I, Nobody Pre Release Review: ఐ నోబడీ మలయాళ మూవీ ప్రీ రిలీజ్ రివ్యూ

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ఐ నోబడీ (I, Nobody). ఈ చిత్రంలో పార్వతి తిరువోతు హీరోయిన్‌గా నటిస్తున్నారు. హకీం షాజహాన్, అశోకన్, విజయ్ రాఘవన్, మధుపాల్, శంకర్ రామకృష్ణన్, నక్షత్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నిషమ్ బషీర్ దర్శకత్వం వహించారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, E4 ఎక్స్‌పెరిమెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను సుప్రియా మీనన్, ముఖేష్ ఆర్ మెహతా, సీవీ సారథి నిర్మించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: దినేష్ పురుషోత్తమన్, ఎఢిటర్: రమీజ్ ఎంబీ, మ్యూజిక్: జేక్స్ బిజోయ్, కథ: సమీర్ అబ్దుల్, క్యాస్టూమ్: ధన్య బాలకృష్ణన్, ఆర్ట్: అర్షద్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూలై 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ ఏమిటి? రిలీజ్‌కు ముందు ఈ చిత్రంపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

I Nobody Pre Release Review

రాజీవన్ అలియాస్ రాజు (పృథ్వీరాజ్ సుకుమారన్) ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో భారీగా బ్యాంకు దోపిడీకి పాల్పడటం ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించారనే ఆరోపణలు చుట్టుముడుతాయి. ఈ క్రమంలో రాజును మాఫియా ఓ పక్క, పోలీసులు మరో పక్క వెంటాడటం మొదలుపెడుతారు. పోలీసుల విచారణ, మాఫియా దాడుల నేపథ్యంలో తన కుటుంబానిిక రక్షించుకోవడానికి హింసాత్మక మార్గాన్ని ఎంచుకొంటాడు. భార్య (పార్వతి) నుంచి కూడా సహకారం అందకపోగా, అతడిని అపార్థం చేసుకొంటుంది. దాంతో మూడు రకాల సమస్యలు రాజు ముందుంటాయి.

అసలు రాజు నేరస్థుడేనా? లేక పరిస్థితుల ప్రభావంతో పద్మవ్యూహంలో చిక్కుకొన్న అమాయకుడా? బ్యాంక్ దోపిడికి రాజు పాల్పడ్డారా? మాఫియా అతడిని ఎలా వెంటాడాడు? పోలీసుల విచారణ ఎలా సాగింది? రాజును భార్య ఎందుకు అపార్థం చేసుకొన్నది? భార్య నుంచి రాజుకు ఎదురైన ప్రతికూల పరిస్థితులు ఏమిటి? బ్యాంక్ దోపిడి కుట్ర వెనుక ఉన్న అసలు నిజం ఏమిటి? అనే ప్రశ్నలకు ఉత్కంఠభరితమైన ప్రశ్నలకు సమాధానమే ఐ, నోబడీ సినిమా కథ.

బ్యాంక్ హీస్ట్, క్రైమ్, మిస్టరీ, యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ఉత్కంఠభరితమైన కథ ఆడియెన్స్‌ను కట్టిపడేసేలా ఉంటుంది. వేగవంతమైన స్క్రీన్‌ప్లే, పాత్రల డిజైన్ దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, ఫ్యామిలీ సెంటిమెంట్ సరికొత్తగా ఉండటమే కాకుండా కొత్త అనుభూతికి లోనయ్యేలా చేస్తాయి. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుందనే గ్యారెంటీని చిత్ర యూనిట్ ఇస్తున్నది.

ఐ నోబడి సినిమా భావోద్వేగాలు, సస్పెన్స్, యాక్షన్ అంశాలను సమపాళ్లలో మేళవించిన ఈ చిత్రం. ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసేలా సన్నివేశాలతో రూపొందించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు తమ కెరీర్‌లో పెర్ఫార్మెన్స్‌తో మరోసారి ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు నిస్సాం బషీర్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అనే ఫీడ్ బ్యాక్ రిలీజ్‌కు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. జూలై 9వ తేదీన మలయాళం, తెలుగులో ప్రీమియర్లు ప్రదర్శించనున్నారు. ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్, ఎక్స్‌క్లూజివ్ రివ్యూ ఇతర కథనాల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X