Hridayapoorvam First Review: హృదయపూర్వమ్ ఫస్ట్ రివ్యూ
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం హృదయపూర్వం. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సత్యన్ అంతికాడ్ దర్వకత్వం వహించారు. డైరెక్టర్ కుమారుడు అఖిల్ సత్యన్ రాసిన కథకు సోను టీపీ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాను ఆశ్వీరాద్ సినిమాస్ బ్యానర్‌పై అంటోని పెరంబవూర్ నిర్మించారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, సంగీత్ ప్రతాప్, సంగీత మాధవన్ నాయర్, సిద్దిఖీ, లాలు అలెక్స్, జనార్ధన్, సబితా ఆనంద్, బాబురాజ్, నిషాన్, ఎస్పీ చరణ్ తదితరులు నటించారు. మీరా జాస్మిన్, బాసిల్ జోసెఫ్ అతిథి పాత్రల్లో కనిపిస్తారు.
ఈ సినిమా సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. అను మోథేదాత్ సినిమాటోగ్రఫిని, కే రాజ్‌గోపాల్ ఎడిటింగ్, జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ బాధ్యతలను నిర్వహించారు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రం ఓనమ్ పండుగ సందర్భంగా ఆగస్టు 28వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అధికారులు రివ్యూ చేశారు. ఈ సినిమాకు లభించిన సర్టిఫికెట్, ఇతర విశేషాల వివరాల్లోకి వెళితే..

ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు అధికారులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాలు బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన ఈ సినిమాకు క్లీన్ యూ (U) సర్టిఫికెట్ ఇచ్చారు. ఓనమ్ పండగ ప్రేక్షకులను టార్గెట్ చేసి నిర్మించిన ఈ సినిమా ఎలాంటి అసభ్యత, అహింసకు తావు లేకుండా సత్యన్ తెరకెక్కించారు. ఇది పక్కాగా పండగ వాతావరణాన్ని థియేటర్‌లో ప్రతిబింబించే సినిమా అవుతుంది అనే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారని చిత్ర యూనిట్ తెలిపింది.
ఇక మూవీలో మోహన్ లాల్ మరోసారి పెర్ఫార్మెన్స్ పరంగా విజృంభించడమే కాకుండా చిత్రంలోని సన్నివేశాలను భావోద్వేగంతో నింపేశాడు. మరోసారి తన అభిమానులకు ఫుల్ మీల్స్ అందించేందుకు సిద్దమయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇక మాళవిక మోహనన్, సంగీత్ ప్రతాప్ తమ వంతు సహకారాన్ని మోహన్ లాల్‌కు అందించడమే కాకుండా సినిమాను ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా మార్చారు అని తెలిసింది.
ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, కొంత యాక్షన్ అంశాలు కలబోసిన మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా నిడివి 151 నిమిషాలు. అంటే ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 31 నిమిషాలుగా కట్ చేశారు. ఈ సినిమాకు అది పర్‌ఫెక్ట్ కట్ అనే అభిప్రాయాన్ని సెన్సార్ సందర్భంగా చర్చకు వచ్చినట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. ఇక ఈ సినిమా జస్టిన్ ప్రభాకరన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుందని పేర్కొంటున్నారు.
హృదయపూర్వమ్ సినిమా సెన్సార్ ముగిసిన తర్వాత సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసిన తన అభిమానులతో సమాచారాన్ని పంచుకొన్నారు. ఈ సినిమాను హృదయంత రూపొందించాం. మీ కోసం హృదయపూర్వమ్ సిద్దంగా ఉంది. ఇక నుంచి ఈ మూవీ మీదే అంటూ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభమై మంచి రెస్పాన్స్ కూడగట్టుకొంటున్నది. ఇక 28వ తేదీ కోసం సిద్దంగా ఉండండి అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











