twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్తగా మొదలై రెగ్యులర్ గా ముగిసే ప్రేమకథ ‘తమాషా’

    By Lakshmisurya
    |

    Rating:
    3.0/5

    చిత్రం - తమాషా (హిందీ)
    నటీనటులు - రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనే
    సినిమాటోగ్రఫీ - రవివర్మన్
    సంగీతం - ఏ.ఆర్. రహమాన్,
    రచన, దర్శకత్వం - ఇంతియాజ్ అలీ
    రివ్యూ బై : లక్ష్మీ సూర్య కుకునూర్

    నవతరం ప్రేమకథల్ని కొత్తగా చూపించే ఒక దర్శకుడు ఇద్దరు మాజీ ప్రేమికులు కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాగా అందరిలోనూ ఆసక్తిని పెంచిన చిత్రం ‘తమాషా'.

    అసలు విషయం :

    కోర్సికా అనే టూరిస్టు ప్లేస్ లో మనసుకు సంకెళ్ళు లేకుండా జీవించే ఒక అబ్బాయి వేద్ (రణబీర్‌ కపూర్)కీ, తనకు నచ్చినట్లు జీవించే ఒక అమ్మాయి తార (దీపిక) లు కలుసుకుంటారు. అక్కడున్న వారం రోజులు ఇద్దరి గురించి నిజాలు చెప్పుకోకుండా పరిచయస్థుల్లా మెలిగి జీవితంలో మరెప్పుడూ కలుసుకోకూడదనుకుంటారు. వారం రోజులు గడిచిపోయాక ఎవరి దారుల్లో వారు వెళ్ళిపోయాక తారకు వేద్ పై ప్రేమ పుడుతుంది. నాలుగేళ్ళు గడిచిపోతాయి. ఇద్దరూ మళ్ళీ కలుసుకుని ఈ సారి నిజమైన పేర్లతో దగ్గరవుతారు. వేద్ తన ప్రేమను తారకు తెలియచేసి పెళ్లి చేసుకుందామని అడిగే లోపుగా తార ఆమె వెతుకుతున్న వేద్ వేరని యాంత్రిక జీవితం గడుపుతున్న అతను వేరని రిజెక్ట్ చేయటంతో ప్రేమ కథలో ఆసక్తికర మలుపు పడుతుంది.

    తార రిజెక్ట్ చేయటంతో వేద్ ఏం చేసాడు? ఆ తరువాత ఇద్దరూ తమ తమ దారుల్లో వెళ్ళిపోయారా..వారి ప్రేమను ఒక్కటిగా చేసుకున్నారా అనేది మిగిలిన కథ.

    Hindi movie Tamasha review

    చెప్పుకోదగినవి :

    ఒక చిత్రమైన నేపథ్యానికి మరికొంచెం చిత్రమైన సమస్యను జోడించి దర్శకుడు ఇంతియాజ్ అలీ న్యూ ఏజ్ లవ్‌స్టోరీ ని తమాషాగా అందించాడు. సాధరణంగా సినిమాలన్నీ నడిచే లీనియర్ పద్ధతిలో కాక నాన్-లీనియర్ కథనాన్ని ఎంచుకున్నాడు. ఇక హీరో, హీరోయిన్ పాత్రల్లో రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనేలు బోలెడంత మానసిక సంఘర్షణను, తెరపై పండించటంలో నూటికి నూరు పాళ్ళు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా మనసు చంపుకొని, యాంత్రికంగా ఉద్యోగం చేసే వేద్ పాత్రలో రణ్‌బీర్ అదరగొట్టాడు. అలాగే అసలెవరో తెలీని వ్యక్తిని ఇష్టపడి, ప్రేమించి ఆమె కోరుకున్నది కనిపించకపోతే నలిగిపోయే ప్రేమికురాలిగా దీపిక యాక్షన్ సూపర్. ఈ నిజజీవిత మాజీ లవర్స్ మధ్య లెక్కలు, రసాయనాలు, ఫిజిక్స్ అన్నీ కలగలసి వెండితెరపై తమాషా ప్రేమకథను వెలిగించాయి. రవివర్మన్ కెమెరాలో బంధించిన సిమ్లా మొదలు ఫ్రాన్స్ మీదుగా కలకత్తా, ఢిల్లీ దాకా అన్నీ కలర్ ఫుల్ గా కనిపిస్తాయి. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం, నేపధ్య సంగీతం సినిమాకు ఊపు తెప్పిస్తాయి.

    ఫలితం:

    గతంలో ‘జబ్ ఉయ్ మెట్', ‘లవ్ ఆజ్ కల్'తో అభినందనలు అందుకున్న ఇంతియాజ్ అలీ కధనంలో కొంత తడబడ్డారనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో విశ్రాంతి వరకూ కథ సరదాగా అనిపించినా రెండవ భాగానికి వచ్చేసరికి ఒక దశలో పాత తరహా ముగింపు వైపే సినిమా వెళ్తుందా అనిపించేలా చేసి రెగ్యులర్ గానే ముగుస్తుంది. అన్నీ ఉన్నా ఎక్కడో ఏదో మిస్సవుతుందన్న ఫీలింగ్ కలిగించినా నాయికానాయికల మధ్య కెమిస్ట్రీ సినిమాను గుర్తిండిపోయేలా చేస్తుంది.

    English summary
    Hindi movie Tamasha review
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X