For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హిప్పి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |
  Hippi Movie Review And Rating || హిప్పి మూవీ రివ్యూ అండ్ రేటింగ్ || Filmibeat Telugu

  Rating:
  3.0/5
  Star Cast: కార్తీకేయ, దిగంగన సూర్య వంశీ, శ్రద్దా దాస్, జెస్బా, జేడీ చక్రవర్తి
  Director: టీఎన్ కృష్ణ

  RX100 సినిమా ఓవర్ నైట్ స్టార్‌గా మారిన హీరో కార్తీకేయ తాజా చిత్రం హిప్పి. గతంలో సూర్య, భూమికతో 'నువ్వు, నేను, ప్రేమ' సినిమాకు దర్శకత్వం వహించిన టీఎన్ కృష్ణ ఈ చిత్రానికి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మించారు. దిగంగన సూర్యవన్షీ, శ్రద్దాదాస్, జెస్బా, జేడీ చక్రవర్తి తదితరులు నటించారు. RX 100 ఫేం ఆర్డీ రాజశేఖర్ సంగీత దర్శకుడిగా, ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా పనిచేశారు. ఈ సినిమా జూన్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కార్తీకేయకు మరో హిట్ ఇచ్చిందా? దిగంగన సూర్య వంశీ ఫెర్ఫార్మెన్స్, అంద చందాలు ఆకట్టుకోన్నాయా? టీఎన్ కృష్ణకు ఎలాంటి ఫలితాన్ని అందించింది అనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

   హిప్పి మూవీ కథ

  హిప్పి మూవీ కథ

  దేవదాస్ అలియాస్ హిప్పి (కార్తీకేయ) జాలీగా లైఫ్‌ను ఎంజాయ్ చేసే యువకుడు. బీటెక్ తర్వాత ఖాళీగా ఉన్నానని స్నేహా (జెస్బా) ప్రపోజ్ చేస్తే అంగీకరించి ముద్దు మురిపాలు సాగిస్తూ కాలంతోపాటు ముందుకెళ్తుంటాడు. స్పూర్తితో ఎంజాయ్ చేస్తూనే ఆముక్త మాల్యద ( దిగంగన సూర్యవంశీ)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆముక్త మాల్యద పొసెసివ్‌నెస్ కారణంగా జీవితంలో స్వేచ్ఛ కరువుతుంది. వారిద్దరి మధ్య చిన్న గొడవలు, అభిప్రాయ బేధాలు తెలుత్తాయి. దాంతో తాను ఇష్టంగా ప్రేమించిన ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు.

  హిప్పి మూవీలో ట్విస్టులు

  హిప్పి మూవీలో ట్విస్టులు

  దేవదాస్, ఆముక్త మాల్యద మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరుకొన్నాయి? ఈ కథలో జేడీ చక్రవర్తి పాత్రమిటీ? దేవదాస్ ప్రేమ విఫలమైన సమయంలో జేడీ ఎలాంటి సహాయం అందించాడు. మొదటి గర్ల్‌ఫ్రెండ్ జెస్బాతో ఎందుకు బ్రేకప్ చేసుకొన్నాడు. ఈ కథలో స్ఫూర్తి (శ్రద్దాదాస్) ప్రాముఖ్యత ఏమిటి? నేటితరం యువతీ, యువకుల మధ్య ఉండే ప్యాచప్, బ్రేకప్ వ్యవహారాలు ఏ మేరకు ఆకట్టుకొన్నాయి? RX 100 తర్వాత కార్తీకేయ మళ్లీ రొమాన్స్‌లో విజృంభించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే హిప్పి సినిమా.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  ఫస్టాఫ్ అనాలిసిస్

  ప్రియురాలి వేధింపులు తట్టుకోలేక దేవదాస్ అలియాస్ హిప్పి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడంతో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత అందుకు కారణమైన అంశాలను వివరించడానికి కథ ఫ్యాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. జెస్బా, దేవదాస్ మధ్య రొమాన్స్‌ తెర మీద హాట్ హాట్‌గా సాగిపోతుంది. అమూల్య లవ్‌లో పడటంతో కథ మరింత హాట్‌గా మారుతుంది. దేవకు బాస్‌గా జేడీ ఎంట్రీ, వెన్నెల కిషోర్ ప్రవేశంతో కథ హ్యుమరస్‌గా మారుతుంది. తొలి భాగం కొంత సాగదీసినట్టు అనిపించినా.. అధిక భాగం వినోదం, రొమాన్స్‌కు పెద్ద పీట వేశారు. ప్రియురాలి వేధింపుల తట్టుకోలేని పరిస్థితుల్లో ఓ ఎమోషనల్ పాయింట్‌తో సినిమా ఫస్టాఫ్ ముగుస్తుంది.

  సెకండాఫ్ అనాలిసిస్

  సెకండాఫ్ అనాలిసిస్

  సెకండాఫ్‌లో పాత్ర మధ్య ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. యూత్‌ను టార్గెట్ చేసుకొని మసాలలు దట్టించడంతో కథను హుషారుగా మరింత ముందుకు సాగుతుంది. పలు రకాల షేడ్స్‌, గెటప్‌లలో ప్రేక్షకుడిని ఆకట్టుకొనే విధంగా దేవదాస్ పాత్ర క్రేజీగా ఉంటుంది. సెకండాఫ్‌లో వచ్చే రెండు ఫీల్‌గుడ్ సాంగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక క్లైమాక్స్‌లో జేడీ ఎంగేజ్‌మెంట్ విషయంలో ప్రేక్షకుడు థ్రిల్ అయ్యేలా ఓ ట్విస్ట్ తెరపైకి రావడం కథ కొత్త మలుపు తిరుగుతుంది. చివర్లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే భావోద్వేగమైన సన్నివేశాలు సెకండాఫ్‌ను మరోస్థాయికి చేర్చేలా ఉంటుంది. ఈ సినిమా మొత్తం యూత్‌ను టార్గెట్ చేస్తూ డ్రైవ్ కావడం కొంత ప్రతికూలతగా అనిపిస్తుంది.

  దర్శకుడి ప్రతిభ గురించి

  దర్శకుడి ప్రతిభ గురించి

  నువ్వు నేను ప్రేమ లాంటి ఎమోషనల్ లవ్ స్టోరిని అందించి టీఎన్ కృష్ణ నేటితరం పోకడలను దృష్టిలో పెట్టుకొని యువత‌కు కనెక్ట్ అయ్యేలా స్క్రిప్టును రాసుకొన్న తీరు బాగుంది. సన్నివేశాలను క్లాస్ అండ్ రొమాన్స్ టచ్‌తో స్క్రిన్‌పైన ఎలివేట్ చేసిన విధానం ట్రెండీగా ఉంది. సోషల్ మీడియా జనరేషన్‌కు కావాల్సిన మసాలలు దట్టించి రాసుకొన్న స్క్రిన్ ప్లేలో అక్కడక్కడ కొంత తడబాటు కనిపించినా.. మొత్తంగా ప్రేక్షకుడిని కన్విన్స్ చేసే, తృప్తి పరచడంలో సఫలమయ్యాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఎమోషన్‌ను నింపిన తీరుతో ఆయన ప్రతిభ ఏంటో బయటపడింది. యూత్‌పుల్, రొమాంటిక్, ఎంటర్‌టైనర్‌ను అందించడంలో టీఎన్ కృష్ణ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

  కార్తీకేయ వన్ మ్యాన్ షో

  కార్తీకేయ వన్ మ్యాన్ షో

  RX 100 తర్వాత ఎలాంటి కథను ఎంపిక చేసుకొంటాడనే ప్రశ్నకు దేవదాస్ క్యారెక్టర్‌ను సెలెక్ట్ చేసుకొన్న తీరుతో తన సినిమాలపై క్లారిటీ చెప్పకనే చెప్పాడు. కేవలం రొమాంటిక్ గానే కాదు.. యాక్షన్, ఎమోషనల్, ఎంటర్‌టైన్ చేసే ప్రతీ అంశంలో సత్తా ఉందనే విషయాన్ని దేవదాస్ క్యారెక్టర్ చెప్పాడు. సిక్స్ ప్యాక్ బాడీతో ఫైట్స్, పాటల్లో డ్యాన్స్ మూమెంట్స్‌తో ఇరుగదీశాడు. ఎమోషనల్ సీన్లోను, డైలాగ్ డెలివరీలోనూ తన స్టామినాను రుచి చూపించాడు. ఒక సినిమాను పూర్తిగా తన భుజాలపై మోసి మెప్పించ గలననే సత్తాను హిప్పీ ద్వారా ప్రూవ్ చేశాడు. సక్సెస్, ఫెయిల్యూర్‌ను పక్కన పెడితే.. నటుడిగా, స్టార్‌గా మరింత పరిణతిని చూపించాడు. యంగ్ హీరో రేసులో తాను ఉన్నాననే కార్తీకేయ మరోసారి సంకేతాలు పంపాడని చెప్పవచ్చు.

  దిగంగన సూర్యవంశీ అంద చందాలు

  దిగంగన సూర్యవంశీ అంద చందాలు

  దిగంగన సూర్య వంశీ కేవలం అందంతోనే కాదు అభినయంతోను ఆకట్టుకొన్నది. క్లాస్, మాస్, గ్లామర్ షేడ్స్‌ను ఆముక్త మాల్యద పాత్రతో చూపించింది. వెస్ట్రన్ లుక్‌లో ఎంత క్రేజీగా కనిపించిందో.. సంప్రదాయమైన రూపంలో కూడా అంతే ఆకట్టుకొన్నది. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్‌ను బాగా పలికించింది. నటనపరంగా చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకొంటే మంచి నటిగా టాలీవుడ్‌లో స్థిరపడటానికి అవకాశం ఉంది.

  జేడీ చక్రవర్తి సరికొత్తగా

  జేడీ చక్రవర్తి సరికొత్తగా

  ఓ కంపెనీ వైస్ చైర్మన్‌గా జేడీ చక్రవర్తి కనిపించాడు. ప్రేమలో విఫలమై.. యూత్‌కు లవ్ గురు లాంటి క్యారెక్టర్‌లో నటించాడు. ఈ సినిమాకు జేడీ స్పెషల్ ఎట్రాక్షన్. చివర్లో సున్నితమైన ఎమోషన్స్‌ను పలికించి ప్రేక్షకుల అటెన్షన్‌ను తనపైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు. తెలంగాణ యాస, హైదరాబాదీ స్లాంగ్‌లో చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. ఇప్పటి వరకు చూసిన జేడీని కాకుండా కొత్త తరహా నటుడిని హిప్పి పరిచయం చేసింది. జేడీ మెచ్యుర్డ్ ఫెర్ఫార్మెన్ అందర్ని ఆకట్టుకొంటుందని గట్టిగానే చెప్పవచ్చు.

   జెస్బా, శ్రద్దాదాస్ యాక్టింగ్

  జెస్బా, శ్రద్దాదాస్ యాక్టింగ్

  హిప్పి సినిమాలో గ్లామర్ డోస్ నింపిన ముద్దుగమ్మల్లో జెస్బా, శ్రద్దాదాస్ ఉన్నారు. జెస్బా హాట్ హాట్‌గా అందాలను ఆరబోసింది. ఫస్టాఫ్‌లో యూత్‌కు గిలిగింతలు పెట్టేలా గ్లామర్‌ను పంచింది. ఇక శ్రద్దాదాస్ చాలా రోజుల తర్వాత క్లాస్ టచ్‌తో తెరపైన మెరిసింది. అతిథి పాత్ర అయినప్పటికీ.. ఎంగేజ్ మెంట్ సాంగ్‌లో ఫాస్ట్ బీట్ వేసిన స్టెప్పులు జోష్ పుట్టించాయి.

  మిగితా క్యారెక్టర్లలో

  మిగితా క్యారెక్టర్లలో

  హిప్పిలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటించారు. కార్తీకేయకు బావగా బ్రహ్మాజీ కనిపించారు. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌తో వేసిన పంచ్ డైలాగులు అక్కడక్కడా బ్రహ్మండంగా పేలాయి. వెన్నెల కిషోర్ ఎప్పటిలానే తనదైన శైలిలో హ్యాస్యాన్ని పండించారు. తన మార్కుతో హాస్యాన్ని సినిమాలో వదిలారని చెప్పవచ్చు.

  మ్యూజిక్ డిపార్ట్‌మెంట్

  మ్యూజిక్ డిపార్ట్‌మెంట్

  సాంకేతిక విభాగాల్లో ఎక్కువ మార్కులు కొట్టేసింది మ్యూజిక్ డిపార్ట్‌మెంట్. హిప్పీ సినిమా నేటితరం యువతీ, యువకుల కథ. అందుకు తగినట్టుగానే మ్యూజిక్‌ను నివాస్ కే ప్రసన్న అందించారు. ముఖ్యంగా అనంత శ్రీరాం రాసిన సాహిత్యం పాటలను బాగా ఎలివేట్ చేశాయి. శ్రీమణి అందించిన ఓ పాట కూడా బాగుంది. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ప్లస్ పాయింట్. అనంత శ్రీరాం రాసిన ఎవతివే పాటను కార్తీక్ అద్భుతంగా ఆలపించారు. వైరల్ మాస్ బీట్స్ సాగిపోయింది. పొడిపోయానే పాట ఆడియోపరంగానే కాకుండా తెరపైన బాగుంది. నీ నా అదరాలలో పాట మెలోడిస్ ఆకట్టుకొన్నది.

   ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫి

  ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫి

  హిప్పి సినిమాకు మరో హైలెట్ ఆర్డీ రాజశేఖర్. గోవా, ఇతర ప్రాంతాల్లోని అందాలను కెమెరాలో బంధించిన తీరు సూపర్బ్. లైటింగ్‌ను, కలర్ ప్యాలెట్‌ను వాడుకొన్న తీరు సినిమాను మరింత అందంగా మార్చింది. తెరపైన ఫాలో అయిన కలర్ ప్యాటర్స్ సన్నివేశాలతో ఎట్రాక్టివ్‌గా మారింది. ఎడిటింగ్‌కు మరింత స్కోప్ ఉంది. ప్రవీణ్ మరిన్ని కత్తెర్లు వేయడానికి స్కోప్ ఉంది. ఫస్టాఫ్‌లో నిడివి తగ్గిస్తే సినిమా మరింత క్రిస్పీగా మారడానికి అవకాశం ఉంది. కలైపులి ఎస్ థాన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం. ఆయన పాటించే నిర్మాణ ఉన్నత విలువలు హిప్పిలోను కనిపిస్తాయి.

   ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  హిప్పి మూవీ పక్కా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్. తొలిభాగంలో కొంత నింపాదిగా సాగినప్పటికీ.. సెకండాఫ్‌లో ఎమోషన్స్, రొమాన్స్, హ్యూమర్ లాంటి అంశాలు సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చాయి. కార్తీకేయ, దిగంగన కెమిస్ట్రీ స్పెషల్ ఎట్రాక్షన్. జేడీ, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ నటన ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్

  • కార్తీకేయ ఫెర్ఫార్మెన్స్
  • జేడీ చక్రవర్తి
  • దిగంగన గ్లామర్
  • కథ
  • టీఎన్ కృష్ణ డైరెక్షన్
  • మైనస్ పాయింట్స్

   • ఫస్టాఫ్‌లో కథనం
   • నిడివి
   • తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: కార్తీకేయ, దిగంగన సూర్య వంశీ, శ్రద్దా దాస్, జెస్బా, జేడీ చక్రవర్తి, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు
    దర్శకత్వం: టీఎన్ కృష్ణ
    నిర్మాత: కలైపులి ఎస్ థాను
    సినిమాటోగ్రఫి: ఆర్డీ రాజశేఖర్
    సంగీతం: నివాస్ కే ప్రసన్న
    ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్
    బ్యానర్: వీ క్రియేషన్
    నిడివి: 143 నిమిషాలు
    రిలీజ్: 2019-06-06

  English summary
  RX100 fame Karthikeya's latest movie is Hippi. TN chandra Shekar is the director. Kalaipuli S Thanu is the producer. Digangana Suryavanshi, JD Chakravarthy potraying key roles. This movie set to release on June 6th. In this occasion, Telugu filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X