Identity Movie Twitter Review: ఐడెంటిటీ మూవీ ట్విట్టర్ రివ్యూ.. త్రిషా కృష్ణన్, టోవినో పెర్ఫార్మెన్స్ అదుర్స్!

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్, మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ జంటగా నటించిన చిత్రం ఐడెంటిటీ. మలయాళ, తమిళ, కన్నడ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాకు అఖిల్ పాల్ దర్శకత్వం వహించారు. క్రైమ్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో వినయ్ రాయ్ కీలక పాత్రలో నటించారు. మలయాళంలో భారీ హిట్ సాధించిన ఈ సినిమాకు తెలుగులో భారీ బజ్ ఏర్పడింది. జనవరి 24వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై నెటిజన్లు సోషల్ మీడియాలో వెల్లడించిన అభిప్రాయాల్లోకి వెళితే..

క్లాత్ స్టోరీలో పనిచేసే అమర్ అనే వ్యక్తి.. ఆ దుకాణంలోకి వచ్చే మహిళలను చాటుగా వీడియోలు తీసి వారిని, వారి కుటుంబ సభ్యులను బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. ఓ రోజు ఈ విషయం తెలిసిన బాధితులు షాపుతోపాటు అమర్‌ను దహనం చేస్తారు. ఈ హత్య తర్వాత ఎన్ఎస్‌జీ కమాండో హరన్ శంకర్ (టొవినో థామస్), అలిషా (త్రిషా), అలెన్ ( వినయ్ రాయ్) జీవితాలను ఆ సంఘటన ఎలాంటి మలుపు తిప్పిందనే సినిమా కథ.

Identity Movie Twitter Review

ఐడెంటిటీ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 12 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కేరళలో భారీగానే వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా మూడు వారాల థియేట్రికల్ రన్‌లో మలయాళంలో 9 కోట్ల రూపాయలు నెట్, 18 కోట్ల రూపాయల గ్రాస్, తమిళంలో 1.5 కోట్ల రూపాయల నెట్, 3 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 26 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఐడెంటీటీ సినిమా గురించి ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఈ మూవీలో క్లైమాక్స్ చాలా అద్బుతంగా ఉంటుంది. ఫైట్ సీక్వెన్స్ హైలెట్‌గా ఉంటుంది. స్టంట్ కోరియోగ్రఫి అదిరిపోతుంది అని కామెంట్ చేశాడు. సినిమాలోని ఫైట్ సీక్వెన్స్‌ను ట్వీట్ చేశాడు.

ఐడెంటిటీ సినిమా ఆకట్టుకొనే అంశాలు ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్. టెక్నికల్‌గా అద్బుతంగా తీసిన మూవీ. ముఖ్యంగా యాక్షన్ సీన్లు హాలీవుడ్ రేంజ్‌లో ఉంటాయి. స్క్రీన్ ప్లే విషయంలో దెబ్బ పడింది. అయినా ఈ సినిమా థియేటర్లలోనే చూడటానికి పుష్కలంగా అంశాలు ఉన్నాయి అని నెటిజన్ కామెంట్ చేశాడు.

ఐడెంటిటీ సినిమాను చూశాను. చాలా థ్రిల్లింగ్‌కు గురయ్యాను. టొవినో థామస్ యాక్టింగ్ సూపర్బ్. త్రిషా కృష్ణన్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. వినయ్ రాయ్ విలన్‌గా అదరగొట్టాడు. కథ వావ్ అనిపించేలా ఉంటుంది. విమానంలో షూట్ చేసిన యాక్షన్ సన్నివేశాలు బ్రిల్లియెంట్‌గా ఉన్నాయి. ట్విస్టులు, టర్నులు మామూలుగా ఉండవు. క్లైమాక్స్ మరింత థ్రిల్లింగ్‌గా ఉంటుంది అని నెటిజన్ తన రివ్యూను చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X