Hridayapoorvam Movie Review: హృదయపూర్వమ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: మోహన్ లాల్, మాళవిక మోహన్, సంగీత్ ప్రతాప్, సంగీతా మాధవన్ నాయర్, సిద్దిఖీ, లాలు అలెక్స్, జనార్ధనన్, బాబు రాజ్, నిషాన్, సబితా ఆనంద్, ఎస్పీ చరణ్, మీరా జాస్మిన్, ఆంథోని పెరంబవూర్, బాసిల్ జోసెఫ్ తదితరులు
దర్శకత్వం: సత్యన్ ఆంతికాడ్
నిర్మాత: ఆంథోని పెరంబవూర్
కథ: అఖిల్ సత్యన్
స్క్రీన్ ప్లే: సోను టీపీ
సినిమాటోగ్రఫి: అను మూతేడత్
ఎడిటింగ్: కే రాజగోపాల్
మ్యూజిక్: జస్టిన్ ప్రభాకరన్
బ్యానర్: ఆశీర్వాద్ సినిమాస్
రిలీజ్ డేట్: 2025-08-28
కేరళలో క్లైడ్ కిచెన్ యజమాని సందీప్ బాలకృష్ణన్‌కు గుండె మార్పిడి ఆపరేషన్ జరుగుతుంది. మిలిటరీ అధికారి రవి బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన గుండెను పూణే నుంచి కోచికి గ్రీన్ ఛానెల్ ద్వారా తరలించి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. అయితే వయసు మీద పడినా ఇంకా బ్రహ్మచారిగానే ఉంటాడు. అయితే గుండె మార్పిడి తర్వాత మిలిటరి అధికారి కూతురు హరిత (మాళవిక మోహనన్) తన ఎంగేజ్‌మెంట్ కోసం సందీప్‌ను పూణేకు ఆహ్వానిస్తుంది. తన తండ్రి గుండెను అమర్చిన సందీప్‌ను చూసి హరిత, రవి భార్య దేవిక (సంగీతా మాధవన్ నాయర్) ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. ఎంగేజ్‌మెంట్‌కు వెళ్లిన సందీప్ ఓ కారణం వల్ల వాళ్ల ఇంట్లోనే కొన్నాళ్లు ఉండిపోవాల్సి వస్తుంది.

సందీప్‌కు ఎందుకు గుండె మార్పిడి చేయాల్సి వచ్చింది? సందీప్ పెళ్లి చేసుకోకుండా ఎందుకు బ్రహ్మచారిగా ఉన్నాడు? గుండె మార్పిడి తర్వాత సందీప్ పరిస్థితి ఏమిటి? సందీప్‌కు జెర్రీ (సంగీత్ ప్రతాప్)కు ఉన్న రిలేషన్ ఏమిటి? హరిత ఎంగేజ్‌మెంట్‌కు వెళ్లిన సందీప్ ఎలాంటి పరిస్థితులను చవిచూశాడు? ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకొన్న వ్యక్తితో హరిత ఎంగేజ్‌మెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకొన్నది? పూణేలోనే హరిత ఇంట్లోనే సందీప్ ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? హరిత, సందీప్ మధ్య ఎలాంటి బాండింగ్ కుదిరింది? దేవికతో సందీప్ ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఎలా ఉంది? హరిత, దేవికతో అనుబంధం సందీప్‌ను ఎలాంటి భావోద్వేగాలకు గురి చేసింది? చివరకు సందీప్‌కు పెళ్లి జరిగిందా? ఒకవేళ సందీప్ పెళ్లి జరిగితే ఎవరితో జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానమే హృదయపూర్వమ్ సినిమా కథ.
దర్శకుడు సత్యన్ అంతికాడ్ తనయుడు అఖిల్ సత్యన్ భావోద్వేగాలు, హెల్తీ రొమాన్స్, కామెడీ, యాక్షన్ అంశాలను కలబోసి రాసిన సింపుల్ పాయింట్‌కు సోను టీపీ తన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. ఇక సత్యన్ దర్శకుడిగా సెన్సిటివ్ పాయింట్స్‌ను డీల్ చేసిన విధానం హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. మోహన్‌లాల్ ఇమేజ్‌ను పట్టించుకోకుండా డౌన్ టూ ఎర్త్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసి.. ఆయన ద్వారా పెర్ఫార్మెన్స్‌ను రాబట్టుకొన్న విధానం ఇంకా బాగుంది. హంగులు, ఆర్బాటాలు, సౌండ్ పోల్యూషన్ లేకుండా సున్నితమైన హాస్యం, డైలాగ్స్‌తో ప్రతీ సన్నివేశాన్ని చాలా ఎమోషనల్‌గా తీర్చిదిద్దడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రతీ సన్నివేశాలను అద్బుతంగా తీర్చిదిద్ది ఎమోషన్స్ పండించారు.
ఇక ఈ సినిమాలో సందీప్ పాత్రను చేయడానికి మోహన్ లాల్ అంగీకరించడమే పూర్తి స్థాయి సక్సెస్ సాధించాడని చెప్పాలి. ఎలాంటి హీరోయిజం లేని పాత్రలో డీసెంట్ బ్యాచ్‌లర్ పాత్రలో ఒదిగిపోయాడని చెబితే చాలా చిన్న మాట అవుతుంది. ఆ పాత్రతో నవ్విస్తాడు, కంటతడి పెట్టిస్తాడు.. భావోద్వేగాలతో కుదిపేసే నటనతో స్క్రీన్ మీద మరోసారి మ్యాజిక్ చేశాడా? అనిపిస్తుంది. ఇక మోహన్‌లాల్‌కు జతగా ప్రేమలు ఫేమ్ సంగీత్ ప్రతాప్ సినిమాలో నవ్వుల పూలను పూయించాడు. ఇక మాళవిక మోహనన్ గ్లామర్‌గానే కాకుండా ఎమోషనల్ పాత్రలో ఆకట్టుకొన్నది. ఇప్పటి వరకు గ్లామర్ హీరోయిన్‌గానే ముద్ర వేసుకొన్న మాళవిక.. మంచి యాక్టర్‌ను అని కూడా ఒప్పించే ప్రయత్నంలో సఫలమైంది. సంగీత మాధవన్ నాయర్, సిద్దిఖి, ఇతర నటీనటులు ఆకట్టుకొన్నారు. మీరా జాస్మిన్, నిర్మాత ఆంథోని, బాసిల్ జోసెఫ్ గెస్ట్ అప్పియరెన్స్‌తో జోష్ పుట్టించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకర్ సంగీతం, పాటలు బ్యాక్ బోన్ లాంటివి. పలు సన్నివేశాలను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సహజంగా, లైవ్లీగా, ఫీల్‌గుడ్‌గా మార్చారు. ఇక అను మూతేడత్ తన సినిమాటోగ్రఫితో సినిమాను రిచ్‌గా మార్చేశారు. రాజగోపాల్ ఎడిటింగ్ ప్రతిభ సినిమాను పరుగులు పెట్టించింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు వేగానికి కళ్లెం వేశాయా? అనిపిస్తాయి. కానీ కథను చెప్పే ట్రీట్‌మెంట్ స్ట్రాటేజి వల్ల అలా అనిపిస్తుందని. ఇక అశీర్వాద్ సినిమాస్ బ్యానర్ తన ప్రతిష్టకు అనుగుణంగా సినిమాను అద్బుతంగా తీర్చి దిద్దారు.
హృదయపూర్వమ్ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే? సినిమా కామెడీ, ఫీల్‌గుడ్ అంశాలతో సాగే ఎమోషనల్ జర్ని. మోహన్ లాల్, సంగీత్ ప్రతాప్ కాంబో కామెడీ టైమింగ్, మాళవిక మోహన్, సంగీతా మాధవన్ నాయర్‌తో మోహన్ లాల్ కెమిస్ట్రీ బాగా వర్కువుట్ అయింది. అన్ని వర్గాలను ఆకట్టుకొనే కథ, కథనాలు, నవ్వించి.. బావోద్వేగానికి గురి చేసే డైలాగ్స్ ఈ సినిమాకు అత్యంత బలం. కథ సాగే విధానం స్లోగా ఉంటుంది. కాకపోతే ఎక్కడా బోర్ కొట్టదు. ఆద్యంత ఫీల్ గుడ్ కామెడీతో సరదాగా సాగిపోతుంది. మోహన్ లాల్ స్క్రీన్ ప్రజెన్స్ చేసిన మ్యాజిక్‌ను మిస్ చేసుకోవద్దు. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ బాగుంటుంది. మలయాళం సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పుకుండా నచ్చుతుంది. ఈ వారం చూడాలనుకొనే సినిమాల జాబితాలో ఈ మూవీని నిస్పందేహంగా చేర్చుకోవచ్చు.


Click it and Unblock the Notifications











