Houseful 5 First Review: హౌస్‌ఫుల్ 5 సినిమా ఫస్ట్ రివ్యూ.. రెండు క్లైమాక్స్‌లతో మర్డర్ మిస్టరీ బాగుందా?

బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్‌వాలా, వర్దా నడియాడ్‌వాలా, ఫిరుజీ ఖాన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం హౌస్‌ఫుల్ 5. హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన 5వ చిత్రానికి తరుణ్ మన్సుఖానీ దర్శకత్వం వహించారు. కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, నర్గీస్ ఫక్రీ, సోనమ్ బజ్వా, జాక్వలైన్ ఫెర్నాండేజ్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, చంకీ పాండే, ఫర్దీన్ ఖాన్, శ్రేయాస్ తల్పాడే, డినో మారియా, జానీ లీవర్,చిత్రంగద సింగ్ తదితరులు నటించిన ఈ సినిమా జూన్ 6వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా విశేషాలు, ఈ చిత్రంపై ప్రముఖ క్రిటిక్ వెల్లడించిన రివ్యూ వివరాల్లోకి వెళితే..

హస్‌ఫుల్ 5 సినిమాకు సంబంధించిన విశేషం వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకైనా ఒకే ఒక క్లైమాక్స్ ఉంటుంది. అన్ని సినిమాలకు భిన్నంగా ఈ మూవీకి రెండు క్లైమాక్స్‌లను షూట్ చేశారు. ఈ రెండు క్లైమాక్సులను కూడా ఒకే సమయంలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమా రెండు క్లైమాక్స్‌లు ఎలా ఉంటాయనే విషయంపై ఆసక్తి నెలకొన్నది. దాంతో త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. అయితే హౌస్‌ఫుల్ 5 సినిమాకు రెండు క్లైమాక్స్‌లు ఉండటంతో హౌస్‌ఫుల్ 5 A, హౌస్‌ఫుల్ 5 B అనే టైటిల్స్‌తో రిలీజ్ చేస్తున్నారు.

Houseful 5 Censor Board Review

హస్‌ఫుల్ 5 సినిమా క్లైమాక్స్ గురించి నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా మాట్లాడుతూ.. చాలా రోజుల నుంచి రెండు క్లైమాక్స్‌లు ఉన్న క్రైమ్ థ్రిల్లర్‌ను రాయాలని నేను అనుకొన్నాను. ప్రతీ క్లైమాక్స్‌లో డిఫరెంట్ కిల్లర్ ఉండేలా సినిమాను డిజైన్ చేశాం. ముంబైలో పక్క పక్కనే ఉన్న థియేటర్లలో రెండు క్లైమాక్స్‌లు ఉన్న రెండు సినిమాలను ప్రదర్శిస్తాం. ఆ రెండు సినిమాలను ఆడియెన్స్ చూసుకోవచ్చు. ఈ రెండు సినిమాల ముగింపులో డిఫరెంట్ కిల్లర్స్ ఎలాంటి ముగింపు ఇస్తారు అనేది ఆసక్తికరంగా ఉంటుంది అని చెప్పారు.

అయితే ఈ సినిమా గురించి దుబాయ్‌కు చెందిన క్రిటిక్‌గా చెప్పుకొనే ఉమేర్ సంధూ తన రివ్యూను ట్విట్టర్‌లో పెట్టారు. ఈ సినిమా విషయానికి వస్తే.. మెరిసేదంతా బంగారం కాదు. ఈ చిత్రం బోరింగ్ కామెడీ. నటీనటుల పెర్ఫార్మెన్స్ చాలా పేలవంగా ఉంటుంది. ఇండియాలో ఇంతకంటే చెత్తగా కామెడీ సినిమా తీయరనేది నా అభిప్రాయం. ఈ సినిమా చూసిన తర్వాత విపరీతమైన తలనొప్పితో బాధపడ్డాను. అత్యంత చీప్ కామెడీ. అక్షయ్ కుమార్‌ సిగ్గుపడాల్సిన సమయం వచ్చింది. ఆడియెన్స్ మీరు ఈ సినిమాకు దూరంగా ఉంటే.. డబ్బు ఆదా అవుతుంది అని ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు.

ఈ సినిమా గురించి కమల్ ఆర్ ఖాన్ రివ్యూ వెల్లడిస్తూ.. 100 వయసు వచ్చిన సంపన్నుడైనా రంజిత్.. తన జన్మదినం రోజున తన వారసుడిని ప్రకటించాలని అనుకొంటాడు. కానీ ఆయనకు తన వారసుడు ఎవరో తెలియదు. ఈ క్రమంలో నేను వారసుడిని అంటూ ముగ్గురు (అక్షయ్ కుమార్, రితీష్, అభిషేక్ ) వస్తారు. దాంతో కథలో ట్విస్ట్ ఏర్పడుతుంది. ఈ సినిమాలో ఓ మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ఎవరు చేశారు? అసలు వారసుడు ఎవరు అనేది క్లైమాక్స్‌లో తెలుస్తుంది. ఈ సినిమా కామెడీ కాదు.. క్రైమ్ థ్రిల్లర్ అని కేఆర్కే అన్నారు.

ఇలాంటి కథ గతంలో హిందీ సినిమా రంగంలో వారిస్ అనే పేరుతో సినిమాగా వచ్చింది. అంతేకాకుండా ఈ క్రూయిజ్ షిప్ మర్డర్ అనే హాలీవుడ్ సినిమా కథను కూడా జోడించి రైట్స్ చెల్లించకుండా ప్లాన్ చేశారు. ఈ సినిమాలో నటించిన వారందరూ అట్టర్ ఫ్లాప్ యాక్టర్లే. ఈ సినిమా కథలో ఆసక్తి లేదు. పాటలు సరిగా లేవు. కంటెంట్ కూడా బాగా లేదు. ఈ సినిమాలో కొత్తదనం ఏమీ లేదు. కాబట్టి ఈ సినిమా నడుస్తుందనే గ్యారెంటీ అసలే లేదు అని కేఆర్కే తన రివ్యూలో వెల్లడించారు.

ఇక ఉమేర్ సంధూ, కేఆర్కే రివ్యూల విషయానికి వస్తే.. ఇప్పటి వరకు చెప్పిన చాలా రివ్యూలు వాస్తవానికి కొన్ని దూరంగాను, మరొకొన్ని దగ్గరగా ఉన్నాయి. అయితే ఎక్కువగా వీళ్లు చెప్పిన రివ్యూలు కూడా ఫ్లాప్ అయిన సందర్బాలు ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా గురించి అందించే ఎక్స్‌క్లూజివ్ రివ్యూ గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Read more about: umair sandhu krk Houseful 5
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X