Idly Kadai Movie Review: ఇడ్లీ కడాయ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.0/5

నటీనటులు: ధనుష్, నిత్య మీనన్, షాలిని పాండే, సత్యరాజ్, అరుణ్ విజయ్, రాజ్ కిరణ్, సముద్రఖని పార్తీబన్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ధనుష్
నిర్మాత: ధనుష్, ఆకాశ్ భాస్కరన్
మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్
సినిమాటోగ్రఫి: కిరణ్ కౌశిక్
ఎడిటింగ్: ప్రసన్న జీకే
బ్యానర్: వంబర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2025-10-01

మురళీ (ధనుష్) తండ్రి శివకేశవులు (రాజ్ కిరణ్) ఓ చిన్న గ్రామంలో ఇడ్లీ కొట్టు పెట్టుకొని చాలా పద్దతిగా, సంప్రదాయంగా నిర్వహిస్తుంటాడు. శివకేశవులు తయారు చేసే ఇడ్లీలంటే ఆ ప్రాంతంలో ఫుల్ పాపులారిటీ. అలాంటి ఇడ్డీలకు బ్రాండ్ క్రియేట్ చేయాలని మురళీ ప్రయత్నిస్తాడు. కానీ తండ్రి ఒప్పుకోకపోవడంతో తల్లిదండ్రులను వదిలేసి.. బ్యాంకాక్‌లో బిజినెస్ మాగ్నెట్ విష్ణు వర్ధన్ (సత్యరాజ్) గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఫుడ్ సెక్షన్‌లో టాప్ ఉద్యోగిగా మురళీ పనిచేస్తుంటాడు. మురళీని విష్ణువర్ధన్ కూతురు మీరా (షాలిని పాండే) పీకల్లోతు ప్రేమించడంతో వారికి పెళ్లి చేయాలని భావిస్తాడు. పెళ్లికి కొన్ని రోజుల ముందు ఆకస్తాత్తుగా ఊరికి వచ్చిన మురళీ తన తండ్రి నిర్వహించే ఇడ్లీ కొట్టును చూసుకోవాల్సి వస్తుంది. దాంతో పెళ్లి ఆగిపోతుంది. తన చెల్లెలు మీరా పెళ్లి ఆగిపోయిందనే కారణంతో అశ్విన్ (అరుణ్ విజయ్) పగ పెంచుకొంటాడు.

Idly Kadai Tamil Movie Review and Rating
ఇడ్లీ కొట్టు వ్యాపారం విషయంలో మురళీతో తండ్రి శివకేశవులు ఎందుకు విబేధించాడు? తల్లిదండ్రులను వదిలేసి విదేశాలకు వెళ్లిన మురళీ వారికి ఎలా దూరమయ్యాడు? మీరాతో పెళ్లికి ముందు మురళీ లైఫ్‌ను మార్చేసిన సంఘటన ఏమిటి? మీరాతో పెళ్లిని మురళీ ఎందుకు వాయిదా వేయాలని కోరాడు? తండ్రి నిర్వహించే ఇడ్లీ కొట్టు నడిపించే బాధ్యతను మురళీ ఎందుకు చేపట్టాడు? మురళీపై మీరా సోదరుడు, ఆమె తండ్రి ఎందుకు విద్వేషం, పగను పెంచుకొన్నారు? మురళీపై అశ్విన్‌ హత్యా ప్రయత్నం చేశాడు? మర్డర్ అటెంప్ట్ నుంచి తప్పించుకొన్న మురళీ ఏం చేశాడు? కష్టాల్లో ఉన్న మురళీకి కల్యాణి ఎలా అండగా నిలిచింది? మీరా, కల్యాణిలో మురళీ ఎవరిని పెళ్లి చేసుకొన్నాడు? అశ్విన్‌తో గొడవకు మురళీ ఎలా ముగింపు పలికాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఇడ్లీ కొట్టు (ఇడ్లీ కడాయ్) సినిమా కథ.

ఇడ్లీ కొట్టు సినిమా కథ విషయానికి వస్తే.. రొటీన్, రెగ్యులర్ ఇప్పటి వరకు వచ్చిన ఎన్నో మూస కథల మాదిరిగానే ఉంటుంది. కాకపోతే ఫస్టాఫ్‌లో దర్శకుడిగా ధనుష్ రాసుకొన్న కొన్ని ఫాదర్, మదర్ సెంటిమెంట్ సీన్లు ఆడియెన్‌ను ఎంగేజ్ చేసేలా చేశాయి. కానీ కథలో బలమైన ఎమోషన్స్ లేకపోవడం, స్టోరీలో కొత్తదనం లేకపోవడంతో.. ఏదో టెలివిజన్ సీరియల్‌ను చూసినట్టుగా ఉంటుంది. ఇక సన్నివేశాలు బలంగా లేకపోవడం, కథ నింపాదిగా సాగడం ఇవన్నీ సినిమాకు మైనస్‌గా అనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫస్టాఫ్ ఒకే అని సరిపెట్టుకొనేలా ఉంటుంది.

ఇక సెకండాఫ్‌లోనైనా కథను మలుపు తిప్పే సన్నివేశాలు, పాయింట్ బాగుంటుందా? అని ఆశించిన వారికి నిరాశే మిగులుతుంది. సెకండాఫ్‌ మరీ రోటీన్‌గా మారింది. కథ అంతా ఊహించిన విధంగానే సాగుతుంది. రెగ్యులర్ రివేంజ్ డ్రామాగానే సాగుతుంది. నిత్య మీనన్‌తో లవ్ ట్రాక్ అంతగా మెప్పించలేకపోయింది. సముద్రఖని విలనిజం బాగా తేలిపోయింది. సత్యరాజ్, అరుణ్ విజయ్‌తో సాగే సన్నివేశాలు ఆసక్తికరంగా సాగకపోవడం వల్ల సినిమా రెండో భాగం పూర్తిగా నిరాశ పరుస్తుంది. ఈ సినిమాలో కేవలం ఫాదర్ సెంటిమెంట్ ఒకటే ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. మిగితా అన్ని విషయాల్లో ఏది కూడా అంతగా మెప్పించదు.

ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ చిత్రం ఈ మూవీకి పాటలు మైనస్. కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కథలో బలమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల జీవీ ప్రకాశ్ కుమార్ కూడా ఏమీ చేయలేకపోయారనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్లస్ పాయింట్. రూరల్, అర్బన్ బ్యాక్ డ్రాప్‌తో సాగే సీన్లను బాగా తీశారు. తోటలో యాక్షన్ సీన్, ఇతర ఫైట్స్ కొత్తగా అనిపిస్తాయి. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు ఫర్వాలేదనిపిస్తుంది. మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో సినిమాను క్వాలిటీగా తీశారు.. కానీ కథ, కథనాల విషయంలో పెద్ద పట్టింపులేని విధంగా వ్యవహరించారనిపిస్తుంది.

ధనుష్ సినిమా అంటే.. ఏదో ఓక కొత్తదనం, బలమైన ఎమోషన్స్, మాస్ ఆడియెన్స్‌ను ఊరించే యూత్‌ఫుల్ ఎలిమెంట్స్ ఉంటాయని భావిస్తారు. కానీ ఇడ్లీ కడాయ్ విషయంలో ఏ విషయాలు కూడా అంత గొప్పగా అనిపించదు. కథ, కథనాలు ఉడికి ఉడకని రుచిలేని ఇడ్లీలా అనిపిస్తుంది. థియేట్రికల్ వాల్యూస్ ఉన్నట్టు ఎక్కడా అనిపించదు. ఫాదర్ సెంటిమెంట్ తరహా చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే ఛాన్స్ ఉంది. మీ టేస్ట్‌కు తగినట్టు అనిపిస్తే.. ఓసారి లుక్ వేయండి..

More from Filmibeat

Read more about: dhanush Idli Kadai nitya menon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X