For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇద్దరి లోకం ఒకటే మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  2.5/5
  Star Cast: రాజ్ తరుణ్, షాలినీ పాండే, నాజర్, రోహిణి తదితరులు
  Director: జీఆర్ కృష్ణ

  ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ లాంటి వరుస హిట్లతో దూసుకుపోయిన యంగ్ హీరో రాజ్ తరుణ్. అయితే గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేక వెనుకబడిపోయాడు ఈ యంగ్ హీరో. మరో వైపు అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో పరిచయమైన షాలినీ పాండేకు.. మళ్లీ ఇంత వరకు ఆ రేంజ్ క్యారెక్టర్ పడలేదు. ఇలాంటి స్థితిలో వీరిద్దరి కలయికలో ఇద్దరిలోకం ఒకటే అనే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ లాంటి చిత్రం నేడు (డిసెంబర్) విడుదలైంది. మరి ఈ చిత్రం ఇద్దరికి ఎలాంటి ఫలితాన్ని మిగిల్చిందన్నది ఓ సారి చూద్దాం.

  కథ

  కథ

  వర్ష (షాలినీ పాండే) తన తాతలా పెద్ద యాక్టర్ కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆమెను పెళ్లి చేసుకోవాలని రాహుల్ (రాజా సిరివెన్నెల) మూడేళ్లుగా ఎదురుచూస్తూనే ఉంటాడు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. మహి (రాజ్ తరుణ్) ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌ అవుతాడు. అతను తన తండ్రి గుర్తుగా ఆయన తీసిన ఫోటోలన్నంటిని ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ పెడతాడు. అందులో తన చిన్ననాటి ఫోటోను చూసి వర్ష గుర్తుపడుతుంది. అక్కడి నుంచి మహికి, వర్షకు పరిచయం ఏర్పడుతుంది.

  కథలో ట్విస్టులు..

  కథలో ట్విస్టులు..

  మహి-వర్షల మధ్య ఉన్న గతం ఏంటి? వారి పుట్టుకకు ఉన్న సంబంధమేంటి? మహికి ఉన్న గుండె సంబంధిత వ్యాధితో చివరకు ఏమైంది? హీరోయిన్ కావాలని వర్ష కన్న కలలు నిజమయ్యాయా? చిన్నతనం నుంచి వర్ష జ్ఞాపకాలతోనే ఉన్న మహి చివరకు ఏమయ్యాడు? చివరకు వీరిద్దరి లోకం ఒకటే ఎలా అయింది? అనే అంశాలకు సమాధానమే ఈ కథ.

  ఫస్టాఫ్ అనాలిసిస్..

  ఫస్టాఫ్ అనాలిసిస్..

  మహి, వర్షల పుట్టుకకు సంబంధించి ఇంట్రడక్షన్ ఇవ్వడంతో వీరిద్దరి ప్రయాణంపై అందరికీ ఓ ఆసక్తిని ఏర్పరుస్తుంది. హీరోయిన్ కావాలని వర్ష ప్రయత్నించడం, తొక్కిన గడపల్లా ఆమెను తిరస్కరించడం లాంటి సీన్లతో ఫస్టాఫ్ అలా ముందుకు సాగుతుంది. ఆమెకు మహి పరిచయం అవడం, ఆపై సినిమాల్లో అవకాశం రావడంతో కథలో వేగం పెరిగినట్టు అనిపిస్తుంది. అయితే ఇలాంటి సీన్లు ఇప్పటికే చాలా చూసేశామనే ఫీలింగ్ కలిగే అవకాశముంది. ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్క కొత్త సీన్ పడ్డట్టు అనిపించకపోవడం మైనస్. అయితే కథలోని ఫీల్‌ను వర్ష-మహిలు పండించే ప్రయత్నం చేశారనిపిస్తుంది. తన ఆరోగ్యపరిస్థితి ఇంకా దిగజారడం.. అదే సమయంలో తన మనసులోని ప్రేమను చెప్పేందుకు మహి బయల్దేరడం లాంటి సీన్లతో ప్రథమార్థం ముగుస్తుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్ అందర్నీ మెప్పించే అవకాశముంది.

   సెకండాఫ్ అనాలిసిస్..

  సెకండాఫ్ అనాలిసిస్..

  తన పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకోవడానికి ఊటికి వెళ్లిన వర్ష కోసం.. మహి కూడా బయల్దేరడం లాంటి సీన్లతో ప్రథమార్థం గాడి తప్పినట్లు అనిపిస్తోంది. అక్కడ వర్ష-మహి మధ్య వచ్చే సీన్లు కొత్తగా లేకపోవడం మైనస్ అనుకుంటే.. అవి మరింత మెల్లగా సాగుతూ ప్రేక్షకుడికి సహన పరీక్షలా అనిపిస్తాయి. ఇక ఘాటు ముద్దు సీన్ల లెక్క కూడా ఎక్కువే అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా ఆసాంతం ఏ ఒక్క చోటా కొత్త సీన్ లేదే అన్న ఫీలింగ్ కలిగినా ఆశ్చర్యంలేదు. ప్రీ క్లైమాక్స్ వరకు కొంత ఫీల్‌ను లాక్కొచ్చినట్టు అనిపించినా.. చివరకు వచ్చే సరికి అది కూడా అంతగా కనెక్ట్ కాదేమోనన్న భావన కలుగుతుంది. అయితే క్లైమాక్స్‌ను కొంత భిన్నంగా తెరకెక్కించడం కలిసొచ్చే అంశం.

  దర్శకుడి పనితీరు..

  దర్శకుడి పనితీరు..

  ఓ స్వచ్చమైన, అందమైన, నిజాయితీతో కూడిన ప్రేమకథను ఈ కాలంలో తీయాలనుకున్న దర్శకుడు జీఆర్ క‌ృష్ణకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ట‌ర్కీ సినిమాకి రీమేక్ అయినా.. ఎక్కడా అలాంటి ఫీలింగ్ కలగదు. ఈ విషయంలో దర్శకుడి సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. అప్పుడెప్పుడో మణిరత్నం లాంటి దర్శకుడు క్లాసిక్ చిత్రాల మాదిరిగా.. తానూ ఓ గొప్ప ప్రేమకథ చిత్రాన్ని తీయాలనుకున్న తపన దర్శకుడిలో కనబడుతుంది. అయితే ఈ కథలో అంతటి ఫీల్ ఉన్నా.. ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఈ కథలోని పాయింటే చిన్నది కావడంతో ఎంతసేపు అక్కడే గింగిరాలు తిరిగినట్టు అనిపించడంతో ప్రేక్షకుడికి విసుగుపుట్టే అవకాశం ఉంది. ఈ విషయంలో దర్శకుడు తన ప్రతిభకు ఇంకాస్త పదును పెడితే బాగుండనిపిస్తుంది. మొత్తానికి ఓ అందమైన ప్రేమకథను తెరకెక్కించాలన్న దర్శకుడి ప్రయత్నం దాదాపు సఫలమైనట్టు కనిపిస్తోంది.

  నటీనటుల పర్ఫామెన్స్

  నటీనటుల పర్ఫామెన్స్

  ఇంతవరకు అల్లరి కుర్రాడి పాత్రలతో కనిపించిన రాజ్ తరుణ్.. ఈ సినిమాలో కాస్త పరిణితి చూపించాడు. అయితే డైలాగ్ డెలివరీ, డబ్బింగ్‌పై దృష్టి పెడితే ఇంకాస్త బాగుండేదేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. మహి పాత్ర తీరు ఎంత పొద్దికగా ఉంటుందో.. అతను మాట్లాడాలే మాటలు దానికి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తాయి. మొత్తానికి రాజ్ తరుణ్ నటనలో మెరుగు పడ్డట్టు కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ మరో పాత్ర వర్ష. ఇద్దరి లోకం ఒకటే కథ ఈ ఇద్దరి చుట్టే తిరగడం, ఈ ఇద్దరికే నటించే స్కోప్ ఉన్న పాత్రలకు దొరికాయి. అర్జున్ రెడ్డి తరువాత మళ్లీ ఆ రేంజ్ నటనను ఈ చిత్రంలో చూపించింది షాలినీ. మరో సారి తన అందంతో, నటనతో అందర్నీ కట్టిపడేసాలానే ఉంది. రాజా సిరివెన్నెల పాత్రకు ఉన్నవి కొన్ని సీన్లే అయినా.. చక్కగా నటించాడు. రోహిణి, నాజర్, భరత్ లాంటి వారు తమ పరిధి మేరకు బాగానే నటించారు.

  బలం బలహీనతలు

  బలం బలహీనతలు

  ప్లస్ పాయంట్స్

  రాజ్ తరుణ్, షాలినీ పాండే

  కథ

  మైనస్ పాయింట్స్

  స్లో నెరేషన్

  ఆసక్తికరంగా సాగని కథనం

  సాంకేతిక నిపుణుల పనితీరు..

  సాంకేతిక నిపుణుల పనితీరు..

  ఇలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు సంగీతం ప్రధాన బలంగా నిలుస్తాయి. ఈ చిత్రానికి కూడా మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం అందర్నీ ఆకట్టుకుంటాయి. ఇక సమీర్ రెడ్డి తన కెమెరా పనితనంతో ప్రతీ ఫ్రేమ్‌ను అందంగా మలిచాడు. ముఖ్యంగా హీరోహీరోయిన్లను మరింత అందంగా చూపించాడు. ఊటి అందాలను కెమెరాలో అద్భుతంగా బంధించేశాడు. ద్వితీయార్థంలోని కొన్ని సీన్లకు కత్తెర పడితే బాగుండేదన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆర్ట్ విభాగం, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

   నటీనటులు

  నటీనటులు

  నటీనటులు : రాజ్ తరుణ్, షాలినీ పాండే, నాజర్, రోహిణి తదితరులు

  దర్శకత్వం : జీఆర్ కృష్ణ

  నిర్మాత : దిల్ రాజు

  బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

  మ్యూజిక్ : మిక్కీ జే మేయర్

  సినిమాటోగ్రఫి : సమీర్ రెడ్డి

  ఎడిటింగ్ : తమ్మి రాజు

  రిలీజ్ డేట్ : 2019-12-25

  రేటింగ్ : 2.5/5

  ఫైనల్‌గా..

  ఫైనల్‌గా..

  ఓ అందమైన ప్రేమకథను చూడాలనుకునే వారికి ఇద్దరి లోకం ఒకటే నచ్చే అవకాశముంది. అయితే కమర్షియల్ ఫార్మాట్‌కు అలవాటు పడ్డ వారికి ఈ చిత్రం అంతగా ఎక్కకపోవచ్చు. ఈ చిత్రం కమర్షియల్ సక్సెస్ సాధిస్తుందా? అన్నది వేచి చూడాలి.

  English summary
  Iddari Lokam Okate is an Telugu language Love And Romantic Drama written and directed by G R Krishna. The film stars Raj Tarun And Shalini . This movie released on December 25, 2019.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X