HIT 3 Twitter Review: హిట్ 3 మూవీ ట్విట్టర్ రివ్యూ.. నాని బీస్ట్ మోడ్ ఎలా ఉందంటే?

నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం హిట్ 2. హిట్ సిరీస్‌లో భాగంగా వస్తున్న మూడో ఫ్రాంచైజీ చిత్రానికి డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా నిర్మించారు.

మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తుండగా, సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి, కార్తీక్ శ్రీనివాస్ ఆర్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎస్ వెంకటరత్నం వ్యవహరించారు. ఈ సినిమా ప్రీమియర్లు అమెరికా, కెనడాలో మొదలయ్యాయి. యూఎస్‌ ప్రీమియర్ల తర్వాత నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూల వివరాల్లోకి వెళితే..

HIT 3 Telugu Movie Twitter Review

హిట్ 3 సినిమా చూశాను. ఫస్టాఫ్‌లో ఇన్వెస్టిగేషన్‌పై ఫోకస్ చేసి.. సెకండాఫ్‌లో చాలా ఎట్రాక్షన్స్‌తో నింపాడు. చాలా కేమియోలు ఆడియెన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తాయి. నాని తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. కేవలం నాని కోసమే ఈ సినిమాను చూడాలి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

హిట్ 3 ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు మితిమీరిన హింస ఉంది. కిల్ బిల్ మూవీలో మాదిరిగా యాక్షన్ సీన్లు డిజైన్ చేశారు. ఈ సినిమా వయోలెన్స్‌తో కూడి కల్ట్. సినిమాటోగ్రఫి బాగుంది. యాక్షన్ సీన్లు బ్రిల్లియెంట్‌గా ఉన్నాయి. తెలుగు సినిమాలో ఇప్పటి వరకు ఎవరూ అటెంప్ట్ చేయని విధంగా శైలేష్ కొలను యాక్షన్ సీన్లను చిత్రీకరించాడు. నాని పెర్ఫార్మెన్స్, యాక్టింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఈ సినిమా చూసిన తర్వాత నాని తప్పా ఇంకా ఏమీ గుర్తుకు రాదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

హిట్ 3 సినిమా మితిమీరిన హింసతో కూడిన రొటీన్, రెగ్యులర్ సినిమా. బోల్డ్ డైలాగ్స్ కూడా ఎక్కువే. కథ చాలా స్లోగా సాగుతుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ వద్ద స్టోరీ ఊపందుకొంటుంది. నాని పెర్ఫార్మెన్స్, క్యారెక్టరైజేషన్, వన్ లైన్ డైలాగ్స్ మూవీని నిలబెట్టిందని చెప్పవచ్చు. ఫస్టాఫ్ యావరేజ్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

సినిమా యావరేజ్. ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్లకండి. చివరి 30 నిమిషాలు సినిమా బాగుంటుంది. అక్కడక్కడా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. ట్విస్టులు పెద్దగా ఉండవు. మొత్తంగా యాక్షన్ మాత్రమే. ఈ సినిమా హిట్ మాత్రమే అంటూ ఓ నెటిజన్ లీక్ ఇచ్చాడు.

హిట్ 4 ఫస్టాఫ్ ఎక్సలెంట్‌గా ఉంది. క్రైమ్ థిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. నాని పెర్ఫార్మెన్స్ సూపర్బ్. ఆయన వాడిన వన్ లైనర్ బూతులు చాలా కష్టంగా ఉంది. సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి. ఫస్టాఫ్ కంటే బెటర్‌గా ఉంటుందేమో అనిపిస్తుంది అని ఓ నెటిజన్ అన్నాడు.


హిట్ 3 మూవీ రా, రస్టిక్. చాలా మంది హీరోల కేమియోలు ఈ సినిమాలో సర్‌ప్రైజ్‌లు కనిపిస్తాయి. ఎమోషన్‌తో కూడిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ. హిట్ 3 సినిమాతో శైలేష్ కొలను కమ్ బ్యాక్ చేసినట్టే. నానిపై రెస్పెక్ట్ బాగా పెరిగింది. ఈ సినిమా 200 కోట్లు వసూలు చేయడం గ్యారెంటీ. హిట్ సినిమా క్రేజీగా మాస్ యాక్షన్ ప్యాక్డ్ హిట్ బొమ్మ. వర్త్ వర్మ వర్త్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


హిట్ 3 సినిమా చూశాను. నాని తన క్యారెక్టర్‌‌తో సినిమాకు ఫ్రెష్‌నెస్ తెచ్చాడు. ఆయన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. డైరెక్టర్ శైలేష్ కొలను డీటేయిలింగ్, ప్రేమింగ్ ఫెంటాస్టిక్‌గా ఉంది. యాక్షన్ సీన్లు స్టన్నింగ్‌గా ఉంది. మిక్కి జే మేయర్ బీజీయం ఎక్సలెంట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

నానితో దసరా సినిమా ద్వారా దర్శకుడిగా మాిరన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాపై ఆసక్తిని ప్రదర్శించాడు. నాని అన్నా.. నీవు హిట్ మిషన్‌వి. నీ బీస్ట్ అవతారాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నాను. దర్శకుడు శైలేష్ కొలను, టీమ్ మెంబర్స్‌కు నా నుంచి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనేది నాకు ముందే తెలుసు అని శ్రీకాంత్ ఓదెల ట్వీట్ చేశారు.

రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న హీరో సూర్య తనతో పోటీ పడుతున్న నానికి శుభాకాంక్షలు అందజేశారు. అలాగే రైడ్ 2 సినిమాతో వస్తున్న అజయ్ దేవగన్ సినిమా కూడా హిట్ కావాలని కోరుకొన్నాడు. ఈ మూడు సినిమాలు కూడా మంచి వినోదాన్ని పంచి సక్సెస్ కావాలని కోరుకొంటున్నాను అని సూర్య తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

నేచురల్ స్టార్ నానికి మెగా హీరో సాయిధరమ్ తేజ్ శుభాకాంక్షలు తెలిపారు. నాని బ్రో.. నీ బీస్ట్ అవతారాన్ని చూడటానికి కాచుకొని ఉన్నాను. అర్జున్ సర్కార్‌ పాత్రతో హిట్ 3 బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నావు. ఈ ఫ్రాంచైజీ సక్సెస్ బాటలో కొనసాగిపోతుంది. చిత్ర యూనిట్‌కు ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికి నా అభినందనలు అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

Read more about: hit 3 nani srinidhi shetty
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X