HIT 3 First Review: హిట్ 3 సినిమా ఫస్ట్ రివ్యూ
నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం హిట్ 2. హిట్ సిరీస్‌లో భాగంగా వస్తున్న మూడో ఫ్రాంచైజీ చిత్రానికి డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా నిర్మించారు. మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తుండగా, సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి, కార్తీక్ శ్రీనివాస్ ఆర్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎస్ వెంకటరత్నం వ్యవహరించారు. ఈ సినిమా సెన్సార్ అధికారుల అభ్యంతరాలు, సినిమా కంటెంట్ గురించిన వివరాల్లోకి వెళితే..
హిట్ 3 మూవీ విషయానికి వస్తే.. ఇటీవల రిలీజైన టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఇంతకు ముందెన్నడూ కనిపించని విధంగా నాని కొత్తగా కనిపించబోతున్నాడనే విషయం స్పష్టమైంది. అయితే మాస్ అవతారంతో పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా.. అవసరమైతే హింసే ఆయుధంగా రక్తంతో తడిసిపోయే పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు. కిడ్నాప్ డ్రామా, టెర్రిరిస్టుల బ్యాక్ డ్రాప్‌తో క్రైమ్, యాక్షన్‌తో రొమాంటిక్ కంటెంట్‌ను జోడించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు సిద్దమయ్యారనేది స్పష్టమైంది.

అయితే ట్రైలర్ చూసిన సగటు ప్రేక్షకుడికి కలిగిన అభ్యంతరాల మాదిరిగానే సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) అధికారులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మితిమీరిన హింస, రక్తంలో తడిసి ముద్దైన సన్నివేశాలు, కొన్ని డైలాగ్స్, కొంత హారర్ కంటెంట్‌ను తొలగించమని సూచించినట్టు తెలిసింది. దాంతో సెన్సార్ అధికారులు అభ్యర్థన మేరకు సినిమా యూనిట్ వారి సలహాలను స్వీకరించి కొన్ని సన్నివేశాలపై కత్తెర వేయడం.. కొన్ని డైలాగ్స్‌కు బీప్స్ వేశారని ఇన్‌సైడ్ టాక్.
హిట్ 3 సినిమాను చూసేందుకు 18 లోపు వారికి అనుమతి లేకుండా సెన్సార్ విధించారు. ఈ సినిమాను పూర్తిస్థాయిలో అడల్డ్ రేటింగ్ సినిమాగా నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి A రేటింగ్‌ను ఇస్తూ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు శైలేష్ కొలను కూడా పలు సందర్భాల్లో 18 ఏళ్లు పైబడిన వారే ఈ సినిమాను చూడాలని వెల్లడించారు. ఇక ఈ సినిమా నిడివిని 157 నిమిషాలు అంటే.. 2 గంటల 37ఫ నిమిషాలుగా ఫిక్స్ చేశారు.
అర్జున్ సర్కార్‌గా నాని సరికొత్తగా కనిపించబోతున్నాడు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్, ఆ పాత్ర ద్వారా చెప్పించిన డైలాగ్స్, ఆ క్యారెక్టర్ అనసరించిన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ సినిమాకు హైలెట్ అనే విషయం బయటకు వచ్చింది. మాస్ ఎలివేషన్స్, మితి మీరిన యాక్షన్ సీన్ల మధ్య శ్రీనిధి శెట్టితో రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. తెరపైన రక్తం చిందించే సీన్ల మధ్య లవ్ ట్రాక్ ఫ్రెష్‌గా ఉంటుంది అని చెబుతున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంది. అది వర్కవుట్ అయితే సినిమాకు మరో హైలెట్ అవుతుంది అని పేర్కొంటున్నారు.
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు చివరి 30 నిమిషాలు. క్లైమాక్స్ ఎపిసోడ్ బలంగా ఉంటుంది. బీజీఎం, పాటలు కూడా బాగున్నాయి. ఫస్టాఫ్ కథను, పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు శైలేష్ కొలను కొంత టైమ్ ఎక్కువగానే తీసుకొన్నాడు. సెకండాఫ్‌లో సన్నివేశాలను బాగా డిజైన్ చేశారు. ముఖ్యంగా ఫైట్స్ చిత్రీకరించిన తీరు కొత్తగా ఉంటాయి అని చెబుతున్నారు. ఈ సినిమా మే 1వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా గురించి ఇచ్చే ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్ తెలుగును ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











