Hot Spot Review: హాట్ స్పాట్ రివ్యూ
Rating: 2.75/5
తారాగణం: విఘ్నేష్ కార్తీక్, 96 ఫేమ్ గౌరీ జి కిషన్, అమ్ము అభిరామి, సోఫియా, జననీ, శాండీ, కలైయరసన్
దర్శకుడు: విగ్నేష్ కార్తీక్
నిర్మాతలు: కేజె బాలమణి మర్బన్, గోకుల్ బినోయ్(తమిళ్), ఇందుకుమార్ రెడ్డి, అనిల్ రెడ్డి(తెలుగు)
ఓటీటీ ప్లాట్ ఫామ్: ఆహా
రిలీజ్ డేట్: 2024-07-24
కథ ఏమిటంటే?
సినిమాకి చెందిన ఓ ప్రముఖ నిర్మాత కేజె బాలమణి మర్బన్ ఒక సరైన సినిమా తీయాలని మంచి కథలు కోసం చాలా మంది దగ్గర వింటూ ఉంటాడు. అలా విని విని తనకే కథ కూడా నచ్చక వేసారిపోయి ఇక సమయం వేస్ట్ చెయ్యకూడదు అని ఫిక్స్ అవుతాడు. ఆ సమయంలో ఒకతను కథ చెప్పేందుకు వస్తాడు. అతడే మహమ్మద్ షఫీ(విగ్నేష్ కార్తీక్). అప్పటికే చాలా కథలు విని విసిగిపోయిన బాల కేవలం పదే నిమిషాలు ఇస్తున్నాను ఏం కథ చెప్తావో చెప్పు అని స్టార్ట్ చెయ్యమంటాడు. అప్పుడు షఫీ ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు.

ఇది ఓ యువ జంట పెళ్లి కాగా ఇందులో ఇద్దరు పెళ్లి లైఫ్ ఎలా ఉంటుంది. పెళ్లి తర్వాత అబ్బాయి అమ్మాయిలా అమ్మాయి అబ్బాయిలా మారితే ఎలా ఉంటుంది అని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పడం మొదలు పెడతాడు. అది విని బాగా ఇంప్రెస్ అయిన నిర్మాత ఇది చిన్న కథలా ఉంది సరిపోతుందా అని అడిగితే అక్కడ నుంచి మరో మూడు కథలు అందులో రెండు బోల్డ్ గా అనిపించేవి, సామాజికంగా మేలుకొల్పే లైన్స్ చెప్పడం మొదలు పెడతాడు షఫీ. మరి మూడు కథలు ఏంటి? వాటిలో ఎలాంటి వైవిధ్యత ఉంటుంది? అవి అందరూ చూడాలగలిగేవేనా? అనేవి తెలియాలి అంటే ఈ సినిమాని చూసే తెలుసుకోవాలి.
విశ్లేషణ:
సినిమాల్లో కొన్ని ఫార్మాట్ లు ఉంటాయి ఒకటే లైన్ లో కొన్ని సాగితే మరికొన్ని ఒకే సినిమాలో మూడు నాలుగు కథలు కనిపిస్తాయి. ఈ రెండో తరహా సినిమాలనే ఆంథాలజిస్ అని అంటారు. సినిమాకి తక్కువ వెబ్ సిరీస్ కి ఎక్కువగా అనిపించే ఆంథాలజీ ఫార్మాట్ లోనే ఈ సినిమా కూడా వచ్చింది. తమిళంలో మంచి టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాని అదే పేరుతో తెలుగులో కూడా తీసుకొచ్చారు. కాగా ఈ సినిమాలో కనిపించే మొత్తం ఐదు కథలు(దర్శకుడు) కథతో కలిపి కనిపిస్తాయి.
మరి అతను చెప్పిన ప్రతి కథ ప్రతి అంశం చూసేందుకు ఖచ్చితంగా ఇంపుగా కదిలించేలా కూడా ఉంటాయి. అయితే ప్రతి కథ కూడా ఒకదానికి ఒకటి చాలా వైవిధ్యంతో కనిపిస్తాయి. మొదటి కథలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకోవడం మెయిన్ గా ఒక మగవాడి సైడ్ నుంచి భార్యని లేదా ఇంట్లో ఆడవాళ్ళని అర్ధం చేసుకోవం ఎలా అనే కోణాన్ని ఆకట్టుకునేలా చూపించారు.
ఇది నరేషన్ కూడా ఎంగేజింగ్ గా సాగుతుంది. అయితే ఫస్ట్ కథలోనే మరీ బోల్డ్ గా వెళ్లకుండా తీసుకెళ్లే ప్రయత్నంలో రెండో కథ నుంచి కొంచెం గ్రే షేడ్ లోకి మారుతుంది. ఇది ఇద్దరు ప్రేమికులు తమకి తెలియకుండానే వారి వరుసలు మారిపోవడం కోణంలో కనిపిస్తుంది. ఇది ఒకింత చూసేందుకు ఎంటర్టైనింగ్ గానే అనిపిస్తుంది. కానీ ఫర్వాలేదనిపిస్తుంది.

ఇక మూడో కథ కూడా బాగానే ఉంటుంది కానీ ఇక్కడ నుంచి చూసేవి కొంచెం బ్రాడ్ మైండెడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అన్నట్టుగా ఉంటాయి. ప్రేమ, కామం రెండు పాయింట్స్ ని వేరేవేరుగా ఎలా చూస్తున్నారు. ఆ క్రమంలో ఒక అబ్బాయికి తన తల్లి విషయంలో ఎదురయ్యే కొన్ని సన్నివేశాలు ఇబ్బందికరంగా అనిపిస్తాయి. కానీ ఇందులో ట్విస్ట్ లు మాత్రం రిలీఫ్ గా ఉంటాయి అలాగే ఒకింత ఆలోచింపజేసేలా కూడా కనిపిస్తాయి. సో దీనిని తీసుకోవడం అందరి వల్ల కాకపోవచ్చు.
అలాగే ఫైనల్ కథలో కూడా కొంచెం బోల్డ్ నెస్ అది కూడా ప్రస్తుతం ఉన్న జెనరేషన్ పిల్లల విషయంలో కనిపిస్తుంది. ఇది కూడా కాస్త కఠువు గానే అనిపిస్తుంది కానీ ఎవరూ ఒప్పుకోని నిజాలనే చూపించే ప్రయత్నం దర్శకుడు చేసాడు. దీనిని మెచ్చుకొని తీరాలి. తెలిసీ తెలియని వయసులో పిల్లలు చేస్తున్న పొరపాట్లు, తల్లిదండ్రుల భాద్యతా రాహిత్యాన్ని ఈ ఆంథాలజీ ప్రశ్నిస్తుంది. ఈ క్రమంలో మూడో స్టోరీ కొంచెం సాగదీసినట్టుగా ల్యాగ్ అనిపించవచ్చు. కానీ ప్రతి స్టోరీ కూడా మనల్ని ఆలోచించేలా చేస్తుంది.
నటీనటుల పెర్ఫామెన్స్ లు ఎలా ఉన్నాయంటే?
ఈ ఆంథాలజీలో ఎక్కువ యువ నటీనటులే కనిపించారు. 96 సినిమా ఫేమ్ గౌరీ జి కిషన్ కి మంచి రోల్ దక్కగా అందులో ఆమె షైన్ అయ్యింది అలాగే అమ్ము అభిరామి, శాండీలు కూడా తన నాచురల్ పెర్ఫామెన్స్ లతో ఇంప్రెస్ చేస్తారు. తమ మధ్య ఉన్న బంధం వేరే అయినప్ప్పుడు దేనికదే సెపరేట్ ఎమోషన్స్ తో మంచి నటన అందించారని చెప్పొచ్చు.
ఇంకా జనని అయ్యర్ ఓ జర్నలిస్ట్ గా కొన్ని బోల్డ్ డైలాగ్స్ తన పార్ట్నర్స్ తో అదరగొట్టింది. అలాగే ఆమె ట్రెండీ లుక్స్ కూడా ఈ సినిమాలో బాగున్నాయి. అలాగే ఫైనల్ కథలో కనిపించిన చిన్నారి నటులు వారి తల్లిదండ్రులుగా చేసిన నటులు ఎమోషనల్ పెర్ఫామెన్స్ లతో బాగా చేశారు. మెయిన్ గా ఆ చైల్డ్ ఆర్టిస్ట్ లు అయితే ఇంత చిన్న ఏజ్ లో కూడా అంత పరిపక్వతతో నటన కనబర్చడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

టెక్నికల్ గా ఎలా ఉంది?
తమిళ్ లో మంచి హిట్ అయ్యిన సినిమాని తెలుగులో కూడా నాచురాలిటీ మిస్ కాకుండా దాదాపు మంచి డబ్బింగ్ తో తెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం ఆహా వారు చేసారని చెప్పాలి. సౌండ్ మిక్సింగ్, ఆర్టిస్ట్ లకి తగ్గట్టుగా చెప్పించిన డబ్బింగ్ లు బాగున్నాయి. అలాగే తీసింది తమిళ్ లో కాబట్టి అక్కడ నిర్మాతలు తీసుకున్న ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయని చెప్పొచ్చు.
ఒక పర్ఫెక్ట్ ఆంథాలజీ సెటప్ కి తగ్గట్టుగా మంచి సినిమాని తీసే ప్రయత్నం మెచ్చుకోవాలి. ఇంకా సంగీతం, సినిమాటోగ్రఫీలు బాగున్నాయి. అయితే ఈ ఆంథాలజీలో సింహభాగం దర్శకునికి దక్కుతుంది. విగ్నేష్ కార్తీక్ యూనిక్ గా పాయింట్ ని చెప్పే ప్రయత్నం చేసాడు. బయట ఈ సినిమాకి తానే దర్శకుడు, సినిమాలో కూడా మరో సినిమాలు తానే దర్శకుడిగా చెప్పడం బాగుంది. అలాగే తాను ప్రిపేర్ చేసుకున్న ప్రతి కథ కూడా హార్డ్ హిట్టింగ్ గా ఆలోచించేలా డిజైన్ చేసుకున్నాడు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న మిస్టేక్స్ ని బోల్డ్ గా చూపించే ప్రయత్నం చేసాడు. కానీ కొన్ని చోట్ల స్లో చేసాడు. అయినా తన ప్రయత్నానికి మాత్రం మంచి మార్కులు ఇవ్వొచ్చు.
ఫైనల్‌గా ఓ మాట..
తమిళ్ సినిమా నుంచి తెలుగులో డబ్బింగ్ అయ్యి వచ్చిన ఈ ఐదు కథల "ఆంథాలజీ" ఓటిటిలో మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ప్రధాన తారాగణం అంతా ఎవరికి వారు మంచి పెర్ఫామెన్స్ లని ఇచ్చేసారు. అయితే వారితో దర్శకుడు చెప్పాలి అనుకున్న పాయింట్ ని సూటిగా సుత్తిలేకుండా కొన్ని బాగానే నడిపించాడు. కానీ ఖచ్చితంగా కొన్ని సీన్స్ ని అందరూ యాక్సెప్ట్ చెయ్యలేరు. ప్రస్తుత సమాజంలో ఖచ్చితంగా ఉన్న కొన్ని తప్పులని ఈ ఆంథాలజీతో చూపించారు. మరి వీటిని అర్ధం చేసుకునే అంత పరిపక్వత ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది. అలా ఉండని వారిని కనీసం లోలోపల అయినా ఆలోచింపజేసేలా చేస్తుంది. సమయం దొరికితే ఖచ్చితంగా ఓటిటిలో ఈ సినిమా చూడవచ్చు, ట్రై ఇట్.


Click it and Unblock the Notifications











