twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Idhe Maa Katha movie review: శ్రీకాంత్, భూమిక చావ్లా ఎమోషనల్ పాత్రలతో.. సుమంత్, తాన్య హోప్ గ్లామర్ రైడ్

    |

    Rating 2.5/5

    నటీనటులు: సుమంత్‌ అశ్విన్‌, శ్రీకాంత్‌, భూమిక, తాన్య హోప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాజు, సమీర్, జబర్దస్త్ రాంప్రసాద్, సప్తగిరి తదితరుల
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గురు పవన్‌
    నిర్మాత: జీ మహేష్
    బ్యానర్: శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్
    మ్యూజిక్: సునీల్ కశ్యప్
    సినిమాటోగ్రఫి: రాంప్రసాద్
    ఎడిటింగ్: జునైద్ సిద్దిఖీ
    రిలీజ్ డేట్: 2021-10-02

     ఇదే మా కథ స్టోరి ఏమిటంటే..

    ఇదే మా కథ స్టోరి ఏమిటంటే..

    మహేంద్ర (శ్రీకాంత్) బైక్ రైడర్. చావు బతుకులతో పోరాడుతూ పాతికేళ్ల క్రితం ప్రేమకు దూరమైన ఆయన లద్దాఖ్‌కు బయలుదేరుతాడు. లక్ష్మీ (భూమిక) సాధారణ గృహిణి. మోటార్ రంగంలో కొత్త ఆవిష్కరణలు సాధించాలనే లక్ష్యం ఉన్న తన తండ్రి కోరికను భుజాన వేసుకొని, భర్తను కూడా ఎదురించి లక్ష్మీ లద్దాఖ్‌ బయలుదేరుతుంది. ప్రాణాల తెగించి సాహసం చేసే అజయ్ బైక్ రైడర్ (సుమంత్ అశ్విన్) ఛాంపియన్ షిప్ సాధించాలని లద్దాఖ్ బయలు దేరుతాడు. ప్రేమ పేరుతో మోసానికి గురైన మేఘన (తాన్యా హోప్) తన బైక్ రైడింగ్ ప్యాషన్‌ కోసం లద్దాక్ బయలుదేరుతుంది.

    కథలో కీలక మలుపులు

    కథలో కీలక మలుపులు

    బైక్ రైడర్ మహేంద్ర జీవితంలో పాతికేళ్ల క్రితం లద్దాఖ్‌లో ఏం జరిగింది? చావు బతుకుల మధ్య మహేష్ లద్దాఖ్‌కు ఎందుకు బయలుదేరాడు? రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కు లక్ష్ీమ ఎలాంటి ఆవిష్కరణలు చేపట్టింది? బైక్ రైడింగ్‌లో ఛాంపియన్ కావాలని కలలు కన్న అజయ్‌కి ఎదురైన సవాళ్లు ఏమిటి? ప్రియుడి చేతిలో మేఘన ఎలా వంచన గురైంది. మేఘనను ఇష్టపడిన అజయ్ ప్రేమ ఫలించిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఇదే మా కథ.

     బైక్ రైడింగ్ బ్యాక్ డ్రాప్‌గా

    బైక్ రైడింగ్ బ్యాక్ డ్రాప్‌గా

    బైక్ రైడింగ్, బైక్ ఫీల్డ్‌కు సంబంధించిన ఓ నలుగురు వ్యక్తుల జీవితాలకు సంబంధించిన భావోద్వేగమైన కథ ఇది. మరణాన్ని పక్కన పెట్టిన మహేంద్ర, తండ్రి ఆశయం కోసం పాటుపడే లక్ష్మీ, రైడర్‌గా ఉన్నతస్థాయికి వెళ్లాలనే అజయ్, మేఘన లాంటి నలుగురి జీవితంలో చోటుచేసుకొన్న సమస్యలు, సవాళ్లను ఎదురించి ఎలా తమ లక్ష్యాలను సాధించారనే కోణంలో కథ నడుస్తుంది. కథ విషయానికి వస్తే.. రొటీన్‌గానే కనిపిస్తుంది. కాకపోతే కంప్లీట్ రోడ్ జర్నీగా సాగే ఈ కథ ఆసక్తికరంగా సాగుతుంది. కథలో సప్తగిరి, రాంప్రసాద్, థర్టీ ఇయర్స్ పృథ్వీ లాంటి కామెడీ కాస్త ఉపశమనంగా ఉంటుంది. కథనం విషయానికి వస్తే పెద్దగా రిస్క్ చేయకుండా నలుగురి జీవితాలకు సంబంధించిన ఎమోషన్స్‌ను నేరుగా, ఇంట్రెస్టింగ్ చెప్పే ప్రయత్నం దర్శకుడు గురు పవన్ చేశారు. కథలోని భావోద్వేగాలను తెరపైన పండించడంలో దర్శకుడు గురు సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. కథ, కథనాల విషయంలో మరి కొంత దృష్టిపెట్టి ఉంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉండేది.

    శ్రీకాంత్, భూమిక భావోద్వేగమైన పాత్రలో

    శ్రీకాంత్, భూమిక భావోద్వేగమైన పాత్రలో

    తనకు ఇష్టమైన బైక్ రైడింగ్ నేపథ్యంగా రూపొందిన పాత్ర మహేంద్రగా శ్రీకాంత్ కనిపించారు. ఓ సమస్యతో బాధపడుతూ భగ్న ప్రేమికుడి పాత్రలో మెప్పించారు. కథలో ఇతర పాత్రలకు స్పూర్తిగా నిలిచే కీలక పాత్రను పోషించడమే కాకుండా సినిమా భారాన్ని తన భుజాలపై మోశాడు. ఇక లక్ష్మీగా భూమిక మరో కీలక పాత్రలో కనిపించారు. ఇద్దరు పిల్లల తల్లిగా, కుటుంబ బాధ్యతలను మోస్తూనే తండ్రి ఆశయానికి ఊపిరి పోసే మహిళగా బాధ్యతాయుతమైన పాత్రలో కనిపించింది. ఇదే మా కథ మూవీలో మరో ఇంపార్టెంట్ పాత్రను సమర్ధవంతంగా భూమిక పోషించింది.

    తాన్య హోప్, సుమంత్ కెమిస్ట్రీ ఎలా ఉందంటే..

    తాన్య హోప్, సుమంత్ కెమిస్ట్రీ ఎలా ఉందంటే..

    ఇక సుమంత్ అశ్విన్ బైక్ రైడర్‌గా, అతని ప్రేయసిగా తన్యా హోప్ తమ పాత్రల పరిధి మేరకు ఫర్యాలేదనిపించారు. ముఖ్యంగా సుమంత్ కొత్తలుక్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. తన్యా హోప్ తొలి భాగంలో గ్లామర్ పంట పండిస్తే.. రెండో భాగంలో కొంత ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాకు గ్లామర్ పరంగా తన్యా హోప్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. శ్రీకాంత్ అయ్యంగార్, సప్తగిరి, పృథ్వీ, జబర్దస్త్ రాంప్రసాద్ సినిమాకు తమ వంతుగా ఎంటర్‌టైన్‌మెంట్ పంచారు. చివరల్లో సుబ్బరాజు అతిథి పాత్రలో మెరిసారు.

    టెక్నికల్ విభాగాల పనితీరు

    టెక్నికల్ విభాగాల పనితీరు

    ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సునీల్ కశ్యప్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. రీరికార్డింగ్ కారణంగా కొన్ని సన్నివేశాలు మరింత ఎమోషనల్‌గా కనిపించాయి. కొన్ని పాటలు తెరపైన సందర్భోచితంగా పర్వాలేదనిపించాయి. ఇక జునైద్ ఎడిటింగ్ బాగుంది. ముఖ్యంగా సీ రాంప్రసాద్ అందించిన సినిమాటోగ్రఫి సినిమాకు హైలెట్. బైక్ రైడింగ్ విన్యాసాలు, కులుమనాలి, మంచు పర్వతశ్రేణుల్లో చిత్రీకరించిన సన్నివేశాలు బాగున్నాయి.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఇలా..

    ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఇలా..

    నలుగురి జీవితాలకు సంబంధించిన ఎమోషనల్ అంశాలను ఆధారంగా చేసుకొని
    శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత మహేష్ గొల్ల ఇదే మా కథ చిత్రాన్ని రూపొందించారు. అయితే నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక బాగుంది. బైక్ రైడింగ్ నేపథ్యంగా సాగే కథకు సంబంధించి లొకేషన్ల ఎంపిక కూడా బాగుంది. తెరపైన సన్నివేశాలు రిచ్‌గా ఉన్నాయి. కథకు తగినట్టు పొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నాయి. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఈ సినిమాను ఎంజాయ్ చేయడానికి పుష్కలమైన అంశాలు ఉన్నాయి.

    English summary
    Sumanth Ashwin, Bhoomika Chawla, Tanya Hope, Meka Srikanth's latest movie Idhe Maa Katha. This movie released on October 2nd. Here is the complete review of the movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X