I, Nobody First Review: ఐ నోబడీ మలయాళ మూవీ ఫస్ట్ రివ్యూ
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ఐ నోబడీ (I, Nobody). ఈ చిత్రంలో పార్వతి తిరువోతు హీరోయిన్‌గా నటిస్తున్నారు. హకీం షాజహాన్, అశోకన్, విజయ్ రాఘవన్, మధుపాల్, శంకర్ రామకృష్ణన్, నక్షత్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నిషమ్ బషీర్ దర్శకత్వం వహించారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, E4 ఎక్స్‌పెరిమెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను సుప్రియా మీనన్, ముఖేష్ ఆర్ మెహతా, సీవీ సారథి నిర్మించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: దినేష్ పురుషోత్తమన్, ఎఢిటర్: రమీజ్ ఎంబీ, మ్యూజిక్: జేక్స్ బిజోయ్, కథ: సమీర్ అబ్దుల్, క్యాస్టూమ్: ధన్య బాలకృష్ణన్, ఆర్ట్: అర్షద్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూలై 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాకు లభించిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైమ్ ఎంత? ఈ సినిమా సెన్సార్ తర్వాత వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రాజీవన్ అలియాస్ రాజు (పృథ్వీరాజ్ సుకుమారన్) ప్రభుత్వ ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలతో మధ్య తరగతి కుటుంబ జీవితాన్ని లీడ్ చేస్తూ సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటాడు. జీవితం మీద ఆశపెరగడంతో డబ్బు సంపాదనపై దృష్టిపడుతుంది. ఈ క్రమంలో బ్యాంకులో జరిగిన భారీ కుంభకోణం నేపథ్యంలో తీవ్రమైన ఆరోపణలను రాజు ఎదుర్కొంటాడు. లెక్కకు అందని డబ్బు విషయం బయటకు పొక్కడంతో రాజు వెంట పోలీసులు, మాఫియా పడుతారు. రాజు కుటుంబం మాఫియా దాడులకు గురవుతుంది. రాజుకు భారీ కుంభకోణంతో ఎలాంటి సంబంధం ఉంది? మాఫియా, పోలీసులు వెంటపడటంతో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. రెండు వర్గాల నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకొన్నారు. భారీ కుంభకోణానికి ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఐ నోబడి సినిమా కథ.
బ్యాంక్ హీస్ట్ నేపథ్యంగా రూపొందిన క్రైమ్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) వీక్షించారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, వాటిలో ఉన్న డైలాగ్స్ విషయంలో స్వల్ప అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ మేరకు చిత్ర యూనిట్‌కు కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. సెన్సార్ సూచనలు, సలహాలపై స్పందించిన చిత్ర యూనిట్ కొన్నింటికి వివరణ ఇచ్చారు. మరికొన్ని వాటికి మార్పులు చేశారు. దాంతో సంతృప్తి చెందిన సెన్సార్ ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
యాక్షన్, క్రైమ్ డ్రామా, కుటుంబ భావోద్వేగాలతో సాగే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ (UA13+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం.. 13 ఏళ్లకు పైబడిన వారందరూ ఈ సినిమాను ఎలాంటి అభ్యంతరం లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుందని సెన్సార్ నిబంధనల్లో పేర్కొన్నారు. యాక్షన్, ఫ్యామిలీ, క్రైమ్ డ్రామా కావడంతో ఈ సినిమా కథ డిమాండ్ మేరకు రెగ్యులర్ రన్ టైమ్ కంటే.. నిడివి కాస్త పెరిగింది. ఈ చిత్రం నిడివి 2 గంటల 48 నిమిషాలు అంటే.. 168 నిమిషాల రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు.
సెన్సార్ రిపోర్ట్ తర్వాత.. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. పృథ్వీ రాజ్ సుకుమారన్ పెర్ఫార్మెన్స్ గురించి ఎక్కువగా డిస్కషన్ జరుగుతున్నది. ముఖంగా నిషమ్ బషీర్ స్క్రీన్ ప్లే హైలెట్‌గా ఉంటుంది. పృథ్వీరాజ్‌కు పార్వతి సన్నివేశాలు, ఆమె యాక్టింగ్ ఈ సినిమా కథను ఎలివేట్ చేస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ గ్రిప్పింగ్‌గా సాగుతాయి. ఎమోషన్స్ పూర్తిగా వర్కవుట్ అయ్యాయి అనే టాక్ వినిపిస్తున్నది. ఈ సినిమా గురించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications