twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హౌరా బ్రిడ్జ్ మూవీ రివ్యూ: ట్రయాంగిల్ లవ్‌స్టోరి

    By Rajababu
    |

    Rating:
    2.0/5
    Star Cast: రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరి, రావు రమేష్
    Director: రేవన్ యాదు

    Recommended Video

    హౌరా బ్రిడ్జ్ మూవీ రివ్యూ

    యువ హీరో రాహుల్ రవీంద్రన్, బూచమ్మ.. బుచోడు దర్శకుడు రేవన్ యాధూ కలిసి రూపొందించిన చిత్రం హౌరా బ్రిడ్జ్. ఈ మూవీలో అందాల తారలు చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరోయిన్లుగా నటించారు. ట్రయాంగిల్ లవ్‌స్టోరిగా రూపొందిన ఈ చిత్రంలో రావు రమేశ్, పోసాని కృష్ణమురళీ, అలీ లాంటి అగ్ర నటులు కీలక పాత్రలను పోషించారు.

    సినిమా విడుదలకు ముందు రిలీజైన టీజర్లు, ట్రైలర్లు, పోస్టర్లు ఓ ఫీల్ గుడ్ చిత్రమనే భావనను ప్రేక్షకుల్లో కల్పించాయి. చిన్న చిత్రంగా రూపొందిన ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఫిబ్రవరి 3 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి టాక్ సంపాదించుకొన్నదో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    హౌరా బ్రిడ్జ్ కథ..

    హౌరా బ్రిడ్జ్ కథ..

    రాహుల్ రవీంద్రన్‌కు చిన్నతనంలో స్వీటీ అనే స్నేహితురాలు ఉంటుంది. రాహుల్ కుటుంబం కోల్‌కతాకు వెళ్లిపోవడంతో వారిద్దరూ విడిపోతారు. సుమారు 18 ఏళ్ల తర్వాత మళ్లీ స్వీటీని కలుసుకోవడానికి సొంత గ్రామానికి వస్తాడు రాహుల్. అనాధ అయిన స్వీటి (చాందినీ చౌదరీ) కి తన బావ (అజయ్) సర్వస్వం తానై పెంచి పెద్ద చేస్తాడు. స్వీటీకి బావ తప్ప మరో ప్రపంచం ఉండదు. అలాంటి సమయంలో రాహుల్‌తో స్వీటి ప్రేమలో పడుతుంది. తన ప్రేమ విషయాన్ని బావకు చెప్పడంతో ఆయన అర్థం చేసుకొని రాహుల్‌ను పెళ్లి చేసుకోమంటాడు. కానీ ఓ కారణంగా పెళ్లి చేసుకోనని స్వీటికి రాహుల్ షాక్ ఇస్తాడు. ఈ పరిస్థితుల్లో స్వీటీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుంది.

    ముగింపు ఇలా..

    ముగింపు ఇలా..

    ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన స్వీటీ పరిస్థితి ఏమిటీ? చిన్నప్పటి నుంచి ప్రేమించిన స్వీటీని ప్రేమను ఎందుకు తిరస్కరిస్తాడు? ఈ కథలో శ్వేత (మనాలి రాథోడ్) పాత్ర ఏమిటీ? స్వీటీ, శ్వేత ఇద్దరిలో రాహుల్ ఎవరిని పెళ్లి చేసుకొన్నాడు. ఈ సినిమాలోని ప్రేమ కథకు అజయ్, రావు రమేష్, అలీ, పోసాని లాంటి పాత్రల సంబంధమేమిటీ అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే హౌరా బ్రిడ్జ్.

    స్కిప్ట్ అనాలిసిస్.. టేకింగ్

    స్కిప్ట్ అనాలిసిస్.. టేకింగ్

    తాను అమితంగా ఇష్టపడిని స్నేహితురాలి ప్రేమ కోసం ఓ యువకుడు పడిన తపన. అదే యువకుడు తనకు పరిచయం లేని యువతి ప్రేమలో బందీ అవ్వడమనే పాయింట్‌తో ముక్కోణపు ప్రేమకథను అల్లుకొన్నాడు దర్శకుడు రేవన్. పాయింట్‌లో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ.. తెర మీద ఆవిష్కరించడంలో తడబాటుకు గురయ్యాడు. కథనాన్ని కలుగపులగం చేయడం గందరగోళంగా మారింది.

    దర్శకుడి తడబాటు

    దర్శకుడి తడబాటు

    కథకు సంబంధం లేని రావు రమేష్ సైడ్ ట్రాక్‌ను మెయిన్ కథలో జొప్పించి అసలు కథకు ఎసరుపెట్టాడనిపిస్తుంది. కథపై పట్టును కోల్పోవడంతో ట్రాక్ మిస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. కథను క్లైమాక్స్ చేర్చడానికి చాలా కష్టాలే పడ్డాడు. అర్థపర్థంలేని కామెడీ సీన్లతో కథ వేగాన్ని దెబ్బ తీశాడనిపిస్తుంది. ఓవరాల్‌గా ఏదో చేయబోతే కోతి అయిందనే విధంగా హౌరా బ్రిడ్జ్ తెరకెక్కిందనే ఫీలింగ్ కలుగుతుంది.

     ఫస్టాఫ్‌లో

    ఫస్టాఫ్‌లో

    బాల్యం ఎపిసోడ్, 18 ఏళ్ల తర్వాత రాహుల్ రవీంద్రన్ తన సొంత ఊరుకు రావడం అనే సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. స్వీటీ అనుకొని చాందనీ చౌదరీ వెంటపడటం, ఆ తర్వాత వారిద్దరూ ప్రేమలో పడటం, వారి ప్రేమకు బావ అంగీకారం తెలపడం లాంటి సీన్లతో కథ ఇంటర్వెల్ వరకు సాదాసీదాగా సాగిపోతుంది. తాను అనుకొంటున్న స్వీటి చాందినీ చౌదరీ కాదు అనే విషయంతో తెలిసి ఆమెతో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

     సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో

    రెండో భాగంలో చిన్ననాటి స్నేహితురాలు స్వీటి (శ్వేత)ను కలుసుకోవడం, ఈ క్రమంలో తనకు ప్రేమ ఉన్నది శ్వేతపైన కాదు.. స్వీటీపైనే అని తెలుసుకొంటాడు. ఆ తర్వాత చాందినీ చౌదరీ ప్రేమానురాగాలు గుర్తుకు రావడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. తన స్నేహితుడు రాహుల్‌ పరిస్థితిని అర్థం చేసుకొని స్వీటిని కలుపడానికి శ్వేత సహకారం అందిస్తున్నది. ఇక క్లైమాక్స్‌లో తన స్వీటిని ఎలా చేరుకొన్నాడనే ప్రాసెస్‌లో బ్రిడ్జి కథను అనవసరంగా తెరపైకి తెచ్చి సినిమాను మరింత కాంప్లికేట్ అవుతుంది. ఎలాగోలా రాహుల్, స్వీటీ కలువడంతో కథ సుఖాంతం అవుతుంది.

     రాహుల్ యాక్టింగ్

    రాహుల్ యాక్టింగ్

    రాహుల్ రవీంద్రన్ తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించాడు. నటనపరంగా అవసరమైన చోట భావోద్వేగాలను పండించాడు. కాకపోతే కథలో క్లారిటీ లేకపోవడం వల్ల రాహుల్ పాత్ర గందరగోళంగా తయారైంది. ఈ విషయంలో రాహుల్ ఏ మాత్రం తప్పుపట్టాల్సిన అవసరం లేదు.

    అందాల తారల

    అందాల తారల

    యూట్యూబ్‌లో షార్ట్ ఫిలింలతో పాపులర్ అయిన చాందినీ చౌదరీ స్వీటీగా కనిపించింది. తన పాత్రకు న్యాయం చేయడానికి శతవిధాలుగా ప్రయత్నించింది. కాకపోతే నటనను మరింత మెరుగుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక శ్వేతగా మనాలీ రాథోడ్ కనిపించింది. మనాలి పాత్ర గురించి పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు.

     ఇతర పాత్రల్లో

    ఇతర పాత్రల్లో

    చాందినీ చౌదరీకి బావగా అజయ్ కనిపిస్తాడు. కాంట్రాక్టర్ పాత్రలో నటించిన రావు రమేష్‌ది ఓ డిఫరెంట్ క్యారెక్టర్. ఆ పాత్ర ఎందుకొస్తుందో.. ఎందుకు పోతుందో ఓ పట్టాన అర్థం కాదు. కానీ క్లైమాక్స్‌లో బలవంతంగా కథలోకి ఎలాగోలా ప్రవేశించి జస్టిఫికేషన్ ఇవ్వడంతో ఆ పాత్ర ప్రాధాన్యత అర్థమవుతుంది. అలీ, పోసాని ఇతర పాత్ర లకూడా అదే పరిస్థితి.

    టెక్నికల్ టీమ్

    టెక్నికల్ టీమ్

    సాంకేతిక విభాగాల్లో శేఖర చంద్ర మ్యూజిక్ ఆకట్టుకొనే విధంగా ఉంది. సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ. ఎడిటింగ్ విభాగం ఇంకా చేతివాటం ప్రదర్శించడానికి ఛాన్స్ ఉంది. కథకు కావాల్సిన దానికన్నా నిర్మాత ఎక్కువగానే ఖర్చుపెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అనవసరమైన పాత్రలను చేర్చడం సినీ నిర్మాణ అనుభవంలో లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

     ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    కథకు హౌరా బ్రిడ్జికి సంబంధమేమిటో అర్థం కాని పరిస్థితి. కేవలం హీరో కోల్‌కతా నుంచి రావడమే ఆ టైటిల్ జస్టిఫికేషనా అనే ఫీలింగ్ కలుగుతుంది. వీకెండ్‌లో హౌరా బ్రిడ్జ్‌కు దూరంగా ఉంటేనే మంచింది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్

    రాహుల్ రవీంద్రన్
    సంగీతం, సినిమాటోగ్రఫీ
    స్టోరి పాయింట్

    మైనస్ పాయింట్స్
    కథ, కథనాలు
    డైరెక్షన్, టేకింగ్

     తెరవెనుక, తెర ముందు

    తెరవెనుక, తెర ముందు

    నటీనటులు: రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్, రావు రమేష్, అజయ్, అలీ, పోసాని కృష్ణమురళీ, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్ తదితరులు
    దర్శకత్వం: రేవన్ యాధూ
    నిర్మాణం: ఈఎంవీఈ ప్రొడక్షన్స్
    మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ చంద్ర
    సినిమాటోగ్రఫీ: విజయ్ మిశ్రా
    ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
    రిలీజ్ డేట్: ఫిబ్రవరి 3వ తేదీ

    English summary
    Howrah Bridge’ starring Rahul Ravindran, Chandini Chowdary. The teaser released recently which is the romantic entertainer with Rahul who did few movies and entertained the audience while Chandini who is a YouTuber and got fame. Howrah Bridge’ movie is directed by Revan Yadu in EMVE productions. This movie released on Feb 3rd. In this occassion, Telugu Filmibeat brings exclusive review for..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X