twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైదరాబాద్ లవ్ స్టోరి మూవీ రివ్యూ: ఆకట్టుకునే పాయింట్‌తో..

    By Rajababu
    |

    Recommended Video

    Hyderabad Love Story Movie Review హైదరాబాద్ లవ్ స్టోరి మూవీ రివ్యూ

    Rating:
    2.5/5
    Star Cast: రాహుల్ రవీంద్రన్, రేష్మీ మీనన్, జియా, రావు రమేష్
    Director: రాజ్ సత్య

    యువతరం నటుల్లో టాలెంట్ హీరోగా రాహుల్ రవీంద్రన్‌ పేరు తెచ్చుకొన్నాడు. తన తొలిచిత్రం అందాల రాక్షసితోనే ఆకట్టుకొన్నాడు. సాఫ్ట్ క్యారెక్టర్లు, లవర్ బాయ్‌ పాత్రలతో రాహుల్ తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. హీరోయిన్లు రేష్మీ మీనన్, జియాతో కలిసి రాహుల్ రవీందన్ నటించిన తాజా చిత్రం హైదరాబాద్ లవ్‌స్టోరీ. కొత్త దర్శకుడు రాజ్ సత్య డైరెక్షన్‌లో ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ రూపొందించిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రాయాంగిల్ లవ్‌స్టోరిగా ఈ చిత్రం తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    హైదరాబాద్ లవ్‌స్టోరీ కథ

    హైదరాబాద్ లవ్‌స్టోరీ కథ

    భాగీ అలియాస్ భాగ్యలక్ష్మి (రేష్మీ మీనన్) చలాకైన యువతి. మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో కార్తీక్ (రాహుల్ రవీంద్రన్) ఇంజినీర్‌గా పని చేస్తుంటాడు. తొలిచూపులోనే కార్తీక్, భాగీ ప్రేమలో పడుతారు. భాగీతో ప్రేమలో పడటానికి ముందే కార్తీక్‌కు వైష్ణవి (జియా) అనే యువతితో బ్రేకప్ అవుతుంది. కార్తీక్‌తో పీకల్లోతూ ప్రేమలో మునిగిన భాగీకి వైష్ణవి ఓ భయంకరమైన విషయాన్ని చెబుతుంది. దాంతో కార్తీక్, భాగీకి మధ్య మనస్పర్ధలు వస్తాయి.

    ముగింపు ఇలా..

    ముగింపు ఇలా..

    కార్తీక్ గురించి భాగీకి వైష్ణవి చెప్పిన భయంకరమైన విషయం ఏమిటి? కార్తీక్, వైష్ణవి మధ్య అఫైర్ ఎందుకు బ్రేకప్ అయింది? కార్తీక్, వైష్ణవి మళ్లీ కలుసుకొన్నారా? కార్తీక్, భాగీ ప్రేమకు ముగింపు ఏమిటీ? కార్తీక్ జీవితంలో అలీ అనే యువకుడి పాత్ర ఏమిటీ? కథలో రావు రమేష్ ఏ విధంగా కీలకంగా మారాడు అనే ప్రశ్నలకు తెరమీద సమాధానమే హైదరాబాద్ లవ్‌ స్టోరీ.

     కథ, స్రిప్టు విశ్లేషణ-1

    కథ, స్రిప్టు విశ్లేషణ-1

    రాహుల్ రవీంద్రన్, రేష్మీ తొలిసారి కలుసుకోవడం, ఆ తర్వాత ప్రేమలో పడటం అనే అంశంతో కథ ప్రారంభమవుతుంది. రాహుల్, రేష్మీ మధ్య ప్రేమ, ఆకర్షణ అంశాలతో లవ్ ట్రాక్‌ను దర్శకుడు రాజ్ సత్య ఆహ్లాదంగా కొనసాగిస్తూనే, దానికి కామెడీ ట్రాక్‌ను మిక్స్ చేశాడు. అయితే కామెడీ ట్రాక్ నాసిరకంగా ఉండటం కారణంగా కథావేగం, స్టోరిలోని ఇంటెన్సిటీని పక్కదారి పట్టించేలా చేసింది. ఓ ఆసక్తికరమైన పాయింట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.

    కథ, స్రిప్టు విశ్లేషణ-2

    కథ, స్రిప్టు విశ్లేషణ-2

    సెకండాఫ్‌లో జియాతో కార్తీక్ లవ్ ట్రాక్, కార్తీక్, రేష్మీల ప్రేమ వ్యవహారం ఎపిసోడ్స్ ఫీల్‌గుడ్‌గా అనిపిస్తాయి. ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్ పర్సనల్ లైఫ్ బ్యాక్ డ్రాప్ కీలకమైన అంశంగా మారుతుంది. కథ మొత్తం రాహుల్ వ్యక్తిగత జీవితం చూట్టే తిరగడంతో కథ మరొ మెట్టు ఎక్కినట్టు కనిపిస్తుంది. క్లైమాక్స్‌లో భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. ఫీల్‌గుడ్ నోట్‌తో హైదరాబాద్ లవ్‌స్టోరీ ముగుస్తుంది.

     దర్శకుడు రాజ్ సత్య తడబాటు

    దర్శకుడు రాజ్ సత్య తడబాటు

    దర్శకుడు రాజ్ సత్య ఎంచుకొన్న ప్రధానమైన పాయింట్ బాగుంది. కాకపోతే ఆ మెయిన్ పాయింట్ చుట్టు అల్లుకొన్న కామెడీ ట్రాక్ విషయంలోనే తడబాటుకు గురయ్యాడు. నాసిరకమైన కామెడీతో వెగటు పుట్టించాడు. సినిమా తొలిభాగంపై దర్శకుడు పట్టుకోల్పోయినాడనే భావన కలుగుతుంది. కాకపోతే సెకండాఫ్‌లో తనదైన టేకింగ్‌తో కొత్త దర్శకుడు అనే ఫీలింగ్ ఎక్కడా కనిపించదు. కీలక సన్నివేశాల్లో తనదైన ప్రతిభను చాటుకొన్నాడు. కథపై, కామెడీ ట్రాక్‌పై మరింత కసరత్తు చేసి ఉంటే ఫీల్‌గుడ్ సినిమా తన కెరీర్‌లో పడి ఉండేది.

     ఆకట్టుకొన్న రాహుల్ రవీంద్రన్

    ఆకట్టుకొన్న రాహుల్ రవీంద్రన్

    లవర్ బాయ్ క్యారెక్టర్లలో రాహుల్ రవీంద్రన్ నటన ప్రత్యేకంగా కనిపిస్తుంది. అతడి హావభావాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ సినిమాలో తండ్రి చనిపోయిన సన్నివేశంలోనూ, తన మిత్రుడు కోమాలోకి వెళ్లిపోయే సీన్‌లో భావోద్వేగమైన నటనను ప్రదర్శించాడు. తన పాత్ర పరిధి మేరకు రాహుల్ మంచి నటనతో ఆకట్టుకొన్నాడు.

    రేష్మీ మీనన్ గ్లామర్

    రేష్మీ మీనన్ గ్లామర్

    హైదరాబాద్ లవ్‌స్టోరి సినిమాకు రేష్మీ మీనన్ గ్లామర్ అదనపు ఆకర్షణ. చక్కటి నవ్వుతో, మంచి ఎక్స్‌ప్రెషన్స్‌తో అద్భుతంగా కనిపించింది. కీలక సన్నివేశాల్లోనూ మెప్పించింది. నటనపరంగా మరింత శ్రద్ధ తీసుకొంటే గ్లామర్‌తోపాటు ప్రతిభవంతురాలైన నటిగా పేరుతెచ్చుకొనే అవకాశం ఉంది.

    జియా అందాల ఆరబోత

    జియా అందాల ఆరబోత

    కార్తీక్‌కు మరో లవర్‌గా జియా కనిపించింది. గ్లామర్‌‌తోనే కాకుండా అందాల ఆరబోతలో కూడా జియా ముందున్నట్టు కనిపించింది. జియా నటనకు కూడా మంచి స్పందనే కనిపించింది. కీలక సన్నివేశాల్లో కొంత తడబాటు కనిపించింది.

     మరోసారి రావు రమేష్

    మరోసారి రావు రమేష్

    ఇతర పాత్రల్లో గుర్తుండిపోయే రోల్ రావు రమేష్‌ది. డాక్టర్ పాత్రలో తన మార్కును వదలిపెట్టలేదు. కథకు ఆయువుపట్టుగా మారిన సీన్లకు రావు రమేష్ జీవంపోశాడు. సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. సూర్య, సనలు ఆకట్టుకొన్నారు. హాస్య నటులు మాత్రం విసుగు పుట్టించారు. సినిమాకు ప్రతిబంధకంగా మారారు.

    ఆహ్లాదంగా సినిమాటోగ్రఫీ

    ఆహ్లాదంగా సినిమాటోగ్రఫీ

    ఈ సినిమాకు బీవీ అమర్నాథ్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ ప్లస్ అయింది. చాలా రిచ్‌గా సీన్లను తెరకెక్కించడంలో అమర్నాథ్‌రెడ్డి సఫలమ్యాయాడు. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ పనితీరు బాగున్నది. తన కత్తెరకు వర్మ ఇంకా పదునుపెట్టి ఉంటే సినిమా చాలా క్రిస్ప్‌గా ఉండేది. సునీల్ కాశ్యప్ రీరికార్డింగ్ బాగుంది. పాటలు బాగున్నప్పటికీ మాస్ ప్రేక్షకులకు, యూత్‌కు చేరేలా లేవనిపిస్తుంది.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ఆసక్తికరమైన పాయింట్‌తోపాటు మత సామరస్యం లాంటి అంశాలను టచ్ చేస్తూ నిర్మాతలు ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొదుమగుళ్ళ చేసిన ప్రయత్నం అభినందనీయం. కాకపోతే కథనం విషయంలో కొంత జాగ్రత్తపడి ఉండే మంచి సినిమాను అందించిన పేరు వచ్చేంది. అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనిపించింది. సినిమాపై నిర్మాతలకు ఉన్న అభిరుచి ప్రశంసనీయం అని చెప్పవచ్చు.

     ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    రొటీన్ ప్రేమ కథ కాకుండా ఓ డిఫరెంట్ పాయింట్‌తో హైదరాబాద్ లవ్‌స్టోరి రూపొందింది. నటీనటులు పెర్ఫార్మెన్స్, సాంకేతిక నిపుణుల ప్రతిభ ఈ సినిమాకు బలం అని చెప్పవచ్చు. కాకపోతే కామెడీ సన్నివేశాలు చికాకు పుట్టిస్తాయి. ఎలాంటి అంచనాలు లేకుండా కాలక్షేపానికి వెళితే సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.

     బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్

    • రాహుల్ రవీంద్రన్, రేష్మీ నటన
    • కథ
    • సినిమాటోగ్రఫీ
    • ప్రొడక్షన్ వ్యాల్యూస్
    • మైనస్ పాయింట్

      • కామెడీ
      • కథనం
      • డైలాగ్స్
      • తెర ముందు, తెర వెనుక

        తెర ముందు, తెర వెనుక

        నటీనటులు: రాహుల్ రవీంద్రన్, రేష్మీ మీనన్, జియా, రావు రమేష్, అంబటి, రమాప్రభ, షఫీ, సన, సూర్య, రచ్చ రవి తదితరులు
        కథ, డైలాగ్స్ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం: రాజ్ సత్య
        నిర్మాతలు: ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొదుమగుళ్ళ
        సినిమాటోగ్రఫీ: బీవీ అమర్నాథ్‌రెడ్డి
        ఎడిటర్ : ఎం ఆర్ వర్మ
        మ్యూజిక్ : సునీల్ కశ్యప్
        సమర్పణ: మాస్టర్ ప్రణవ్ తేజ్
        బ్యానర్ : సినిమా పీపుల్
        రిలీజ్ డేట్: ఫిబ్రవరి 23, 2018

    English summary
    Hyderabad love story movie is releasing on February 23rd. This movie is directed by Raj Satya. Producers are ML Raju, RS Kishan, Venu Kodumagulla. Lead actors are Rahul Ravindran, Reshmi Menen. Hyderabad love story movie review brings Telugu Filmibeat brings review exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X