twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ichata Vahanamulu Nilupa Radu review: ఆకట్టుకోలేకపోయిన మర్డర్ మిస్టరీ

    |

    Rating:
    2.0/5

    అక్కినేని బ్రాండ్ వేసుకొని సినీ కెరీర్ ప్రారంభించిన సుశాంత్ గ్రాఫ్ ఎగుడుదిగుడుతో సాగిపోతున్నది. చిలసౌ, అల వైకుంఠపురంలో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొన్న తర్వాత ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో సుశాంత్‌ హీరోగా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిఫరెంట్ టైటిల్‌తో అంచనాలు పెంచిన సుశాంత్‌కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందించిందనే విషయాన్ని తెలుసుకొనేందుకు కథ, కథనాలను, నటీనటులు ప్రతిభను సమీక్షించుకొందాం..

    కథ ఏమిటంటే..

    కథ ఏమిటంటే..

    డిజైన్ స్టూడియోలో అర్కిటెక్ట్‌గా పనిచేసే అరుణ్ (సుశాంత్) అదే కంపెనీలో పనిచేసే మీనాక్షి (మీనాక్షి చౌదరీ)తో ప్రేమలో పడుతాడు. మీనాక్షి సోదరుడు నర్సింగ్ యాదవ్ (వెంకట్) ఓ కాలనీలో చిన్నపాటి లీడర్‌గా ఉంటారు. అదే ఏరియాలో మీనాక్షిని కలువడానికి వెళ్లిన అరుణ్ ఓ చోట నో పార్కింగ్ బోర్డు ఉన్న ప్రాంతంలో బైక్ పార్క్ చేస్తాడు. ఆ సమయంలోనే టెలివిజన్ నటి హత్య జరుగడం, ఆ హత్యా నేరం అరుణ్‌పై పడటం జరుగుతుంది.

    ఇచ్చట వాహనములు నిలుపరాదులో ట్విస్టులు

    ఇచ్చట వాహనములు నిలుపరాదులో ట్విస్టులు

    టెలివిజన్ నటి హత్య ఎందుకు జరుగుతుంది? ఆ నేరం అరుణ్‌పైనే ఎందుకు పడింది. నటి హత్యకు కారణం ఎవరు? నటిని ఎందుకు హత్య చేశారు? అరుణ్‌ను ఈ కేసు నుంచి బయట పడేసేందుకు వచ్చిన పులి (ప్రియదర్శి) కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? ఈ హత్యా నేరం నుంచి అరుణ్ బయటపడ్డారా? మీనాక్షి, అరుణ్ ప్రేమకు ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా కథ.

    సినిమా ఫస్టాఫ్ ఎలా ఉందంటే

    సినిమా ఫస్టాఫ్ ఎలా ఉందంటే


    ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంలో అరుణ్, మీనాక్షి ప్రేమ కథతోనే ఎక్కువగా తొలి భాగం గడిచిపోతుంది. కాలనీలో జరిగే రాజకీయాల వల్ల అరుణ్ జీవితం కష్టాల్లో పడటం ఆసక్తిగా కనిపిస్తుంది. కానీ ఆ పాయింట్‌ను పూర్తిస్తాయిలో ప్రేక్షకుడిని మెప్పించలేకపోవడంతో సినిమా తేలిపోయిందనిపిస్తుంది. స్నేహపురి కాలనీలో మర్డర్ జరగడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది.

    సెకండాఫ్ పరిస్థితి ఏమిటంటే..

    సెకండాఫ్ పరిస్థితి ఏమిటంటే..

    కథను సాగదీసి ఇంటర్వెల్ సమయానికి గానీ అసలు స్టోరీలోకి వెళ్లడం మైనస్‌గా మారిందని చెప్పవచ్చు. ఇక కథలో భూషణ్ (రవివర్మ), సీఐ రుద్ర (కృష్ణ చైతన్య), సుక్కు (వెన్నెల కిషోర్) పాత్రలు కూడా బలంగా లేకపోవడం మైనస్‌గా మారుతాయి. వల్ల సాదాసీదాగా సాగడం ప్రేక్షకుడి సహనానికి పరీక్షలా మారుతుంది. సెకండాఫ్‌లో ఎక్సైటింగ్ అంశాలు లేకపోవడం ప్రీ క్లైమాక్ష్ నుంచి ముగింపు వరకు సాగదీత కొనసాగడంతో సినిమా పరిస్థితి కథ కంచికే అనిపిస్తుంది.

    దర్శకుడు పనితీరు గురించి

    దర్శకుడు పనితీరు గురించి

    దర్శకుడు దర్శన్ ఎంచుకొన్న పాయింట్‌ మంచిదే కానీ.. దానిని ప్రేక్షకులకు వినోదంగా, ఉత్తేజంగా చెప్పడంలో విఫలమయ్యారు. పలు సన్నివేశాల్లో డ్రామా ఎక్కువైనట్టు కనిపిస్తుంది. రకరకాల క్యారెక్టర్లను జొప్పించి అసలు విషయాన్ని సాగదీయడం సినిమాకు మైనస్‌గా మారిందని చెప్పవచ్చు. ఫస్టాఫ్‌పై దర్శన్ కొంత పట్టు సాధించనట్టు కనిపిస్తాడు. సెకండాఫ్‌లో తన కంట్రోల్ తప్పడంతో తడబాటుకు గురయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది.

    సుశాంత్, మీనాక్షి ఎలా చేశారంటే

    సుశాంత్, మీనాక్షి ఎలా చేశారంటే

    ఇక నటీనటుల విషయానికి వస్తే.. చిలసౌ చిత్రంతో నటుడిగా మంచి మార్కులు సంపాదించుకొన్న సుశాంత్.. అల వైకుంఠపురంలో చిత్రంతో మరింత ఆకట్టుకొన్నాడు. ఇలాంటి నేపథ్యంలో సుశాంత్‌ను ఎక్కువగానే ఆశిస్తే.. ఆ అంచనాలు చేరుకోలేకపోవడం కాస్త నిరాశే అనిపిస్తుంది. కథ, కథనాలు సరిగా లేకపోవడం వల్ల సుశాంత్ మ్యాజిక్ చేయలేకపోయాడు. అయితే తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడని చెప్పవచ్చు. ఇక మీనాక్షి చౌదరీ గ్లామర్‌తోనే ఆకట్టుకొన్నది. సుశాంత్‌తో మీనాక్షి మంచి కెమిస్ట్రీని పండించింది.

    మిగితా క్యారెక్టర్లలో నటీనటులు

    మిగితా క్యారెక్టర్లలో నటీనటులు

    మిగితా క్యారెక్టర్ల విషయానికి వస్తే.. చాలా రోజుల తర్వాత వెంకట్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆయన పాత్ర కమ్ బ్యాక్ రేంజ్‌లో లేకపోవడం కొంచెం అసంతృప్తిగానే అనిపిస్తుంది. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, రవివర్మ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు. వీరంతా అక్కడక్కడా నవ్వుల పువ్వులు పూయించారు.

    సాంకేతిక విభాగాల పనితీరు. .

    సాంకేతిక విభాగాల పనితీరు. .


    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఎమ్ సుకుమార్ సినిమాటోగ్రఫి బాగుంది. ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయి. ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌కు ఇంకా చేతినిండా పని ఉందనిపిస్తుంది. ఇక నిర్మాణ విలువల విషయానికి వస్తే చక్కగా ఉన్నాయి. నటీనటులు ఎంపిక బాగుంది.. కానీ కథ, కథనాలపై మరింత కసరత్తు చేస్తే సినిమాకు మరింత న్యాయం జరిగి ఉండేదనిపిస్తుంది.

    ఫైనల్‌గా ఎలా ఉందంటే..

    ఫైనల్‌గా ఎలా ఉందంటే..

    రొమాన్స్, కామెడీ, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాల కలయికతో రూపొందిన చిత్రం ఇచ్చట వాహనములు నిలుపరాదు. అయితే కథ, కథనాలు పేలవంగా ఉండటంతో ఈ చిత్రం ఉడికి ఉడకని వంటకంలా అనిపిస్తుంది. ప్రతిభావంతులైన నటులు ఉన్నా సినిమాను నిలబెట్టలేకపోయారనే అసంతృస్తి కనిపిస్తుంది. ఎన్నో అంచనాలతో, భారీ ప్రమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈ చిత్రం థియేటర్లలో అంతగా మెప్పించలేకపోయిందని చెప్పవచ్చు. ఏమీ తోచకపోతే కాలక్షేపం కోసం ఈ సినిమాకు వెళ్లవచ్చు.

    Recommended Video

    Ichata Vahanamulu Nilupa Radu Teaser
    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు


    నటీనటులు: సుశాంత్, మీనాక్షి చౌదరీ, వెన్నెల కిషోర్, అభినవ్ తదితరులు
    దర్శకుడు: ఎస్ దర్శన్
    నిర్మాతలు: రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల
    మ్యూజిక్ డైరెక్టర్: ప్రవీణ్ లక్కరాజు
    సినిమాటోగ్రఫి: బృంద, రాజ్ కృష్ణ
    ఎడిటర్: గ్యారీ బీహెచ్
    బ్యానర్: ఏఐ స్టూడియోస్ అండ్ షాస్త్రా మూవీస్
    రిలీజ్ డేట్: 2021-0/8-27

    English summary
    Ichata Vahanamulu Nilupa Radu is romantic, Action Thriller. This movie hits the screen on August 27th. Here is the exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X