twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘HIT’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.5/5

    Recommended Video

    Hit Movie Review || హిట్ మూవీ రివ్యూ | Filmibeat Telugu

    నాని నిర్మాతగా, విశ్వక్సేన్ హీరోగా వచ్చిన చిత్రం హిట్. ఓ వైపు నటనతో బిజీగా ఉన్న నాని.. నిర్మాణంలో అడుగు పెట్టి అ! సినిమాతో మొదటి విజయాన్ని సాధించాడు. రెండో ప్రయత్నంగా విశ్వక్సేన్ వంటి యంగ్ హీరోతో 'హిట్' అంటూ మరో ప్రయోగాన్ని చేశాడు. ఫలక్‌నుమా దాస్‌తో సక్సెస్ కొట్టిన విశ్వక్సేన్‌కు, నిర్మాతగా నానికి ఈ మూవీ నేడు (ఫిబ్రవరి 28) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ హీరోగా విశ్వక్సేన్‌కు, నిర్మాతగా నానికి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో ఓ సారి చూద్దాం.

     కథ

    కథ

    గతం వెంటాడుతుండటంతో విక్రమ్ (విశ్వక్‌సేన్).. ఓ వ్యాధితో బాధపడుతుంటాడు. అతను చేస్తున్న పోలీస్ ఉద్యోగాన్ని వదిలేయాలని డాక్టర్, ప్రేయసి నేహా (రుహాని శర్మ) సలహా ఇస్తారు. కొన్ని రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో ప్రీతి (సాహితి) అనే అమ్మాయి మిస్ అవుతుంది. వెను వెంటనే నేహా కూడా మిస్ అవుతుంది.

     కథలో ట్విస్ట్‌లు..

    కథలో ట్విస్ట్‌లు..

    విక్రమ్‌ను వెంటాడే ఆ గతమేంటి? ప్రీతిని ఎవరు కిడ్నాప్ చేస్తారు? ఆపై ఎందుకు హత్య చేస్తారు? నేహా అదృశ్యం వెనుకున్నది ఎవరు? ప్రీతి-నేహాల కథ వెనుకున్నది ఎవరు? ఈ కథలో ఎస్సై ఇబ్రహీం (మురళీ శర్మ), స్వప్న (నవీనా రెడ్డి), శీలా (హరితేజ), అభిలాష్ (శ్రీనాత్ మాగంటి), రోహిత్ (చైతన్య సగిరాజు), ఫాహద్ (రవితేజ) ఎవరు? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే HIT.

    ఫస్టాప్ అనాలిసిస్..

    ఫస్టాప్ అనాలిసిస్..

    క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో ఇంటెలిజెంట్ ఆఫీసర్‌గా విక్రమ్‌ను పనితనాన్ని చూపెట్టే సీన్లతో ప్రథమార్థం మొదలవుతుంది. మధ్య మధ్యలో అతను గతాన్ని గుర్తుకుతెచ్చుకోవడం, మానసినకంగా బాధపడటం వంటి సీన్లతో కథనం ముందుకు సాగుతుంది. ఎప్పుడైతే ప్రీతి మిస్ అవుతుందో కథనంలో వేగం పుంజుకుంటున్న ఫీలింగ్ కలుగుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఎవరు చేశారో తెలీకుండా నడిపే కథనంతో సీటు అంచున కూర్చునేలా చేస్తుంది. నేహా కూడా మిస్ అవ్వడం, ఈ రెండు మిస్సింగ్ కేసులకు లింక్ ఉందని పసిగట్టిన విక్రమ్ కేసును చేధించడంతో కథనం చకచకా కదులుతుంది. ప్రీతి స్నేహితులు, అమ్మానాన్నలు, స్నేహితులు ఇలా ప్రతీ ఒక్కర్నీ అనుమానిస్తారు. అయితే ప్రథమార్థం చివర్లో ఒక క్లూ దొరికడంతో తరువాత ఏం జరుగుతుందన్న ఆసక్తితో ప్రథమార్థం ముగుస్తుంది.

    సెకండాఫ్ అనాలిసిస్..

    సెకండాఫ్ అనాలిసిస్..

    షీలా (హరితేజ) ఇంటి ముందు దొరికిన ఓ క్లూతో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడంతో ద్వితీయార్థం మొదలవుతుంది. ఇక సెకండాఫ్ కథలో అనుకోని మలుపులు తిరుగుతుండటంతో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ప్రీతి అమ్మానాన్నలు, ప్రీతి పెరిగిన అనాథాశ్రమం ఆయా సరస్వతి, ఆమె స్నేహితుుడు అజయ్ ఇలా ప్రతీ ఒక్కరిపై అనుమానం మరింత బలపడేలా చేయడంతో అసలేం జరుగుతుందా? అనే అనుమానం ప్రేక్షకుల మదిలో కలిగేలా చేయడంలో సక్సెస్ అయింది. చివరకు అసలు నేరస్తుడిని విక్రమ్ పట్టుకోవడం, క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్ ఊహకందదు. ఇలా ఎవ్వరూ ఊహించని విధంగా క్లైమాక్స్ రాసుకోవడంతో ద్వితీయార్థం కూడా గట్టెక్కినట్టు కనిపిస్తోంది.

    నటీనటులు ఫర్మామెన్స్

    నటీనటులు ఫర్మామెన్స్

    HIT చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విక్రమ్ పాత్రలో నటించిన విశ్వక్‌సేన్ గురించే. పోలీస్ పాత్రకు ఉండే యాటిట్యూడ్ మెయింటెన్ చేస్తూ.. తనదైన శైలిలో నటించాడు. ఫలక్‌నుమా దాస్ చిత్రంలోని విశ్వక్‌సేన్‌కు ఈ సినిమాలో విశ్వక్‌సేన్‌కు నటనలో ఎంతో తేడా కనిపించింది. చిలసౌ సినిమాలో నటనతో ఆకట్టుకున్న రుహానీ శర్మ.. ఈ చిత్రంలో మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో తేలిపోయింది. వీరిద్దరి తరువాత పోలీసాఫీసర్స్ పాత్రలో ఇబ్రహీం (మురళీ శర్మ), అభిలాష్ (శ్రీనాత్ మాగంటి), రోహిత్ (చైతన్య సగిరాజు)లు ఆకట్టుకున్నారు. మిగిలిన ముఖ్యమైన పాత్రలో స్వప్న (నవీనా రెడ్డి), శీలా (హరితేజ), ఫాహద్ (రవితేజ) తమ పరిధి మేరకు నటించారు.

    దర్శకుడి పనితీరు..

    దర్శకుడి పనితీరు..

    టాలీవుడ్‌లో కొత్త నీరు ప్రవహిస్తోంది. అది ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. సినిమాలను తెరకెక్కించే శైలీ మారింది. మూసధోరణిలో పోకుండా కొత్త కథలతో ప్రయోగాలు చేస్తున్నారు యువ దర్శకులు. ఆ కోవలోకి చెందినదే శైలేష్ కొలను తెరకెక్కించిన HIT చిత్రం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథ, కథనంలో అందర్నీ కట్టిపడేశాడు. ఎక్కడా కూడా అనుమానం రాకుండా.. చక్కటి స్క్రీన్‌ప్లే ఊపిరి బిగపట్టుకుని చూసేలా మలిచాడు. ఈ సినిమాతో శైలేష్ కొలను తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

    సాంకేతిక నిపుణుల పనితీరు..

    సాంకేతిక నిపుణుల పనితీరు..

    HIT చిత్రానికి సంబంధించి సాంకేతిక బృందంలో వివేక సాగర్ ముందుంటాడు. ఇలాంటి క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో ముఖ్యం. ప్రతీ సీన్‌ను తన నేపథ్య సంగీతంతో ఓ రేంజ్‌లో ఎలివేట్ చేశాడు. కెమెరామెన్ మణికంధన్.. ప్రతీ సీన్‌ అందంగా తెరకెక్కించాడు. ప్రతీ నటుడి చిన్న హావభావాన్ని కూడా మిస్ కానివ్వలేదు. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ ఎంతో చాకచక్యంగా కట్ చేశాడు. ఎక్కడా ఫ్లో మిస్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

    బలాలు, బలహీనతలు..

    బలాలు, బలహీనతలు..

    ప్లస్ పాయింట్స్

    కథ,కథనం
    బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
    సినిమాటోగ్రఫీ

    మైనస్ పాయింట్స్
    వినోదం లోపించడం
    అడ్డంకిగా మారే రొమాంటిక్ సీన్స్

    నటీనటులు

    నటీనటులు

    నటీనటులు : విశ్వక్సేన్, రుహానీ శర్మ తదితరులు
    దర్శకత్వం : శైలేష్ కొలను
    నిర్మాత : ప్రశాంతి తిరిపనేని
    బ్యానర్ : వాల్ పోస్టర్ సినిమా
    మ్యూజిక్ : వివేక్ సాగర్
    సినిమాటోగ్రఫి : మణికందన్
    ఎడిటింగ్ : గ్యారీ బీహెచ్

     ఫైనల్‌గా..

    ఫైనల్‌గా..

    నటుడిగా నాని అభిరుచి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.. అయితే నిర్మాతగానూ అదే అభిరుచిని చాటుతున్నాడు. నిర్మాతగా నానికి HIT దక్కినట్టేననిపిస్తోంది. అయితే క్రైమ్, థ్రిల్లర్ అనేవి ఒకే జానర్‌కు పరిమితమైనవి. బీ, సీ సెంటర్లలో ఇలాంటి వాటికి ఆదరణ ఏ మేరకు ఉంటుందో చెప్పలేం. కమర్షియల్‌గా ఏ రేంజ్‌కు వెళ్తుందో చూడాలి.

    English summary
    HIT is an Telugu language Crime And Thriller Drama written and directed by Shailesh Kolanu. The film stars Viswaksen And Ruhani Sharma. This movie released on February 28th 2020.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X