twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదీ సాధారణ లవ్‌ స్టోరీ

    By Staff
    |

    Edi Maa Ashok Gadi Love Story
    -జలపతి
    చిత్రం: ఇదీ మా అశోగ్గాడి లవ్‌ స్టోరీ
    నటీనటులు: శివబాలాజీ, కాంచీకౌల్‌, శ్వేత, చంద్రమోహన్‌...
    సంగీతం: ఆనంద్‌ మిలింద్‌
    నిర్మాతలు: ఆకాష్‌ ఖురానా, హరిష్‌ తవాని
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: సురేష్‌ కృష్ణ

    ఎన్నో హిట్‌ చిత్రాలు, భారీ బడ్జెట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు సురేష్‌ కృష్ణ తన ప్రతి చిత్రంలోనూ 'టేకింగ్‌'పై పెట్టిన దృష్టి కథలో 'పట్టు'పై దృష్టిసారించడం లేదు. అదే పొరపాటు కొత్త వాళ్ళతో రూపొందించిన ఇదీ మా అశోగ్గాడి లవ్‌ స్టోరీలోనూ చేశాడు. ఆనంద్‌ మిలింద్‌ స్వరపర్చిన మెలోడి పాటలు ఈ చిత్రానికి ప్రాణం. వెంకటేష్‌ నటించిన ప్రేమ చిత్రంలో ఇళయరాజా పాటలతో ఆకట్టుకునేలా కథనాన్ని రూపొందించిన సురేష్‌ కృష్ణ- ఈ చిత్రం విషయంలో పొరపాటు చేశాడు.

    ప్రధానంగా కథలోనే లోపమే. ఒక విధంగా చెప్పాలంటే వాసు సినిమాకు దీనికి పెద్ద తేడా లేదు. మ్యూజిక్‌ అంటే ఇష్టపడే ఓ యువకుడు ప్రేమలో పడడం అనే పాయింట్‌ ను చివరికి కలగాపులగం చేసి..అటు మ్యూజికల్‌ సినిమా కాకుండా..ఇటు లవ్‌ స్టోరీ కాకుండా సినిమాను మలిచారు.

    అశోక్‌(శివబాలాజీ)కు సంగీతం అంటే ప్రాణం. సంగీతం కోసం ఏదైనా చేస్తాడు. అలాంటి అశోక్‌ గౌరి(కాంచీకౌల్‌)తో ప్రేమలో పడుతాడు. కానీ అశోక్‌ తండ్రి వీరి ప్రేమకు అంగీకరించాడు. గౌరి వల్లే అశోక్‌ కు ఒక ఆల్బమ్‌ చేసేందుకు అవకాశం వస్తుంది. ఆల్బమ్‌ రికార్డింగ్‌ కోసం ముంబై వెళుతుండగా గౌరి తండ్రి (చంద్రమోహన్‌)కు గుండెనొప్పి వస్తుంది.

    ఆ సమయంలో ఆదుకోవాల్సిన అశోక్‌ వారిని అక్కడే వదిలేసి ముంబై వెళుతాడు. ముంబైలోని ఆ రికార్డింగ్‌ కంపెనీ యజమానిని మాఫియా వాళ్ళు చంపేయడంతో అశోక్‌ ఖాళీగా తిరిగివస్తాడు. ఈలోపు అశోక్‌ తల్లితండ్రులు అప్పుల బాధ భరించలేక తల్లితండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. అటు గౌరి కూడా ఊరి నుంచి వెళ్ళిపోయిందని తెలుస్తుంది.

    స్నేహితుల సహాయంతో మళ్ళీ ఆల్బమ్‌ తయారుచేసేందుకు సిద్దమౌతుండగా - కొరియోగ్రాఫర్‌ సుచిత్ర (శ్వేత) పరిచయం అవుతుంది. సుచిత్ర అశోక్‌ ను ప్రేమిస్తుంది. మరోవైపు, తన ఆల్బమ్‌ డైరక్టర్‌ కాబోయో భార్య గౌరి అని అశోక్‌ కకు తెలస్తుంది. ఎంతో డ్రామా అనంతరం గౌరి, అశోక్‌ పెళ్ళి చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

    దర్శకుడు ప్లాష్‌ బ్యాక్‌ మెథడ్‌ లో కొత్త తరహాలో చెప్పేందుకు ప్రయత్నించినా..సినిమా మధ్యలో దర్శకుడు అదుపు తప్పి పేలవంగా ముగుస్తుంది. సీనియర్‌ నటులు చంద్రమోహన్‌, ఉత్తేజ్‌, వైజాగ్‌ ప్రసాద్‌ మినహా అందరి నటన ఓ మోస్తారుగా ఉంది. సంగీతం ఈ సినిమాకు హైలెట్‌. మళ్ళీ..జన్మిస్తే అని కె.కె. హైపిచ్‌ లో పాడిన పాట అద్భుతంగా చిత్రీకరించారు. అతి సాధారణ చిత్రం ఇది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X