Housefull 5 Movie Review: హౌస్‌ఫుల్ 5 హిందీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

మూవీ: Housefull 5 A
నటీనటులు: అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, బాబీ డియోల్ (అతిథి పాత్ర) జాక్వలైన్ ఫెర్నాండేజ్, సోనమ్ బజ్వా, నర్గీస్ ఫక్రీ, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, నానా పాటేకర్, చంకీ పాండే, ఫర్దీన్ ఖాన్, శ్రేయాస్ తల్పాడే, డినో మారియా, రంజిత్, జానీ లీవర్, చిత్రంగద సింగ్, సౌందర్య శర్మ, నిఖ్తిన్ ధీర్ తదితరులు
దర్శకత్వం: తరుణ్ మన్సుఖనీ
కథ, స్క్రీన్ ప్లే: సాజిద్ నడియాడ్‌వాలా
నిర్మాత: సాజిద్ నడియాడ్‌వాలా, వర్దా నడియాడ్‌వాలా, ఫురుజీ ఖాన్
సినిమాటోగ్రఫి: వీ మణికందన్
ఎఢిటింగ్: రామేశ్వర్ ఎస్ భగత్
మ్యూజిక్: జూలియస్ పాకియమ్ (బీజీఎం), పాటలు: యోయో హానీ సింగ్, వైట్ నాయిస్ కలెక్టివ్స్, తనిష్క్ బాగ్చీ
బ్యానర్: నాడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2025-06-06

69 మిలియన్ డాలర్ల టాప్ బిజినెస్‌మ్యాన్ రంజిత్ దోబ్రియాల్ (రంజిత్) తన 100వ పుట్టిన రోజును క్రూయిజ్ పార్టీ ఏర్పాటు చేసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనుకొంటాడు. ఆ బాధ్యతను తన రెండో భార్య కుమారుుడు దేవ్ (ఫర్దీన్ ఖాన్), తన కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మాయ, బేడీ, షిరాజ్ (చిత్రంగద, డినో మారియా, శ్రేయాస్ తల్పాడే)కు అప్పగిస్తాడు. బర్త్ డే సెలబ్రేషన్స్ ఏర్పాట్లు జోరుగా సాగుతున్న సమయంలో రంజిత్ మరణిస్తాడు. అయితే మరణం తర్వాత ఆయన రాసిన వీలునామా బయటకు వస్తుంది. ఆ వీలునామా ప్రకారం తన ఆస్తి జాలీ అనే తన తొలి భార్య కుమారుడికి చెందాలని వెల్లడిస్తాడు. ఆ క్రమంలో నేను జాలీ అంటూ జలాలుద్దీన్ అలియాస్ జాలీ (రితేష్ దేశ్‌ముఖ్), జల్ భూషణ్ అలియాస్ జాలీ (అభిషేక్ బచ్చన్), జూలియస్ అలియాస్ జాలీ (అక్షయ్ కుమార్) ముగ్గురు తమ భార్య జారా, శశికళ, కాంచీ (సోనమ్ బజ్వా, జాక్వలైన్, నర్గీస్ ఫక్రీ) లను వెంటపెట్టుకొని వస్తాడు. ఆ క్రమంలో జాలీ ఎవరనే విషయం తేల్చడానికి ప్రయత్నించిన డాక్టర్‌ హత్యకు గురవుతాడు.

Housefull 5 Hindi Movie Review and Rating

క్రూయిజ్ పార్టీలో రంజిత్ ఎలా మరణిస్తాడు? మేమే జాలీ అంటూ వచ్చిన ముగ్గురిలో ఎవరు నిజమైన జాలీ అని కనిపెట్టడానికి చేసిన ప్రయత్నం ఏమిటి? డాక్టర్ ఎలాంటి పరిస్థితుల్లో హత్యకు గురయ్యాడు? డాక్టర్‌ను హత్య చేసింది ఎవరు? నేనే జాలీ అంటూ జలాలుద్దీన్, జల్ భూషణ్, జూలియస్‌లో ఎవరు నిరూపించుకొన్నారు? ఈ ముగ్గురిలో ఎవరు నిజమైన జాలీ అని తేల్చారు? ఈ ముగ్గురు కాకుండా అసలు జాలీ ఎవరైనా వచ్చారా? చివరకు కిల్లర్ ఎవరని నిర్ధారించారు? 69 మిలియన్ డాలర్ల ఆస్తిని ఎవరు చేజిక్కించుకొన్నారు? ఈ హంగామాలో ఎంట్రీ ఇచ్చిన బాబీ డియోల్ ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానమే హౌస్‌ఫుల్ 5 సినిమా కథ.

ఇప్పటి వరకు హౌస్‌ఫుల్ సిరీస్‌లో వచ్చిన సినిమాలు బ్రహ్మండమైన కామెడీ, ఫన్, థ్రిల్లింగ్ మూమెంట్స్ వచ్చాయి. ఈ క్రమంలో భారీ తారాగాణంతో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు అటెన్షన్ క్రియేట్ చేసింది. అయితే ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచే కథను మాత్రం రాయడంలో దర్శకుడు తరుణ్ మన్సుఖనీ ఫెయిల్ అయ్యాడు. కన్వినియెంట్ స్క్రీన్ ప్లే. కామెడీ ఆఫ్ ఎర్రర్స్, అడల్ట్ కంటెంట్, అడల్డ్ జోకులతో సినిమాను నింపేశాడు. ఇక జాలీ ఎవరు అని తేల్చే కథలోకి మర్డర్ ప్లాట్‌ను జొప్పించి కథను మలుపు తిప్పే ప్రయత్నం చేయడం కొసమెరుపుగా కనిపిస్తుంది. అయితే మర్డర్ మిస్టరీలో బలమైన, ఆసక్తికరమైన సన్నివేశాలు ఏమీ కనిపించవు. రొటీన్, రెగ్యులర్ కామెడీ డ్రామాగా మార్చడంతోనే దర్శకుడు సరిపెట్టుకొన్నాడు. ఈ సినిమాకు నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా కథను, స్క్రీన్ ప్లేను అందించాడు. ఆయన కథ, స్క్రీన్ ప్లే గొప్పగా ఏమీ లేకపోయింది.

బలం లేని కథను, పేలవమైన సన్నివేశాలను పండించాలంటే అది బిగ్ ఛాలెంజ్ అనే చెప్పాలి. అలాంటి సినిమా కథను అక్షయ్ కుమార్, అభిషేక్, రితేష్ అందరూ తమ వంతుగా మంచి కామెడీని పండించాడు. అడల్ట్ కోటింగ్ ఉండే కామెడీ సన్నివేశాలు కొన్ని చోట్ల మంచి నవ్వులు పూయించగా.. మరొకొన్ని చోట్ల రొటీన్‌గా అనిపించాయి. జాక్వలైన్, నర్గీస్, సోనమ్ బజ్వా, సౌందర్య శర్మ, చిత్రంగద అందాలను గుప్పించడంలో పోటీ పడ్డారు. మినీస్, షార్ట్స్ లాంటి డ్రస్సులో గ్లామర్‌ను యదేచ్ఛగా ఆరబోశారు. ఇక పోలీస్ ఆఫీసర్లుగా సంజయ్ దత్, జాకీ ష్రా తమ వంతుగా కామెడీని పండించే ప్రయత్నం చేశారు.

Housefull 5 Hindi Movie Review and Rating

ఇక ఈ చిత్రంలో ఫర్దీన్ ఖాన్ కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించారు. శ్రేయాస్ తల్పాడే, డినో మారియా, రంజిత్, నిఖ్తిన్ ధీర్‌కు పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలే లభించాయి. జానీ లీవర్ తన మార్కు కామెడీని రిపీట్ చేశాడు. నానా పాటేకర్ ప్రజెన్స్ బాగుంది. సటిల్ కామెడీని కాంట్రిబ్యూట్ చేశాడు. చివరల్లో బాబీ డియోల్ ఎంట్రీ ఫ్యాన్స్‌కు జోష్‌ను కలిగిస్తుంది. కథలో ట్విస్టుకు ఆయన పాత్రను వాడుకోవడం బాగుంది.

ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమా అంతా ఇండోర్ సెటప్‌లో సాగడం వల్ల సినిమాటోగ్రాఫర్‌ మణికందన్‌కు పెద్దగా కష్టతరం కాలేదు. కానీ క్లైమాక్స్‌లో కొన్ని టిపికల్ సీన్లను బాగా డీల్ చేశాడు. క్రూయిజ్ ఇంటర్నల్ సెటప్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పలు సీన్లను బాగా ఎలివేట్ చేసింది. పాటలు హుషారెత్తించేలా, జోష్ పెంచేలా హెల్ప్ అయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. కానీ ఇంకా కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే బెటర్ అవుట్‌పుట్ వచ్చి ఉండేదనిపించింది.

ఫైనల్‌గా హౌస్‌ఫుల్ 5 A సినిమా విషయానికి వస్తే.. కొత్త పాయింట్, కొత్త కథ లేకుండా కేవలం ఫన్ ఎలిమెంట్స్స్ తో సాగే రొటీన్ క్రైమ్, మర్డర్ మిస్టరీ. అక్షయ్ కుమార్, అభిషేక్, ఫర్దీన్ ఖాన్ పాత్రలు సినిమాకు ప్లస్ పాయింట్స్. టెక్నికల్ అంశాలు కూడా కథకు సరిపడే మాదిరిగానే ఉన్నాయి. హౌస్‌ఫుల్ సిరీస్ ఫ్యాన్స్‌కు నచ్చే అంశాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. రెగ్యులర్ సినీ ఆడియెన్స్ ఓసారి చూడొచ్చు. రేర్ ఆడియెన్స్ ఓటీటీలోకి వచ్చే వరకు వెయిట్ చేయొచ్చనేది నా అభిప్రాయం. అయినా ఈ సినిమా చూడాలనుకొంటే.. అతిగా ఆశించి వెళ్లకుండా చూస్తే కాసేపు నవ్వుకొని బయటకు రావొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X