమాకు లభించిన సెన్సార్ సర్టిఫికెట్ ఏమిటి? ఈ చిత్రానికి సెన్సార్ నుంచి లభించిన ఫీడ్‌బ్యాక్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..

Hey Balwanth Review by Censor Board

హే బల్వంత్ సినిమా కథ విషయానికి వస్తే.. తండ్రి, కొడుకుల మధ్య నడిచే ఫన్ డ్రామా, తండ్రి (వీకే నరేష్) చేసే వ్యాపారం నష్టాల్లో కూరుకుపోతే.. ఆ బిజినెస్‌ను లాభాల బాట పట్టించే బాధ్యతను కొడుకు కృష్ణ (సుహాస్) వేసుకొనేందుకు ప్రయత్నిస్తాడు. కానీ తండ్రి ఆ ప్రయత్నాన్ని అడ్డుకొంటాడు. అయితే ఆ బిజినెస్‌ను కృష్ణ టేకప్ చేశాడా? ఆయనకు సహాయం చేయడానికి వచ్చిన మిత్ర (శివానీ నాగారం)‌కు ఎదురైన సమస్యలు, పరిస్థితులు ఏమిటి? ఇంతకు కృష్ణకు, ఆయన తండ్రికి ఉన్న బిజినెస్ ఏమిటి? అనేది సినిమా కథ.

ఇలాంటి కామెడీ భరితమైన చిత్రాన్ని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెన్సార్ సర్టిఫికెట్ (CBFC) అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. ఈ సినిమా కంటెంట్‌పై పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేశారు. కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా క్లీన్‌గా ఉన్న ఈ చిత్రానికి హే భగవాన్ అనే టైటిల్ సరికాదు. టైటిల్ మార్చండి అంటూ సెన్సార్ అధికారులు అభ్యంతరం చెప్పారు. దాంతో ఈ సినిమా టైటిల్‌ను కూడా మార్చాం. కానీ సన్నివేశాలు, కథకు కీలక కావడంతో తాము అంగీకరించలేదు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

అయితే ఈ సినిమాలోని అభ్యంతరాలకు చిత్ర యూనిట్ సానుకూలంగా లేకపోవడంతో హే బలవంత్ సినిమాకు ఏ (A) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం.. 18 ఏళ్లు దాటిన వారు మాత్రమే చూడాల్సి ఉంటుంది. చిన్న పిల్లలు అంటే 18 ఏళ్ల లోపు వారు చూడటానికి అనుమతి లేదు అని సెన్సార్ సర్టిఫికెట్‌లో స్పష్టం చేశారు అని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించారు.

ఇక ఈ సినిమా ఆద్యంతం హాస్యంతో సాగుతూ.. ఓ ట్విస్ట్ మాత్రం కథను మలుపు తిప్పేలా ఉంటుంది. ఈ సినిమాలోని కంటెంట్‌ను బట్టి ఈ చిత్రాన్ని 2 గంటల 14 నిమిషాల నిడివికి అంటే.. 134 నిమిషాలకు కట్టుబటి కట్ చేశాం. సినిమాలో ఎలాంటి ల్యాగ్ లేకుండా జాగ్రత్తలు తీసుకొన్నాం. ఈ మూవీ సరదా చకచకా సాగిపోతుంది అని అన్నారు. సెన్సార్ తర్వాత ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఆడియెన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్స్ గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X