HIT 3 Movie Review: హిట్ 3 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: నాని, శ్రీనిధి శెట్టి, సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్, మాగంటి శ్రీనాథ్, కోమలి ప్రసాద్ తదితరులు
రచన, దర్శకత్వం: శైలేష్ కొలను
నిర్మాత: ప్రశాంతి త్రిపిర్నేని
సినిమాటోగ్రఫి: సాను జాన్ వర్గీస్
మ్యూజిక్: మిక్కి జే మేయర్
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2025-05-01

అర్జున్ సర్కార్ (నాని) స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. కానీ కిరాతకంగా మర్డర్స్ చేసి వాటిని వీడియోలు తీస్తుంటాడు. అలాంటి ఆఫీసర్ ప్రవర్తనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, అతడి పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. అయితే పోలీసులు, ప్రజల ఎరేమీ అనుకొన్నా తన దారిలో తాను ముందుకెళ్తుంటాడు. ఇలాంటి హిస్టరీ ఉన్న ఆఫీసర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ ఆపరేషన్ కోసం సిద్దమవుతాడు.

Hit 3 Movie Review in Telugu  Nani one Man Show

నిబద్దత, అంకితభావం ఉన్న అర్జున్ సర్కార్ ఎందుకు మర్డర్స్ చేస్తుంటాడు? కశ్మీర్‌లో ఎలాంటి ఆపరేషన్స్ చేశాడు? సీటీకే అనే డార్క్ వెబ్‌ టార్గెట్ ఏంటి? సీటీకేలో అర్జున్ సర్కార్ ఎందుకు చేరాలనుకొంటాడు? సీటీకే అర్జున్ సర్కార్ చేరిన తర్వాత ఏం జరిగింది? డార్క్ వెబ్‌లో భాగమైన అర్జున్ సర్కార్‌ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు. మృదులతో ఎలా ప్రేమలో పడ్డాడు? అసలు మృదుల బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే హిట్3 సినిమా కథ.

క్రైమ్, ఇన్వెస్టిగేషన్ పాయింట్స్ ఆధారంగా ఎమోషన్స్, హీరోయిజం, యాక్షన్, థ్రిల్లర్ అంశాలను జోడించి దర్శకుడు శైలేష్ కొలను రాసుకొన్న కథ రొటీన్, రెగ్యులర్‌గానే ఉంటుంది. కానీ స్టోరీకి ఇచ్చిన ట్రీట్‌మెంట్, క్రైమ్ ఎలిమెంట్స్ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఉంటాయి. ఫస్టాఫ్‌లో ఫాదర్, సన్ సీన్లుగానీ, శ్రీనిధి శెట్టితో ఉండే లవ్ ట్రాక్ సినిమాకు కొంత రిలీఫ్‌గా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌ను ఇంట్రెస్టింగ్‌గా రాసుకొన్న డైరెక్టర్ శైలేష్.. అదే రేంజ్‌లో సెకండాఫ్‌ను కొనసాగించలేకపోయాడనిపిస్తుంది. సెకండాఫ్‌లో మితి మీరిన హింస, ఫైట్స్ రెగ్యులర్ ఆడియెన్స్‌కు చాలా ఇబ్బందిగా, డిస్ట్రబ్‌గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమాలోని అంశాలను చూస్తే.. జాన్ విక్ లాంటి సినిమాల ప్రభావం ఎక్కువగా పడిందనే విషయం స్పష్టంగా కనబడుతుంది. అయితే ఓవర్ వయోలెన్స్ చుట్టూ సాగే కథలో నానీ క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన విధానం యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా కథలో నాని పాత్రను సెట్ చేసిన విధానమే దర్శకుడిగా శైలేష్ సక్సెస్ కారణమనిస్తుంది.

క్లాస్ కాదు.. నాలోని కొత్త కోణం చూడాలనుకొనే వారికి అర్జున్ సర్కార్ ఓ ట్రీట్ అనే విధంగా నాని ఆ పాత్రలో నటించాడు. తాను క్లాస్ అనుకొని పొరపాటుపడ్డారు. ఇక ముందు తాను మాస్ హీరో అని చూడటానికి రెడీగా ఉండాలంటూ సంకేతాలిచ్చాడు. అర్జున్ సర్కార్ పాత్రలో నిజంగా ఓ డిఫరెంట్ నానిని చూసే అవకాశం కలిగింది. ఏ నటుడికైనా ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోవడం చాలా కష్టంగా ఉంటుంది. కెరీర్ మధ్యలో అలాంటి ఇమేజ్ దూరంగా నాని చేస్తున్న పాత్రలు విభిన్నంగా, విలక్షణంగగా ఉంటున్నాయి. కానీ అర్జున్ సర్కార్ లాంటి పాత్రల వల్ల ఓ సెక్షన్ ఆడియెన్స్ దూరంగా ఉండే ప్రమాదాన్ని నాని గ్రహించాలి. ఇక అర్జున్ సర్కార్‌గా యూత్‌ను విశేషంగా ఆకట్టుకొంటాడు. యాక్షన్, రొమాంటిక్ సీన్లలో నాని బాడీ లాంగ్వేజ్ బాగుంది.

ఇక శ్రీనిధి శెట్టి ఉన్నంతలో కనిపించనంత సేపు స్క్రీన్ మీద చూపు తిప్పుకోకుండా చేసింది. గ్లామర్‌గానే కాకుండా సర్‌ప్రైజ్ కలిగించే సన్నివేశాల్లో ఆడియెన్స్‌కు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. కోమలి ప్రసాద్, రావు రమేష్, ఇతర పాత్రల్లో నటించిన వారంతా గుర్తుండిపోతారు. ఇక ఈ సినిమాలో అతిథఇ పాత్రలు ఫ్యాన్స్‌కు మరింత ఆనందాన్ని పంచుతాయి.

టెక్నికల్ విషయాలకు వస్తే.. ఈ సినిమాకు సాన్ జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి, మిక్కి జే మేయర్ బీజీఎం, రెండు పాటలు హైలెట్. కశ్మీర్, రాజస్థాన్‌లో చిత్రీకరించిన ఛేజింగ్ సీన్లు బాగున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్‌లో కొన్ని సన్నివేశాలకు ఉపయోగించిన లైటింగ్‌తో విజువల్స్ వండర్‌పుల్‌గా అనిపిస్తాయి. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ పనితనం బాగుంది. కానీ సెకండాఫ్‌లో ఇంకా కొన్ని కత్తెర్లు పడి ఉంటే.. సినిమా మరింతగా ఫీల్ గుడ్‌గా మారే అవకాశం ఉండేది. వాల్ పోస్టర్, యునాన్మిమస్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. హిట్ ఫ్రాంచైజీలో మిగితా రెండింటితో పోల్చుకొంటే.. హిట్ 3 ప్రొడక్షన్ వైజ్‌గా గ్రాండ్‌గా ఉంది.

హిట్ 3 సినిమా గురించి ఓవరాల్‌గా చెప్పాలంటే.. మితిమీరిన హింసతో కూడిన రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్. చైల్డ్ ఎమోషన్స్‌తో సాగే మర్డర్స్ మిస్టరీ. అయితే నానికి తన కెరీర్‌లో డిఫరెంట్ మూవీ చెప్పవచ్చు.జాన్ విక్, మార్కో లాంటి యాక్షన్,క్రైమ్ థ్రిల్లర్ చూసిన వారికి అంతగా కిక్ ఉండదు. కానీ తెలుగు ఆడియెన్స్‌కు డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్.ఫస్టాఫ్ బెటర్‌గా తీర్చిదిద్దిన శైలేష్ సెకండాఫ్‌ను పూర్తి స్థాయిలో రాసుకోలేకపోయాడు. అతిథి పాత్రల వల్ల ఆ లోపం మరుగున పడిపోయింది. ఓవరాల్‌గా యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. చిన్న పిల్లలు, ఫ్యామిలీ ఆడియెన్స్ కాస్త దూరంగా ఉంటే బెటర్.

More from Filmibeat

Read more about: hit 3 nani srinidhi shetty
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X