హుషారు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Recommended Video

Husharu Movie Review హుషారు రివ్యూ | Filmibeat Telugu

Rating:
3.0/5

యూత్ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ చిత్రాలకు టాలీవుడ్ ప్రేక్షకుల ఆదరణ ఎప్పడూ ఉంటుంది. గతంలో ఫ్రెండ్‌షిప్, లవ్, కామెడీ కలబోసి వచ్చిన ప్రేమదేశం, హ్యాపీ డేస్ లాంటి భారీ సక్సెస్‌లను అందుకొన్నాయి. ప్రస్తుతం అలాంటి అంశాలతోనే లక్కీ మీడియా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం హుషారు. ఈ చిత్రం ద్వారా శ్రీ హర్ష కొనుగంటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, అభినవ్ మేడిశెట్టి హీరోలుగా, దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లుగా నటించారు. అర్జున్ రెడ్డి ఫేం రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో మెరిసారు. రిలీజ్‌కు ముందే టీజర్లు, ట్రైలర్లు, ఆడియోకు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. కొన్ని ప్రత్యేకతలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

 హుషారు కథ

హుషారు కథ

ఆర్య (తేజస్ కంచెర్ల), చైతన్య అలియాస్ చై (అభినవ్ మేడిశెట్టి), బంటి (తేజ్ కూరపాటి), ధ్రువ్ (దినేష్ తేజ్) చిన్నప్పటి నుంచి స్కూల్ ఫ్రెండ్స్. చదువు కంటే ఎంజాయ్‌‌మెంట్‌కే ప్రాధాన్యం ఇస్తూ జల్సాగా జీవితాన్ని గడిపేస్తుంటారు. జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకుండా బీరు తాగుతూ లైఫ్ లీడ్ చేయడం, ఫ్రెండ్‌షిప్ కోసమే బతికేస్తుంటారు. ఆర్య తన స్కూల్ మేట్ (దీక్ష నగార్కర్)తో ప్రేమలో పడుతాడు. పార్టీలో తొలిచూపులోనే ప్రేమించిన రియా (ప్రియా వడ్లమాని)కు చై దగ్గరవుతాడు. జీవితంలో సాఫీ సాగిపోతున్న సమయంలో ఓ కారణంగా చైతన్యను రియా వదిలేసి యూఎస్ వెళ్లిపోతుంది. దాంతో మానసికంగా కుంగిపోయిన చైతన్యకు క్యాన్సర్ వ్యాధి ఉందని తెలుస్తుంది. ఆర్యకు ప్రేమలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆర్థికంగా అవసరాలు పెరిగిపోవడంతో ఆదాయం కోసం బీరు తయారీని ఎంచుకొంటారు.

హుషారులో ట్విస్టులు

హుషారులో ట్విస్టులు

చైతన్యను రియా ఎందుకు వదిలేసింది? చైతన్య క్యాన్సర్ ట్రిట్‌మెంట్‌కు కావాల్సిన రూ.30 లక్షలు ఎలా సమకూర్చుకొన్నారు? ఈ కథలో రాహుల్ రామకృష్ణ ( రాజు బొల్లం) పాత్ర ఏంటి? ఈ నలుగురు స్నేహితులకు రాజు బొల్లంకు సంబంధమేమిటి? చివరకు నలుగురు స్నేహితులు జీవితం ఏ దిశగా ప్రయాణించింది. నలుగురు స్నేహితులు సమాజంలో ఎలాంటి గౌరవాన్ని దక్కించుకొన్నారు. ఆర్య ప్రేమ ఫలించిందా? లాంటి ప్రశ్నలకు సమాధానమే హుషారు సినిమా కథ.

ఫస్టాఫ్‌లో

ఫస్టాఫ్‌లో

నలుగురు స్నేహితుల స్కూలింగ్ నుంచి కాలేజీలో చేసిన చిలిపి పనులు, తుంటరి పనులతో సరదాగా కథ మొదలవుతుంది. స్కూల్‌లోనే లవ్ బ్రేకప్ అయిన ఆర్య అఫైర మళ్లీ చిగురించడం, రియాతో చైతన్య లవ్ ట్రాక్ రొమాంటిక్‌గా గడిచిపోతుంది. బంటి, ధ్రువ్ చేసే అల్లరి పనులు వినోదాన్ని పంచుతాయి. సెకండాఫ్‌లో జండు బామ్ యాడ్ మేకింగ్ సరదాగా సాగిపోతుంది. తొలిభాగంలో ఉండిపోరా, నా నా పాటలు మంచి కిక్కెస్తాయి. ఇలా సాగిపోతున్న జీవితంలో చైతన్యకు క్యాన్సర్ అని తెలియడంతో ఎమోషనల్‌‌గా ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.

సెకండాఫ్‌లో

సెకండాఫ్‌లో

ఇంటర్వెల్ తర్వాత చైతన్య ఎమోషనల్ జర్నీతోపాటు రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. ఫ్రస్టేటెడ్ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా, తనకు నచ్చని జీవితాన్ని లీడ్ చేస్తూ అనుక్షణం అసహనంతో ఊగిపోయే క్యారెక్టర్‌తో కథ మరో మలుపు తిరుగుతుంది. సెకండాఫ్‌లో పిచాక్ సాంగ్ హైలెట్‌గా నిలుస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ పడే వరకు కనిపించే సీన్లు భావోద్వేగానికి గురిచేస్తాయి. చక్కటి సందేశంతో హుషారు ఓ ఫీల్‌గుడ్ సినిమాగా ముగుస్తుంది.

దర్శకుడిగా హర్ష ప్రతిభ

దర్శకుడిగా హర్ష ప్రతిభ

దర్శకుడు హర్ష రాసుకొన్న కథ, అనుసరించిన కథనాలు చూస్తే కొత్త దర్శకుడని ఎక్కడా అనిపించడు. కాకపోతే మేకింగ్‌లో అక్కడక్కడా మెచ్యురిటీ కనిపించదు. కథలో అనే అంశాలు, పలు రకాల పాత్రలను కథలో బ్లెండ్ చేసిన తీరుకు అభినందించాల్సిందే. సోషల్ మీడియాలో వచ్చే జోక్స్‌ను కథలో జొప్పించిన తీరు ఆకట్టుకొంటాయి. నలుగురు యువకులు, ముగ్గురు యువతుల పాత్రలు తెర మీద నేచురల్‌గా కనిపించడం వెనుక హర్ష ప్రతిభనే కారణమని చెప్పవచ్చు. ప్రధాన కథను నడిపిస్తూనే సబ్ ప్లాట్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపించడంలో హర్ష సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

నలుగురు హీరోల ఫెర్ఫార్మెన్స్

నలుగురు హీరోల ఫెర్ఫార్మెన్స్

తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, అభినవ్ మేడిశెట్టి నలుగురు హీరోలు ఈ కథకు ప్రాణంగా నిలిచారు. తమకు దక్కిన పాత్రలకు ఈ నలుగురు పూర్తిగా న్యాయం చేకూర్చాడు. తేజస్ సీరియస్ అటిట్యూడ్ ఆకట్టుకొనేలా ఉంది. భావోద్వేగ నటనతో అభినవ్ ఆకట్టుకొన్నాడు. సెకండాఫ్‌లో అభినవ్ ఎపిసోడ్ ప్లస్‌గా మారింది. సీరియస్‌గా సాగిపోయే కథలో తేజ్ కూరపాటి, దినేష్ తేజ్ కాంబినేషనల్‌లోని సీన్లు ఫీల్‌గుడ్‌గా మారుతాయి.

ప్రియా వడ్లమాని, దీక్ష గ్లామర్

ప్రియా వడ్లమాని, దీక్ష గ్లామర్

హీరోయిన్లలో ప్రియా వడ్లమాని పూర్తిగా మార్కులు కొట్టేసింది. బోల్డ్‌గా కనిపించి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అమెరికా మోజులో ఉండే యువతకు ప్రియా వడ్లమాని పాత్ర సాక్ష్యంగా నిలిచింది. ఈ పాత్రలో ప్రియ ఒదిగిపోయింది. ఇక మరో హీరోయిన్ దీక్ష నగర్కార్‌ నేటితరం అమ్మాయికి నిదర్శనంగా కనిపిస్తుంది. కెరీర్, ప్రేమకు కట్టుబడి ఉండే పాత్రలో దీక్ష మెరిసింది. పెద్దగా గుర్తింపులేని పాత్రలో హేమల్ కనిపించింది.

రాహుల్ రామకృష్ణ పెర్ఫార్మెన్స్

రాహుల్ రామకృష్ణ పెర్ఫార్మెన్స్

ఇక హుషారు సినిమాలో రాజు బొల్లంగా రాహుల్ రామకృష్ణ తనదైన శైలిలో నటించాడు. ఫ్రస్టేటెడ్ యువకుడిగా తన నటనలోని మార్కును చాటుకొన్నాడు. రాహుల్ రామకృష్ణ ఫెర్ఫార్మెన్స్ సెకండాఫ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. పిచాక్ పాటలో రాహుల్ సందడి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం.

సినిమాటోగ్రఫి అదుర్స్

సినిమాటోగ్రఫి అదుర్స్

హుషారు సాంకేతిక విభాగంలో సినిమాటోగ్రఫి పెద్ద పీట వేసింది. అర్జున్ రెడ్డి ఫేం రాజు తోట సినిమాలోని ప్రతీ ఫ్రేమ్‌ను అందంగా మలిచాడు. కీలక సన్నివేశాల్లో తోట రాజు వాడుకొన్న లైటింగ్, కలర్ ప్యాటెర్న్ తెర మీద అందంగా కనిపించింది. ఉండిపోరాదే పాటను చిత్రీకరించిన విధానం సూపర్‌గా ఉంది. ఎమోషనల్ సీన్లను అద్భుతంగా తెర మీద పండించాడు. ప్రతీ సీన్ చాలా రిచ్‌గా కనిపించాయి.

రాధాన్ మ్యూజిక్

రాధాన్ మ్యూజిక్

ఇక హుషారు సినిమాకు అర్జున్ ఫేం రాదాన్ అందించిన మ్యూజిక్ వెన్నముక లాంటింది. ఉండిపోరాదే, నా నా నా, పిచాక్ పాటలు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. మిగితా పాటలు కూడా సందర్భోచితంగా బాగున్నాయి. ఇంపార్టెంట్ సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

ప్రొడక్షన్ వ్యాల్యూస్

ప్రొడక్షన్ వ్యాల్యూస్

సినిమా చూపిస్త మావ, నేను లోకల్ లాంటి చిత్రాలను రూపొందించిన నిర్మాత బెక్కెం వేణుగోపాల్ హుషారు సినిమాను రూపొందించారు. పక్కగా యూత్‌ను టార్గెట్ చేసే కథను చాలా ట్రెండీగా తెరకెక్కించారు. రాధాన్ మ్యూజిక్, రాజు తోట సినిమాటోగ్రఫి లాంటి సాంకేతిక విభాగాల ఎంపిక సినిమాపై ఆయనకు ఉన్న అభిరుచిన తెలియజెప్పాయి. హుషారు సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ లక్కీ మీడియా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

ఫ్రెండ్‌షిప్, లవ్, ఫన్, ఎమోషనల్ లాంటి అంశాలతో మేలవించిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ హుషారు. బాధ్యతారహిత్యంగా ఉంటే జీవితంలో ఎలాంటి కష్టాలు వస్తాయో అనే పాయింట్‌ను చక్కగా చెప్పారు. మూస ధోరణి‌ చదువుల చట్రంలో విద్యార్థులు నలిగిపోకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమకు ఇష్టమైన పనిచేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో అనే విషయాన్ని ఓ సందేశంగా చెప్పారు. ప్రస్తుత విద్యావ్యవస్థ తీరును విద్యార్థులకు, తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించేలా హుషారును తెరకెక్కించారు. యూత్‌తోపాటు ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా చూసే చిత్రంగా హుషారు ఉంటుంది.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

ప్లస్ పాయింట్స్
కథ, కథనం
నటీనటులు ఫెర్ఫార్మెన్స్
ప్రియా వడ్లమాని గ్లామర్
దర్శకుడి టేకింగ్
ప్రొడక్షన్ వ్యాల్యూస్
రాజు తోట సినిమాటోగ్రఫి
రాధాన్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్
రొటీన్ సీన్లు
హ్యపీ డేస్ లాంటి సినిమాల ప్రభావం
స్లో నేరేషన్

తెర ముందు, తెర వెనుక

తెర ముందు, తెర వెనుక

నటీనటులు: తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, అభినవ్ మేడిశెట్టి, దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్
దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, రియాజ్
సంగీతం: రాధాన్
సినిమాటోగ్రఫి: రాజు తోట
బ్యానర్: లక్కీ మీడియా
రిలీజ్ డేట్: 2018-12-14

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X